దేశంలో హోలీ సంబరాలు మొదలైపోయాయి. సాధారణ ప్రజల మాదిరిగానే.. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి 'పుష్కర్‌సింగ్ ధామి' కూడా తన కుటుంబ సభ్యులతో హోలీ జరుపుకున్నారు. తన తల్లి విష్ణదేవి, భార్య గీతా ధామితో కలిసి హోలీ పాటకు డ్యాన్స్ చేశారు.
హోలీని ప్రేమ, సోదరభావం, సామరస్యానికి సంబంధించిన వేడుకగా సీఎం పుష్కర్‌సింగ్ ధామి అభివర్ణించారు. ఉత్తరాఖండ్‌లో హోలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉందని ఆయన అన్నారు. సీఎం ధామి హోలీ జరుపుకున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నిజానికి హోలీ రేపు (మార్చి 25) జరగాల్సి ఉండగా.. దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే ప్రారంభించారు. పండుగ ముందు హోలికా దహన్ పేరుతో భోగి మంటలను వెలిగించే ఆచారం ఉంటుంది. ఇది హోలికా అనే రాక్షసిని దహనం చేసే కార్యక్రమం. ఆనందోత్సాహాల మధ్య, సాంప్రదాయ స్వీట్లు పంచుకుంటారు, ప్రజలలో స్నేహం, ఐక్యత భావాన్ని ఈ పండుగల ద్వారా పెంపొందించుకుంటారు.
#WATCH | Dehradun | On the occasion of Holi, Uttarakhand Chief Minister Pushkar Singh Dhami dances to a Holi song with his mother Vishna Devi, wife Geeta Dhami and others. pic.twitter.com/p8JeSNSm8A
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 24, 2024
Comments
Please login to add a commentAdd a comment