చర్మకాంతికి పసుపు, దోస.. | Beauty tips:Natural Facepacks | Sakshi
Sakshi News home page

చర్మకాంతికి పసుపు, దోస..

Published Fri, Jul 27 2018 1:30 AM | Last Updated on Fri, Jul 27 2018 1:30 AM

Beauty tips:Natural Facepacks - Sakshi

ఈ కాలం చర్మం కాంతిమంతంగా మారాలంటే ఉపయోగపడే సహజసిద్ధమైన ఫేస్‌ప్యాక్స్‌ ఇవి.. 

∙రెండు టేబుల్‌ స్పూన్ల గంధంపొడి, అరకప్పు రోజ్‌వాటర్, టేబుల్‌ స్పూన్‌ పసుపు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించాలి. అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రపరచాలి. ఈ ఫేస్‌ప్యాక్‌ రోజూ వేసుకోవడం వల్ల ముఖంపై మురికి, మచ్చలు తగ్గి చర్మకాంతి పెరుగుతుంది. 

∙ఈ కాలం సహజసిద్ధమైన బ్లీచింగ్‌గా ఉపయోగపడేది దోస లేదా కీర. వీటిని గుజ్జు చేసి ముఖానికి, మెడకు, చేతులకు రాసుకోవాలి. పది నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. జిడ్డు చర్మం గల వారికి ఈ ప్యాక్‌ బాగా పనిచేస్తుంది. 

∙రెండు టేబుల్‌ స్పూన్ల జొజోబా ఆయిల్‌ (మార్కెట్లో లభిస్తుంది), రెండు టేబుల్‌ స్పూన్ల తాజా పెరుగు, టీ స్పూన్‌ తేనె ఈ మూడూ ఒక పాత్రలో వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి 10–15 నిమిషాలు ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరచాలి. పొడి చర్మం గలవారికి ఇది మహత్తరమైన ఫేస్‌ప్యాక్‌.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement