బ్యూటీ టిప్స్
►అరకప్పు కీరదోస గుజ్జు తీసుకుని అందులో కోడిగుడ్డులోని తెల్లసొన, చెంచా నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి చేసి 20 నిమిషాల ΄ాటు ఆరనివ్వండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేయండి. కీరాదోస పిగ్మెంటేషన్ సమస్యను దూరం చేస్తుంది. దీనితో పాటు ముడతలు, సన్నని గీతలు వంటి సమస్యలు దూరం అవుతాయి.
►ఒక పాత్రలో బార్లీ గింజల పొడిని తీసుకుని అందులో కొద్దికొద్దిగా గోరువెచ్చటి నీళ్లు పోసుకుంటూ ముద్దలా కలుపుకోవాలి. ఈ పేస్ట్‌ను చక్కగా కలిపి ముఖానికి ΄్యాక్‌లా అప్లై చేయండి. దీన్ని 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా తరచు చేస్తుండడం వల్ల. మచ్చలు, మృత కణాలు తొలగిపోయి చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది.
►పాలల్లో కొద్దిగా ఓట్స్ వేసి ఉడికించాలి. తర్వాత ఇందులో కాస్త పెరుగు, తేనె వేసి బాగా కలపాలి. ఇది కాస్త చల్లబడిన తర్వాత బ్లాక్‌హెడ్స్ ఉన్న చోట అప్లై చేసుకుని 20 నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. బాగా తర్వాత తేలికపాటి క్లెన్సర్‌ను ఉపయోగించి ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ మాస్క్ వేసుకోవడం వల్ల చర్మంపై ఉండే బ్లాక్‌హెడ్స్ సులభంగా తొలగిపోతాయి.
Comments
Please login to add a commentAdd a comment