అవిసె గింజలతో జుట్టు సిల్కీగా, స్ట్రెయిట్‌గా.. ఈ ప్యాక్‌ ట్రై చేయండి | How To Get Silky And Straight Hair With Natural Remedies | Sakshi
Sakshi News home page

అవిసె గింజలతో జుట్టు సిల్కీగా, స్ట్రెయిట్‌గా.. ఈ ప్యాక్‌ ట్రై చేయండి

Nov 2 2023 10:51 AM | Updated on Nov 2 2023 12:11 PM

How To Get Silky And Straight Hair With Natural Remedies - Sakshi

బ్యూటీ టిప్స్‌

రెండు టీస్పూన్ల కొబ్బరి నూనెలో టీ స్పూను పసుపు, టేబుల్‌ స్పూను పెరుగు, టేబుల్‌ స్పూను శనగపిండి, రెండు టీస్పూన్ల టొమాటో రసం, రెండు టీస్పూన్ల నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ, చేతులకు రాసి ఐదునిమిషాలు రుద్దాలి. తరువాత నీటితో కడిగితే ట్యాన్‌ మొత్తం పోతుంది.

స్ట్రెయిట్‌గా... సిల్కీగా...

గ్లాసు నీటిలో రెండు టీసూన్ల అవిసె గింజలు, రెండు టీ స్పూన్ల బియ్యప్పిండి వేసి పదినిమిషాలు మరిగించాలి. తరువాత వడగట్టి...పేస్టులాంటి పదార్థాన్ని తీసుకోవాలి. దీనిలో టేబుల్‌స్పూను కొబ్బరి నూనె వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని మాడు నుంచి చివర్లవరకు పట్టించాలి. గంట తరువాత కడిగేయాలి. ఈ ప్యాక్‌ జుట్టుని స్ట్రెయిట్‌గా, సిల్కీగా మారుస్తుంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement