Knowing
-
హోమ్ లోన్ కోసం చూస్తున్నారా.. తప్పకుండా ఇవి తెలుసుకోండి!
సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. ఈ కలను నెరవేర్చుకోవడానికి చాలామంది అహర్నిశలు కష్టపడుతుంటారు. సంపాదించిన డబ్బును జాగ్రత్తగా పొదుపు చేసినా, బ్యాంకుల నుంచి వంటివి తీసుకున్నా.. అంతా ఇల్లు కోసమే. ఇల్లు కొనేందుకు లేదా కట్టుకోవడానికి బ్యాంక్స్ లోన్ మంజూరు చేస్తాయి. హోమ్ లోన్ పొందే వ్యక్తి తప్పకుండా కొన్ని అంశాలను తెలుసుకోవాల్సి ఉంటుంది.సిబిల్ స్కోర్ - ఒక బ్యాంక్ లోన్ ఇవ్వాలంటే.. సదరు వ్యక్తికి తప్పకుండా మంచి సిబిల్ స్కోర్/క్రెడిట్ స్కోర్ కలిగి ఉండాలి. ఉన్న సిబిల్ స్కోరును బట్టి లోన్ ఇవ్వడం జరుగుతుంది. సిబిల్ స్కోర్ 750 కంటే ఎక్కువ ఉంటే.. అలాంటి వారు సులభంగా కొంత తక్కువ వడ్డీకి లోన్ పొందవచ్చు.అవసరమైన డాక్యుమెంట్స్ - హోమ్ లోన్ తీసుకోవాలనుకునే వారు బ్యాంకులకు లేదా ఇతర ఏదైనా లోన్ ఇచ్చే సంస్థలకు కొన్ని డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆదాయ లేదా ఆస్తి పత్రాలు మాత్రమే కాకుండా పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ వంటివి కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఉద్యోగం చేసేవారైతే మూడు నెలల సాలరీ స్లిప్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది.ప్రాసెసింగ్ ఫీజు - ఏ లోన్ తీసుకున్న దానికి కొంత ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజు పర్సనల్ లోన్ తీసుకునే వారికి కొంత ఎక్కువగా ఉంటుంది. హోమ్ లోన్ లేదా వెహికల్ లోన్ తీసుకునే వారికి మాత్రం కొంత తక్కువగా ఉంటుంది. హోమ్ లోన్ తీసుకునేవారికి 0.5 నుంచి 1 శాతం ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. లోన్ తీసుకునే ముందే వివిధ చార్జీలు, ఫీజుల గురించి పూర్తిగా తెలుసుకోవాల్సి ఉంటుంది.లోన్ డ్యూరేషన్ (కాల వ్యవధి) - లోన్ తీసుకునేవారు కాల వ్యవధిని కూడా నిర్ణయించుకోవాలి. ఒక వ్యక్తి అర్హతను బట్టి బ్యాంకులు గరిష్టంగా 30 సంవత్సరాల వరకు కాల వ్యవధిని అందిస్తాయి. అయితే వీలైనంత త్వరగా లోన్ పూర్తి చేసుకోవడానికి తక్కువ కాల వ్యవధిని ఎంచుకోవడం చాలా ఉత్తమం. డ్యూరేషన్ వ్యవధి ఎక్కువగా ఉంటే వడ్డీ భారం కూడా ఎక్కువగా ఉంటుంది.వడ్డీ రేటు - లోన్ తీసుకునే వ్యక్తి ప్రధానంగా వడ్డీ రేటును గురించి తెలుసుకోవాలి. ప్రభుత్వ బ్యాంకులతో పోలిస్తే.. కొన్ని ప్రైవేట్ సంస్థలు భారీ వడ్డీలకు లోన్స్ అందిస్తాయి. కాబట్టి ఎక్కడైతే తక్కువ వడ్డీకి లోన్ లభిస్తుందో తెలుసుకుని లోన్ తీసుకోవడం ఉత్తమం. ఈ వడ్డీ రేటు రేపో రేటు మీద ఆధారపడి ఉంటుంది.ఈఎంఐ - లోన్ తీసుకునే వ్యక్తి.. తాను ఎంచుకునే కాల వ్యవధిని బట్టి ఈఎంఐ ఆప్షన్ కూడా ఎంచుకోవచ్చు. ఇది పూర్తిగా లోన్ తీసుకునే వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. అంటే సంపాదన, ఖర్చులు వంటి వాటిని బేరీజు వేసుకుని ఈఎంఐ ఎంత కట్టాలనేది నిర్ణయించుకోవచ్చు. లోన్ ఈఎంఐ అనేది సంపాదనలో 45 శాతం కంటే ఎక్కువ కాకుండా ఉంటే ఉత్తమమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? తప్పకుండా ఇవి తెలుసుకోండిఇవి మాత్రమే కాకుండా హోమ్ లోన్ ప్రీ పేమెంట్, పన్ను రాయితీలు, హోమ్ లోన్ ఇన్సూరెన్స్, లోన్ డీఫాల్ట్ వంటి విషయాలను గురించి కూడా ముందుగా తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకున్న తరువాత హోమ్ లోన్ తీసుకోవాలి. బ్యాంకులు లోన్ ఇస్తున్నాయి కదా ఎగబడి తీసుకున్నారంటే.. ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. -
మోచేతుల నలుపు తగ్గడానికి...
బ్యూటిప్స్ భుజాలు, కాళ్లపైన చర్మం నలుపుగా అవుతుంటుంది. ఈ సమస్య పరిష్కారానికి...కొబ్బరి నూనె లేదా బాదం నూనె పొడి చర్మాన్ని మృదువుగా మారుస్తాయి.రోజూ స్నానానికి ముందు నిమ్మరసం రాసి, పది నిమిషాలు ఉంచాలి.టొమాటో రసం లేదా దానిమ్మ రసం తేనె లేదా నూనెతో కలిపి మోకాళ్లకు, మోచేతులకు రాసి, రుద్ది, శుభ్రపరుచుకుంటే నలుపు సులువుగా తగ్గుతుంది. వెచ్చని నీటిలో టవల్‌ను ముంచి నలుపుగా ఉన్న చోట మృదువుగా రబ్ చేయాలి. టీ స్పూన్ కొబ్బరి నూనె, అర టీ స్పూన్ నిమ్మరసం కలిపి మోచేతులు, మోకాళ్లపై రాసి వేడి తువ్వాలతో తుడవాలి. నువ్వుల నూనెలో చర్మాన్ని మృదువుగా ఉంచే సుగుణాలు పుష్కలంగా ఉన్నాయి. వారానికి ఒకసారి నలుగుకు నువ్వుల నూనె ఉపయోగించడం వల్ల చర్మానికి కావల్సిన ఫ్యాటీ యాసిడ్స్ అంది, మృదువుగా అవుతుంది. రెండు టీ స్పూన్ల పెరుగులో కొద్దిగా బాదం పొడి కలిపి నలుపుగా ఉన్న చోట రాసి, రుద్ది, శుభ్రపరచాలి. పాల మీగడలో చిటికెడు పసుపు రాసి, నలుపుగా ఉన్న చోట రాసి, రుద్ది, శుభ్రపరచాలి .రోజూ స్నానానికి ముందు గోరువెచ్చని కొబ్బరి నూనె రాసుకుంటే చర్మం మృదువుగా అవుతుంది. రెండు టీ స్పూన్ల ఆలివ్ ఆయిల్, టీ స్పూన్ పంచదార కలిపి మోకాళ్లకు, మోచేతులకు రాసి, రుద్దాలి. ఇలా చేయడం వల్ల నలుపు తగ్గుతుంది. -
బ్యూటిప్స్
పొడిచర్మం గలవారు వేసవిలో ఎదుర్కొనే సమస్యకు పెరుగు మంచి పరిష్కారం. దోస లేదా కీరా ముక్క. కప్పెడు ఓట్స్. పెద్ద చెంచాడు పెరుగు తీసుకోండి. దోస గుజ్జు, ఓట్స్ పెరుగులో కలిపి నానబెట్టి, చిక్కటి మిశ్రమం చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, చేతులకు, మెడకు పట్టించి 30 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రపరుచుకోవాలి. పెరుగు, ఓట్స్‌లోని సుగుణాలు తేమ లేకుండా నిస్తేజంగా ఉన్న ముఖ చర్మాన్ని మృదువుగా మారుస్తాయి. దోసలోని గుణాలు మలినాలను తొలగించడానికి ఉపయోగపడతాయి. దీని వల్ల చర్మ కాంతి పెరుగుతుంది. అంతేకాదు, ఎండ వల్ల చర్మం మండటం వంటి సమస్యా తగ్గుతుంది. రోజూ ఈ ప్యాక్ వేసుకోవచ్చు.