Woman Who Dances To Bhojpuri Song In Delhi Metro Her Second Video Is Viral - Sakshi
Sakshi News home page

Viral Video: మెట్రో యువతి మరో డ్యాన్స్‌.. ఈసారి యువకుడితో స్టెప్పులు

Published Thu, Apr 13 2023 12:53 PM | Last Updated on Thu, Apr 13 2023 1:52 PM

Woman Who Dances To Bhojpuri Song In Delhi Metro Her Second Video Is Viral - Sakshi

ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా ప్రపంచాన్ని శాసిస్తోందనే చెప్పాలి. సామాన్యుడిని సెలబ్రిటీ చేయాలన్నా, ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్నా, అంతెందుకు మనీ సంపాదనకు కూడా మార్గం చూపిస్తూ ప్రత్యేకంగా యవతను తనవైపు తిప్పుకుంది. ఇదిలా ఉండగా భారతదేశంలో టిక్‌టాక్ నిషేధం తర్వాత, నెటిజన్లు ఇప్పుడు తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఇన్‌స్టాగ్రామ్‌ను ఆశ్రయిస్తున్నారు.

ఫోటోగ్రఫీ నైపుణ్యాలను ప్రదర్శించడం నుంచి అనేక ఫన్నీ వీడియోలు, డ్యాన్స్‌లు, పాడే క్లిప్‌లతో ప్రజలను అలరించడం వరకు ఇలా ఒక్కటేంటి నెటిజన్లు తమ ప్రతిభను ప్రదర్శించడానికి సోషల్‌మీడియా ఒక వేదికగా రూపాంతరం చెందిందనే చెప్పాలి.

అందుకే యవత వీడియోలతో తమ టాలెంట్‌ను నెట్టింట షేర్‌ చేస్తున్నారు. ఇటీవల చీరకట్టులో ఢిల్లీ మెట్రో ప్లాట్‌ఫాంపై డ్యాన్స్ చేసి హల్‌చల్ చేసిన అవ్నీకరీశ్ తాజాగా మరో డాన్స్‌ వీడియో ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. వృత్తిరీత్యా డ్యాన్సర్‌గా చెప్పుకునే అవ్నీకరీశ్‌ ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో భోజ్‌పురి పాట సాజ్ కే సవార్ కేకు తన నిర్మొహమాటంగా డ్యాన్స్ చేసినందుకు అందరి దృష్టిని ఆకర్షించింది.

అయితే పబ్లిక్‌గా డ్యాన్స్ చేయడం ఆమెకు కొత్తేమీ కాదు. తాజాగా ఈ యువతి నలుపు రంగు లెహంగా ధరించి, తన డ్యాన్స్ పార్ట్‌నర్‌తో స్టెప్పులేసింది. సల్మాన్ ఖాన్, రాణి ముఖర్జీ నటించిన హలో బ్రదర్‌లోని తేరి చున్నారియా పాట బీట్‌లకు వీరిద్దరూ డ్యాన్స్‌ చేసి అలరించారు. ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement