అనంతపురం ఎడ్యుకేషన్ : హోలి పండుగ సెలవును ప్రభుత్వం ఈనెల 12న ప్రకటించిన నేపథ్యంలో 13న పాఠశాలలకు సెలవు ఉండదని జిల్లా విద్యాశాఖ అధికారి పగడాల లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 2016–17 విద్యా సంవత్సరం అకడమిక్ కేలండర్ ప్రకారం ఈనెల 13న సెలవు ఉందని, అయితే 12న సెలవు ఉండడంతో 13న యథావిధిగా పాఠశాలలు పని చేయాలని అన్ని యాజమాన్యాలను ఆదేశించారు.