హోలీ అనగానే చిన్నా, పెద్దా రంగులు జల్లుకుంటూ ఎంజాయ్ చేస్తారు. మత పర భేదం లేకుండా అందరూ రంగులతో ఆనందహేళిలో మునిగి తేలుతుంటారు. అలాంటి హోలీని భారతదేశంలోని పలు రాష్ట్రల ప్రజలు విభిన్న సంప్రదాయాల్లో చేసుకుంటారు. అక్కడి ఆచారాలకు అనుగుణం చేసుకోవడం వరకు ఓకే. కానీ కొన్ని చోట్ల హోలీ పండుగా చాలా విచిత్రంగా జరుపుకుంటారు. ఎంతలా అంటే వామ్మో..! ఏంటిది..! అని విస్తుపోయాలా వింతగా జరుకుంటారు. అంత విలక్షణమైన సంప్రదాయాలు ఎక్కడున్నాయంటే..
రంగులు బదులు కర్రలతో..
ఉత్తరప్రదేశ్లోని బర్సానాలో హోలీ రోజున రంగులు చల్లుకోవడమే కాదు మహిళలు కర్రలతో పురుషులను వెంటపడి కొడతారు. స్త్రీలంతా కర్రలనే తమ ఆయుధాలుగా ధరించి ఎక్కడ పురుషులు కనిపించినా వారిని వెంబడించి మరీ కొడతారు. అయితే ఇది సరదాగా ఆడే సంప్రదాయమే. ఈ సంప్రదాయం శ్రీకృష్ణుడు గోపికల మధ్య జరిగిన కథకు గుర్తుగా జరుపుకుంటారు. ఆ రోజున బర్సానాలో చిన్న చిన్న యుద్ధ పోటీలు, పాటలు, నృత్యాలు, వంటి కార్యక్రమాలు కూడా నిర్వహించుకుంటారు.
బూడిద జల్లుకుంటూ..
వారణాసిలో చితా భస్మా హోలీని నిర్వహిస్తారు. అక్కడ సాధువులు, అఘోరాలు... తమ భక్తులతో మణికర్ణిక ఘాట్ దగ్గర కలిసి చితి నుంచి వచ్చే బూడిదను తీసి హోలీగా ఆడతారు. వారణాసి అంటే మనం ముక్తి నగరంగా భావిస్తాం. అందుకు గుర్తుగా తమ శరీరాలపై ఈ చితా భస్మాన్ని పూసుకుంటారు. తద్వారా శివునికి తమ భక్తిని తెలియజేస్తారు. వీరంతా వీధుల్లో తిరుగుతూ శివనామస్మరణ చేస్తారు. నిజానికి శ్మశానేశ్వరుడైన శివుడు నిత్యం ఈ చితా భస్మాన్ని ఒంటికి పూసుకుంటాడు కాబట్టి తాము కూడా నీలోని వాళ్లమే, నీ బిడ్డలమే అని చెప్పేందుకు ఇలాంటి వింత ఆచారాన్ని అక్కడ వారణాసి ప్రజలు పాటిస్తారు.
గంజాయితో హోలీ..
భాంగ్ అంటే గంజాయితో చేసిన పేస్టు. ఏంటీ గంజాయిని హోలీలోనా..! అని ఆశ్చర్యపోవద్దు. అయితే ఆరోజు ఇలా చేసినా.. పోలీసులు అరెస్ట్ చెయ్యరు. అందువల్లే దీన్ని హోలీ వేడుకల్లో భాగంగా అక్కడి ప్రజలు ధైర్యంగా ఉపయోగించి పండుగ జరుపుకుంటారు. అంతేగాదు ఆరోజు తయారు చేసిన పానీయాలు, ఆహారాలలోనూ కూడా ఈ పేస్టును వినియోగిస్తారు. గంజాయిపై నిషేధం ఉన్నప్పటికీ హోలీ సమయంలో మాత్రం దీన్ని చట్టబద్ధంగా వినియోగిస్తారు. భాంగ్ తయారీ అనేది అక్కడ ఒక కళగా చెప్పుకుంటారు. కుటుంబ వంటకాలలో దీన్ని భాగం చేసుకుంటారు. ఉత్తర ప్రదేశ్లోని చాలా చోట్ల హోలీ రోజున భాంగ్ను ఆహారంగా వాడతారు.
తేళ్లతో హోలీ..
ఉత్తరప్రదేశ్లోని ఇటావా జిల్లాలో సంతన అనే గ్రామం ఉంది. అక్కడ స్థానికులు హోలీ వచ్చిందంటే సాహసోపేతమైన సంప్రదాయాన్ని పాటిస్తారు. ఈ పవిత్రమైన రోజున బైసన్ దేవి ఆలయం కింద ఉన్న రాతి భూభాగంలో ఉన్న తేళ్ళను సేకరించి తమ శరీరాలపై పెట్టుకుంటారు. అయితే ఆ తేళ్లు తమని కుట్టమని ఆ గ్రామస్తుల నమ్మకం.
దుస్తులు చించేసి..
మధుర సమీపంలో దౌజీ అనే గ్రామం ఉంది. ఇక్కడ మాత్రం హోలీ మరుసటి రోజు వేడుకలు నిర్వహించుకుంటారు. పురుషులు, స్త్రీలు రంగులు జల్లు కావడం తోపాటు స్త్రీలు, పురుషుల దుస్తులను చింపివేయడం వంటివి చేస్తారు. ఇది చాలా వేడుకగా జరుగుతుంది.
(చదవండి: 'పఖాలా'తో వేసవి తాపం పరార్!)
Comments
Please login to add a commentAdd a comment