ట్రయల్ రన్లో మెట్రో రైళ్లు ఢీ
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఢిల్లీ మెట్రో మెజెంటా లైన్ ప్రాజెక్టులో ఊహించని ప్రమాదం జరిగింది. ట్రయల్ రన్లో రెండు రైళ్లు ఒకే ట్రాక్పై వచ్చి ఢీకొన్నాయి. ఉన్నతాధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. సిగ్నల్ వ్యవస్థలో లోపం వల్ల ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. కాగా ప్రమాదం ఎక్కడ జరిగిందన్న విషయాన్ని అధికారులు వెల్లడించలేదు.
డ్రైవర్ రహిత రైళ్లను నడపడానికి ఢిల్లీ మెట్రో ప్రత్యేకంగా మెజెంటా లైన్ నిర్మాణాన్ని చేపట్టింది. ఇది 2017 ఏడాది మధ్యలో ప్రజలకు అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. జానక్పురి వెస్ట్, బొటానికల్ గార్డెన్ మధ్య 25 స్టేషన్లను కలుపుతూ కొత్త కారిడార్ను నిర్మిస్తున్నారు. మెట్రో అధికారులు ఇటీవల ఈ లైన్పై విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించారు. అయితే తాజాగా ఇదే లైన్పై నిర్వహించిన ట్రయల్ రన్లో రెండు రైళ్లు ఢీకొన్నాయి.