నేడు జాతీయ సెలవు దినం కాదు: కేంద్రం | Seven-day state mourning but no holiday | Sakshi
Sakshi News home page

నేడు జాతీయ సెలవు దినం కాదు: కేంద్రం

Published Tue, Jul 28 2015 9:34 AM | Last Updated on Sat, Apr 6 2019 9:38 PM

నేడు జాతీయ సెలవు దినం కాదు: కేంద్రం - Sakshi

నేడు జాతీయ సెలవు దినం కాదు: కేంద్రం

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతికి సంతాప సూచకంగా  కేంద్ర ప్రభుత్వం ఏడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. కాగా మంగళవారం జాతీయ సెలవు దినం కాదని, ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తాయని ఓ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. కలాం మృతికి సంతాప సూచకంగా ఈ రోజును జాతీయ సెలవుదినంగా ప్రకటించినట్టు వార్తలు రావడంతో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

ఈ నెల 27 నుంచి వచ్చే నెల 2 వరకు సంతాప దినాలలో ఎలాంటి అధికారిక వినోద కార్యక్రమాలు నిర్వహించరు. కలాంకు ఎక్కడ, ఎప్పుడు అంత్యక్రియలు నిర్వహించాలన్న విషయాన్ని ఇంకా నిర్ణయించలేదని, ఈ విషయాన్ని తెలియజేస్తామని కేంద్రం పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement