
సాక్షి , న్యూఢిల్లీ : మెట్రో కార్డులతో ఢిల్లీ ప్రయాణీకులు ఎంపిక చేసిన 250 బస్సుల్లో తిరగవచ్చని ఢిల్లీ రవాణా మంత్రి కైలాష్ గెహ్లాట్ చెప్పారు. మెట్రో, ఢిల్లీ రవాణా సంస్థ బస్సులు, క్లస్టర్ బస్సుల్లో ఒకే కార్డుతో జర్నీ చేయడంపై నెలరోజులు ఎంపిక చేసిన బస్సుల్లో పరిశీలిస్తామని మంత్రి తెలిపారు.
ఆయా బస్సుల్లో ఎలక్ర్టానిక్ టికెటింగ్ యంత్రాల్లో (ఈటీఎం) మెట్రో కార్డును ట్యాప్ చేయడం ద్వారా ప్రయాణాలు సాగించవచ్చన్నారు. మెట్రో కార్డును ట్యాప్ చేయగానే టికెట్ జనరేట్ అవుతుంది. ఈ టికెట్‌పై మెట్రో కార్డులో బ్యాలెన్స్ వివరాలూ పొందుపరుస్తారు. ఇక ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అన్ని బస్సుల్లో మెట్రో కార్డును కామన్ కార్డుగా అనుమతిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment