బ్యూటిప్స్
పొడిచర్మం గలవారు వేసవిలో ఎదుర్కొనే సమస్యకు పెరుగు మంచి పరిష్కారం. దోస లేదా కీరా ముక్క. కప్పెడు ఓట్స్. పెద్ద చెంచాడు పెరుగు తీసుకోండి. దోస గుజ్జు, ఓట్స్ పెరుగులో కలిపి నానబెట్టి, చిక్కటి మిశ్రమం చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, చేతులకు, మెడకు పట్టించి 30 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రపరుచుకోవాలి.
పెరుగు, ఓట్స్‌లోని సుగుణాలు తేమ లేకుండా నిస్తేజంగా ఉన్న ముఖ చర్మాన్ని మృదువుగా మారుస్తాయి. దోసలోని గుణాలు మలినాలను తొలగించడానికి ఉపయోగపడతాయి. దీని వల్ల చర్మ కాంతి పెరుగుతుంది. అంతేకాదు, ఎండ వల్ల చర్మం మండటం వంటి సమస్యా తగ్గుతుంది. రోజూ ఈ ప్యాక్ వేసుకోవచ్చు.