Viral Video Woman Dances To Bhojpuri Song Delhi Metro Platform - Sakshi
Sakshi News home page

మెట్రో స్టేషన్‌లో యువతి హల్‌చల్‌.. చీరకట్టుతో డ్యాన్స్‌.. తిట్టిపోస్తున్న నెటిజన్లు

Published Thu, Apr 6 2023 6:27 PM | Last Updated on Thu, Apr 6 2023 9:26 PM

Viral Video Woman Dances To Bhojpuri Song Delhi Metro Platform - Sakshi

న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో ఢిల్లీ మెట్రో తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఓ యువతి టూ పీస్ బికినీ టైప్ డ్రెస్ ధరించి ప్రయాణించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మరో ఘటనలో సీటు కోసం గొడవపడుతూ ఓ మహిళ మరో మహిళపై పెప్పర్‌ స్ప్రే కొట్టింది. తాజాగా ఓ యువతి చీరకట్టులో ఢిల్లీ మెట్రో ప్లాట్‌ఫాంపై డ్యాన్స్ చేసి హల్‌చల్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

ఎర్ర చీర ధరించి బోజ్‌పురి పాటకు అదిరే స్టెప్పులేసి అదరగొట్టిన ఈ యువతి పేరు అవ్నీకరీశ్.  ఇన్‌స్టాలో తన డ్యాన్స్ వీడియో పోస్టు చేసింది. ఇప్పటికే వేల మంది ఈ వీడియోను వీక్షించారు.

అయితే ఈ వీడియోపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ఢిల్లీ మెట్రో ఆవరణలో ఇలాంటి ఫొటోలు, వీడియోల చిత్రీకరణపై నిషేధం అమల్లో ఉంది కాదా.. అయినా ఎలా రికార్డు చేశారు అని కొందరు అభ్యంతరం తెలిపారు.  మరికొందరేమో ఇలాంటి వాటిని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇంకొందరు మాత్రం యువతి స్టెప్పులకు ఫిదా అయ్యారు. ఎలాంటి భయం లేకుండా మెట్రో ప్లాట్‌ఫాంపై డ్యాన్స్ చేసిన ఈమె ధైర్యవంతురాలు అని ప్రశంసలు కురిపించారు. ఈమె డ్యాన్స్‌ను తెగమెచ్చుకున్నారు. అవ్నీకరీశ్ ఢిల్లీ మెట్రోలో డ్యాన్స్ చేయడం ఇదే తొలిసారి కాదు. మార్చిలోనూ సోనూ నిగమ్ పాటకు నృత్యం చేసి.. ఆ వీడియోనూ కూడా ఇన్‌స్టాలో పోస్టు చేసింది.
చదవండి: తాజ్‌మహల్‌ ప్రేమకు చిహ్నం కాదు.. దాన్ని కూల్చేయాలి: బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement