ఢిల్లీ: ఢిల్లీ మెట్రో రైల్వే స్టేషన్ లో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. యమునా బ్యాంక్ ర్వేల్వేస్టేషన్ లో ఢిల్లీనుంచి వైశాలి వైపు వెడుతుండగా పట్టాలపైకి దూకేయడంతో ఆమె అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. సంఘటనా స్థలంలో దొరికిన ఆమె బ్యాగ్ ఆధారంగా అలహాబాద్ కు చెందిన అంజలిగా పోలీసులు గుర్తించారు. అయితే అలహాబాద్ కు చెందిన అంజలికి ఢిల్లీకి చెందిన అబ్బాయితో ఇటీవల నిశ్చితార్థం జరిగింది. పెళ్లి తేదీని కూడా ఖరారు చేసుకున్నారు. అయితే ఆ పెళ్లి ఇష్టంలేకనే ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తెలుస్తోంది.
రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డానికి ముందు 3 వ నెంబర్ ప్లాట్ ఫాం పై దాదాపు పది నిమిషాలు ఆమె తచ్చాడినట్టు సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డయిందని పోలీసులు తెలిపారు. ఆమె హ్యాండ్ బ్యాగు నుంచి మెట్రో పాస్, సెల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాల్ డేటాను పరిశీలిస్తున్నామని, ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని తెలిపారు.