same track
-
62 ఏళ్ల తర్వాత..!
న్యూఢిల్లీ/ముంబై: దేశ రాజధాని ఢిల్లీ, వాణిజ్య రాజధాని ముంబైలను 62 ఏళ్ల తర్వాత రుతుపవనాలు ఒకేసారి ఆదివారం తాకాయి. రెండు నగరాలపైకి ఇలా ఒకేసారి వ్యాపించడం 1961 జూన్ 21వ తేదీ తర్వాత ఇదే మొదటిసారని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. ఢిల్లీకి ముందుగా ఊహించిన దాని కంటే రెండు రోజులు ముందు రాగా, ముంబైకి మాత్రం రెండు వారాలు ఆలస్యంగా చేరుకున్నాయని వివరించింది. హరియాణా, చండీగఢ్, ఢిల్లీలపై రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని పేర్కొంది. రుతుపవనాలు మహారాష్ట్రలోని మిగతాప్రాంతాలు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాలు, రాజస్తాన్, హరియాణా, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌వైపు కదులుతున్నాయని వివరించింది. రానున్న రెండు రోజుల్లో మిగతా ప్రాంతాలకూ విస్తరించేందుకు అనువైన పరిస్థితులున్నాయని తెలిపింది. సాధారణంగా రుతు పవనాలు కేరళను జూన్ 1న, ముంబైని జూన్ 11న, ఢిల్లీని జూన్ 27న తాకుతాయి. -
ట్రయల్ రన్లో మెట్రో రైళ్లు ఢీ
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఢిల్లీ మెట్రో మెజెంటా లైన్ ప్రాజెక్టులో ఊహించని ప్రమాదం జరిగింది. ట్రయల్ రన్లో రెండు రైళ్లు ఒకే ట్రాక్‌పై వచ్చి ఢీకొన్నాయి. ఉన్నతాధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. సిగ్నల్ వ్యవస్థలో లోపం వల్ల ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. కాగా ప్రమాదం ఎక్కడ జరిగిందన్న విషయాన్ని అధికారులు వెల్లడించలేదు. డ్రైవర్ రహిత రైళ్లను నడపడానికి ఢిల్లీ మెట్రో ప్రత్యేకంగా మెజెంటా లైన్ నిర్మాణాన్ని చేపట్టింది. ఇది 2017 ఏడాది మధ్యలో ప్రజలకు అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. జానక్‌పురి వెస్ట్, బొటానికల్ గార్డెన్ మధ్య 25 స్టేషన్లను కలుపుతూ కొత్త కారిడార్‌ను నిర్మిస్తున్నారు. మెట్రో అధికారులు ఇటీవల ఈ లైన్‌పై విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించారు. అయితే తాజాగా ఇదే లైన్‌పై నిర్వహించిన ట్రయల్ రన్లో రెండు రైళ్లు ఢీకొన్నాయి. -
కొద్దిలో భారీ ప్రమాదం తప్పింది
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో రెండు రైళ్లకు పెను ప్రమాదం తప్పింది. ఎదురెదురుగా రెండు రైళ్లు ఒకే ట్రాక్‌పై దూసుకొచ్చాయి. రెండు ట్రెయిన్ ల డ్రైవర్లు వేగంగా స్పందించడంతో సరిగ్గా 150 మీటర్ల దూరంలో రెండు రైళ్లు ఆగిపోయాయి. లేదంటే భారీ ప్రాణ, ఆస్తి నష్టం చూడాల్సి వచ్చేంది. సాంకేతిక లోపం తలెత్తడం వల్లే ఈ ప్రమాదం జరిగేందుకు ఆస్కారం చోటుచేసుకుందని ఉత్తర రైల్వే అధికారులు చెప్పారు. విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు. చర్బాంగ్ రైల్వే స్టేషన్‌కు సరిగ్గా రెండు కిలో మీటర్ల దూరంలో దిల్‌ఖుషా క్యాబిన్ ఏరియా వద్ద ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చాయి. వాస్తవానికి ఆ రైళ్ల ట్రాక్‌లు మార్చేది దిల్ ఖుషా క్యాబిన్ వద్దే. అయితే, ట్రాక్ మార్చే ప్రయత్నం చేసినప్పటికీ సాంకేతిక లోపం తలెత్తి అలా జరగలేదు. అప్పటికే అవతలి వైపునుంచి వస్తున్న రైలు భారీ వేగంతో వస్తోంది. దీంతో అవతలి నుంచి వచ్చే రైలు.. ఈ రైలు ఒకే ట్రాక్‌పైకి దూసుకెళ్లాయి. రెండు రైళ్ల డ్రైవర్లు ఇది గమనించి అత్యవసర బ్రేక్‌లు వేయడంతో పట్టాలపై భారీ శబ్దం చేస్తూ అవి ఆగిపోయాయి. దీంతో అందులోని ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.