హోలీ జరుపుకోని ప్రదేశాలు కూడా ఉన్నాయి తెలుసా?
రంగుల పండుగ హోలీ అంటే దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారు. చిన్నా పెద్దా అంతే రంగుల్లో మునిగి తేలతారు. కానీ దేశంలో హోలీ జరుపుకోని కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. హోలీ ఎందుకు ఆడరో..ఆ కారణాలేంటో ఒకసారి చూద్దాం..
ఉత్తరప్రదేశ్
ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలోని క్విలీ, కుర్జాన్, జౌడ్లా మూడు గ్రామాలలో కూడా హోలీ పండుగను జరుపుకోరు. తమ ఇష్టమైన దేవత త్రిపుర సుందరి దేవి. ఒకటిన్నర శతాబ్దం క్రితం, ప్రజలు ఈ గ్రామంలో హోలీ జరుపుకోవడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో గ్రామంలో కలరా మహమ్మారి వ్యాపించింది. ఇక అప్పటినుంచి ఇక్కడి ప్రజలు హోలీ జరుపుకోవడానికి ఇష్టపడరు.ఇక్కడి త్రిపుర సుందరి దేవతకి శబ్దాలు నచ్చవని స్థానికులు చెబుతారు.హోలీ తమకు అచ్చి రాదని భావిస్తారట. అందుకే 150 ఏళ్లుగా హోలీ సంబరాలు చేసుకోరట.
జార్ఖండ్: జార్ఖండ్‌లోని బొకారోలోని కస్మార్ బ్లాక్ సమీపంలోని దుర్గాపూర్ గ్రామంలో సుమారు 100 ఏళ్లకు పైగా ఇక్కడ హోలీ జరుపుకోవడం లేదు. ఒక శతాబ్దం క్రితం హోలీ రోజున ఇక్కడ ఒక రాజు కుమారుడు మరణించాడు. ఆ తర్వాత ఊరిలో హోలీ సంబరాలు చేసుకుంటే అరిష్టమని భావిస్తారు. కానీ కొంతమంది మాత్రం పొరుగూరికి హోలీ పండుగ చేసుకుంటారు.
గుజరాత్: గుజరాత్‌లోని బనస్కాంత జిల్లా రంసాన్ గ్రామంలో కూడా ప్రజలు హోలీని జరుపుకోరు. కొంతమంది సాధువులచే శాపగ్రస్తమైందట ఈ గ్రామం. అందుకే అప్పటి నుండి హోలీ జరుపుకోవడానికి భయపడతారు ప్రజలు .
మధ్యప్రదేశ్: 125 ఏళ్ల క్రితం మధ్యప్రదేశ్‌లోని బైతుల్ జిల్లా ముల్తాయ్ తహసీల్‌లోని దహువా గ్రామంలో, బావిలో బాలుడు నీటిలో మునిగి చనిపోయాడట. ఈ విషాద ఘటనతో హోలీ ఆడటం తమకు చెడు శకునంగా భావించారు. దీంతో ఇక్కడ ఎవరూ హోలీ ఆడరని చెబుతారు.
తమిళనాడు: దక్షిణ భారత రాష్ట్రం తమిళనాడు చాలా దేవాలయాలకు ప్రసిద్ధి. ఇక్కడ భక్తి కూడా ఎక్కువ అని చెబుతారు. కానీ ఉత్తర భారతంతో జరుపు కున్నంతగా హోలీని ఇక్కడ జరుపుకోరు. హోలీ పౌర్ణమి రోజున వస్తుంది కాబట్టి, తమిళులు మాసి మాగంగా జరుపుకుంటారు. పవిత్ర నదులు, చెరువులు, సరస్సులలో స్నానం చేయడానికి ,పూర్వీకులు భూమిపైకి వచ్చే పవిత్రమైన రోజు అని నమ్ముతారు. అందుకే ఇక్కడ ఆ రోజు హోలీ ఆడరు. అయితే పుదుచ్చేరి లాంటి టూరిస్ట్ ప్రదేశాలలో హోలీ వేడుకలు ఘనంగా జరుగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment