no holiday
-
Holi 2024: మన దేశంలో ఇక్కడ హోలీ సంబరాలుండవు, ఎందుకో తెలుసా?
రంగుల పండుగ హోలీ అంటే దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారు. చిన్నా పెద్దా అంతే రంగుల్లో మునిగి తేలతారు. కానీ దేశంలో హోలీ జరుపుకోని కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. హోలీ ఎందుకు ఆడరో..ఆ కారణాలేంటో ఒకసారి చూద్దాం.. ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలోని క్విలీ, కుర్జాన్, జౌడ్లా మూడు గ్రామాలలో కూడా హోలీ పండుగను జరుపుకోరు. తమ ఇష్టమైన దేవత త్రిపుర సుందరి దేవి. ఒకటిన్నర శతాబ్దం క్రితం, ప్రజలు ఈ గ్రామంలో హోలీ జరుపుకోవడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో గ్రామంలో కలరా మహమ్మారి వ్యాపించింది. ఇక అప్పటినుంచి ఇక్కడి ప్రజలు హోలీ జరుపుకోవడానికి ఇష్టపడరు.ఇక్కడి త్రిపుర సుందరి దేవతకి శబ్దాలు నచ్చవని స్థానికులు చెబుతారు.హోలీ తమకు అచ్చి రాదని భావిస్తారట. అందుకే 150 ఏళ్లుగా హోలీ సంబరాలు చేసుకోరట. జార్ఖండ్: జార్ఖండ్‌లోని బొకారోలోని కస్మార్ బ్లాక్ సమీపంలోని దుర్గాపూర్ గ్రామంలో సుమారు 100 ఏళ్లకు పైగా ఇక్కడ హోలీ జరుపుకోవడం లేదు. ఒక శతాబ్దం క్రితం హోలీ రోజున ఇక్కడ ఒక రాజు కుమారుడు మరణించాడు. ఆ తర్వాత ఊరిలో హోలీ సంబరాలు చేసుకుంటే అరిష్టమని భావిస్తారు. కానీ కొంతమంది మాత్రం పొరుగూరికి హోలీ పండుగ చేసుకుంటారు. గుజరాత్: గుజరాత్‌లోని బనస్కాంత జిల్లా రంసాన్ గ్రామంలో కూడా ప్రజలు హోలీని జరుపుకోరు. కొంతమంది సాధువులచే శాపగ్రస్తమైందట ఈ గ్రామం. అందుకే అప్పటి నుండి హోలీ జరుపుకోవడానికి భయపడతారు ప్రజలు . మధ్యప్రదేశ్: 125 ఏళ్ల క్రితం మధ్యప్రదేశ్‌లోని బైతుల్ జిల్లా ముల్తాయ్ తహసీల్‌లోని దహువా గ్రామంలో, బావిలో బాలుడు నీటిలో మునిగి చనిపోయాడట. ఈ విషాద ఘటనతో హోలీ ఆడటం తమకు చెడు శకునంగా భావించారు. దీంతో ఇక్కడ ఎవరూ హోలీ ఆడరని చెబుతారు. తమిళనాడు: దక్షిణ భారత రాష్ట్రం తమిళనాడు చాలా దేవాలయాలకు ప్రసిద్ధి. ఇక్కడ భక్తి కూడా ఎక్కువ అని చెబుతారు. కానీ ఉత్తర భారతంతో జరుపు కున్నంతగా హోలీని ఇక్కడ జరుపుకోరు. హోలీ పౌర్ణమి రోజున వస్తుంది కాబట్టి, తమిళులు మాసి మాగంగా జరుపుకుంటారు. పవిత్ర నదులు, చెరువులు, సరస్సులలో స్నానం చేయడానికి ,పూర్వీకులు భూమిపైకి వచ్చే పవిత్రమైన రోజు అని నమ్ముతారు. అందుకే ఇక్కడ ఆ రోజు హోలీ ఆడరు. అయితే పుదుచ్చేరి లాంటి టూరిస్ట్ ప్రదేశాలలో హోలీ వేడుకలు ఘనంగా జరుగుతాయి. -
AP: రెండో శనివారం బడులు, కాలేజీలకు పనిదినమే
సాక్షి, అమరావతి: ఆజాదీ కా అమృతోత్సవాలను ఈనెల 15న ఘనంగా నిర్వహించడానికి, విద్యార్థులందరి భాగస్వామ్యాన్ని పెంచడానికి సన్నాహ కార్యక్రమాల కోసం ఈనెల 13వ తేదీ రెండో శనివారాన్ని పనిదినంగా పరిగణిస్తూ పాఠశాల విద్యాశాఖ, ఇంటర్మీడియట్ విద్యా శాఖ సర్క్యులర్లు విడుదల చేశాయి. 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 15న పెద్ద ఎత్తున సంబరాన్ని నిర్వ హించడానికి ఆజాదీ కా అమృతోత్సవాల పేరిట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ కార్యక్రమా లను రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ ఉత్సవాల్లో భాగంగా గురువారం నుంచి హర్ ఘర్ జెండా కార్యక్రమం చేపట్టారు. పలు కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. 13, 14 తేదీలు రెండో శనివారం, ఆదివారం సెలవు దినాలుగా ఉండడంతో సన్నాహక కార్యక్రమాలకు ఆటంకంగా మారింది. విద్యార్థులు ఆయా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రిహార్సల్స్ వంటివి చేయించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రెండో శనివారం సెలవు దినాన్ని పనిదినంగా కొనసాగించాలని పాఠశాల విద్యాశాఖ, ఇంటర్మీడియట్ విద్యాశాఖ కమిషనర్లు ఎస్.సురేష్‌కుమార్, ఎం.వి.శేషగిరిబాబు సర్క్యులర్లు విడుదల చేశారు. జూనియర్ కాలేజీలకు రెండో శనివారానికి బదులు మూడో శనివారాన్ని సెలవు దినంగా ప్రకటించాలని ఇంటర్మీడియట్ విద్య కమిషనర్.. రీజనల్ జాయింట్ డైరెక్టర్లకు సూచించారు. (క్లిక్: మార్పును పట్టుకుందాం) -
సీఎం కీలక నిర్ణయం.. ఆగస్టు 15న బడులు, ఆఫీసులకు సెలవు రద్దు
NO holiday on August 15.. ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జరగబోయే ఆగస్టు 15న విద్యాసంస్థలకు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవును రద్దు చేస్తూ సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అయితే, దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఈ ఏడాదికి 75 సంవత్సరాలు పూర్తి కానుంది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్నందున ప్రతీ జిల్లాలో ఈ ఏడాది ప్రత్యేక కార్యక్రమంగా ఈ స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిర్వహించనున్నట్టు ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. అలాగే, రాష్ట్రంలో ఇండిపెండెన్స్ డేను పురస్కరించుకొని వారోత్సవాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. కాగా, వారోత్సవాల్లో ప్రతీరోజు ఒక్కో కార్యక్రమం నిర్వహించనున్నట్టు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో యూపీలో స్వచ్చ భారత్‌లో భాగంగా స్వాతంత్ర్య పోరాట యోధులకు సంబంధించిన ప్రదేశాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగానే అన్ని విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. అలాగే, ఎన్సీసీ, స్కౌట్ విద్యార్ధులతో పాటు స్వచ్ఛంద సంస్థలను, వ్యాపార సంస్థలను కూడా ఇందులో పాల్గొనేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డి.ఎస్.మిశ్రా మాట్లాడుతూ దీపావళి పండుగ సందర్భంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం చేపడతామని, దీనిని జాతీయ ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దాలన్నారు. #IndependenceDay: Schools, colleges, offices to remain open in #UttarPradesh on August 15https://t.co/vtyROzHLli — TIMES NOW (@TimesNow) July 15, 2022 ఇది కూడా చదవండి: మాజీ సీఎంకు ఊహించని చేదు అనుభవం.. మహిళ చేసిన పనికి షాక్ -
టీచర్లు స్కూళ్లకు వెళ్లాల్సిందే
సాక్షి, హైదరాబాద్: పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ప్రకటించినా టీచర్లు మాత్రం పాఠశాలలకు Ðððlళ్లాలని, పరీక్షల విధులను నిర్వర్తించాలని, పెండింగ్ పనులను పూర్తి చేసుకోవాలని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా డీఈవోలు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సోమవారం ఇంటర్మీడియెట్, పాఠశాల విద్యాశాఖ జిల్లాల అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంటర్ స్పాట్ వ్యాల్యుయేషన్ విధులు, టెన్త్ పరీక్ష విధులు పడిన వారు కచ్చితంగా వాటిని పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ మూసివేయకుండా, తరగతులను నిర్వహించిన పాఠశాలలకు నోటీసులు జారీ చేసినట్లు చిత్రా రామచంద్రన్ తెలిపారు. ఇవేకాకుండా ఇంజనీరింగ్ కాలేజీలు తరగతులను నిర్వహిస్తున్నట్లు విద్యా శాఖ దృష్టికి వచ్చింది. వాటిపైనా చర్యలు చేపట్టేందుకు సిద్ధం అవుతోంది. అందులో మంత్రి మల్లారెడ్డి బంధువు విద్యా సంస్థ కూడా ఉన్నట్లు సమాచారం. ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను కరోనా నేపథ్యంలో మాస్క్‌లతో అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులు మాస్క్‌లు ధరించి పరీక్షలకు హాజరు కావచ్చని వెల్లడించింది. ‘అంగన్వాడీ కేంద్రాలకూ సెలవులివ్వాలి’ కోవిడ్ హెల్త్ ఎమర్జెన్సీ నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాలకు కూడా సెలవులు ఇవ్వాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రభుత్వాన్ని కోరింది. -
సారీ... దీపావళికి సెలవు ఇవ్వలేం!
టెక్సాస్ : దీపావళిని సెలవు దినంగా పరిగణించాలన్న భారతీయుల విజ్ఞప్తిని అమెరికాలోని ఓ విద్యాసంస్థ తిరస్కరించింది. హిందు పండగలను సెలవు దినాలుగా పరిగణించటం కుదరదని తేల్చి చెప్పింది. మతపరమైన దినాలను సెలవులుగా పరిగణించటం వీలు కాదని.. విద్యార్థులు హాజరుకాకపోతే అది గైర్హాజరు(అబ్సెంట్) కిందకే వస్తుందని ఓ ప్రకటనలో పేర్కొంది. ‘‘అది హిందువుల పండగా. ఇక్కడ సంప్రదాయానికి సంబంధం లేనిది. పైగా కొత్త నిబంధనల ప్రకారం... మత సంబంధిత వేడుకలకు సెలవులు ఇవ్వకూడదని స్పష్టం ఉంది. అలాంటప్పుడు దీపావళికే కాదు.. ఏ పండగలకు కూడా సెలవులు ఇవ్వటం కుదరదని’’ ఐఎస్డీ తెలిపింది. అయితే గుడ్‌ప్రైడే విషయంలో మినహాయింపు ఇవ్వటంపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. దానిని ప్రోఫెషనల్ డే(వెదర్ డే) గా మాత్రమే పరిగణిస్తున్నామని వివరణ ఇచ్చింది. టెక్సాస్ ఎడ్యుకేషన్ ఏజెన్సీ పరిధిలోని కొప్పెల్ ఇండిపెండెట్ స్కూల్ డిస్ట్రిక్ లో చదువుతున్న విద్యార్థుల్లో 43.88 శాతం ఆసియా వాసులే. వీరిలో వందల సంఖ్యలో భారతీయ విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసిస్తున్నారు. అందులో మెజార్టీ దక్షిణ భారత దేశానికి చెందిన వారే ఉన్నారు. తల్లిదండ్రులంతా కలిసి దీపావళిని సెలవు దినంగా ప్రకటించాలని గత కొంత కాలంగా విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు. తాజాగా ఐఎస్డీ ఈ ఏడాదికిగానూ సెలవుల జాబితా ప్రకటించింది. ఇందులో దీపావళిని చేర్చకపోవటంతో భారతీయులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం నిరాశజనకంగా ఉందని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ అసోసియేట్ ఫ్రొఫెసర్ పంకజ్ జైన్ వెల్లడించారు. సంతకాల సేకరణ... దీపావళికి సెలవు ప్రకటించాలని కొప్పెల్ ఐఎస్డీలో ఉద్యమం పెద్ద ఎత్తునే జరిగింది. ఆ సమయంలో కొందరు భారతీయ విద్యార్థులు సంతకాల సేకరణ చేపట్టగా.. దానిపై 1700 మంది సంతకాలు చేశారు. దీంతో ఈ వ్యవహారంపై పంకజ్ జైన్ గతంలో ఐఎస్డీ సూపరిడెంట్ బ్రాడ్ హంట్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. అయితే ఐఎస్డీ మాత్రం అవేం పట్టించుకోలేదు. 2003లో తొలిసారి వైట్ హౌస్‌లో అధ్యక్షుడు జార్జి బుష్ దీపావళి వేడుకల్లో పాల్గొనగా.. అప్పటి నుంచి అది కొనసాగుతూ వస్తోంది. గతేడాది ట్రంప్ కుటుంబం వేడుకలో కూడా ఉత్సాహంగా పాల్గొనగా.. దీపావళికి గుర్తుగా ఓ స్టాంప్‌ను కూడా విడుదల చేశారు. ఇక ఐక్యరాజ్యసమితి కూడా 2014 నుంచి దీపావళి వేడుకలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం యూఎన్ఓకి ఈ పండగ అప్షనల్ హాలీడేగా ఉంది. మరోవైపు న్యూ యార్క్, న్యూ జెర్సీ ల్లో దీపావళిని ఫ్రొఫెషనల్ డెవెలప్మెంట్(వెదర్ డే) గా పరిగణిస్తున్నారు. ఈస్ట్ మిడో స్కూల్ డిస్ట్రిక్, ఈస్ట్ విలిస్టన్ యూనియన్ ఫ్రీ స్కూల్ డిస్ట్రిక్, హాప్ హలో హిల్స్ సెంట్రల్ స్కూల్ డిస్ట్రిక్, హెర్రిక్స్ యూనియన్ ఫ్రీ స్కూల్ డిస్ట్రిక్ లలో దీపావళిని సెలవు దినంగా ప్రకటించాయి. -
13న పాఠశాలలకు సెలవు లేదు
అనంతపురం ఎడ్యుకేషన్ : హోలి పండుగ సెలవును ప్రభుత్వం ఈనెల 12న ప్రకటించిన నేపథ్యంలో 13న పాఠశాలలకు సెలవు ఉండదని జిల్లా విద్యాశాఖ అధికారి పగడాల లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 2016–17 విద్యా సంవత్సరం అకడమిక్ కేలండర్ ప్రకారం ఈనెల 13న సెలవు ఉందని, అయితే 12న సెలవు ఉండడంతో 13న యథావిధిగా పాఠశాలలు పని చేయాలని అన్ని యాజమాన్యాలను ఆదేశించారు. -
నేడు జాతీయ సెలవు దినం కాదు: కేంద్రం
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతికి సంతాప సూచకంగా కేంద్ర ప్రభుత్వం ఏడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. కాగా మంగళవారం జాతీయ సెలవు దినం కాదని, ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తాయని ఓ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. కలాం మృతికి సంతాప సూచకంగా ఈ రోజును జాతీయ సెలవుదినంగా ప్రకటించినట్టు వార్తలు రావడంతో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 27 నుంచి వచ్చే నెల 2 వరకు సంతాప దినాలలో ఎలాంటి అధికారిక వినోద కార్యక్రమాలు నిర్వహించరు. కలాంకు ఎక్కడ, ఎప్పుడు అంత్యక్రియలు నిర్వహించాలన్న విషయాన్ని ఇంకా నిర్ణయించలేదని, ఈ విషయాన్ని తెలియజేస్తామని కేంద్రం పేర్కొంది. -
గాంధీజయంతి సెలవును రద్దుచేసిన కేంద్రం
దేశాన్ని పరిశుభ్రంగా మార్చడానికి చేపట్టిన 'స్వచ్ఛభారత్' కార్యక్రమం కోసం కేంద్రం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ రెండో తేదీ గాంధీ జయంతి రోజున ఈ కార్యక్రమం చేపడుతున్న సందర్భంగా ఆరోజు సెలవును రద్దుచేసింది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు వేటికీ ఆరోజు సెలవు ఉండబోదు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కార్యాలయాల్లో ఉద్యోగులు స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొనాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోదీ అక్టోబర్ రెండోతేదీన ప్రారంభిస్తారు. స్వయంగా తాను సైతం ఆరోజు చీపురు పట్టుకుని శుభ్రపరుస్తానని మోదీ ఇంతకుముందే చెప్పారు. ఆ రోజు కార్యక్రమంలో పలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కార్పొరేట్ కార్యాలయాలు కూడా పాల్గొంటాయి. ఇండియా గేట్ వద్ద మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. బాపూజీ 150వ జయంతి సందర్భంగా ఈ భారీ కార్యక్రమం చేపట్టారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తదితర సెలబ్రిటీలు కూడా ఈ బృహత్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.