న్యూఢిల్లీ/ముంబై: దేశ రాజధాని ఢిల్లీ, వాణిజ్య రాజధాని ముంబైలను 62 ఏళ్ల తర్వాత రుతుపవనాలు ఒకేసారి ఆదివారం తాకాయి. రెండు నగరాలపైకి ఇలా ఒకేసారి వ్యాపించడం 1961 జూన్ 21వ తేదీ తర్వాత ఇదే మొదటిసారని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. ఢిల్లీకి ముందుగా ఊహించిన దాని కంటే రెండు రోజులు ముందు రాగా, ముంబైకి మాత్రం రెండు వారాలు ఆలస్యంగా చేరుకున్నాయని వివరించింది.
హరియాణా, చండీగఢ్, ఢిల్లీలపై రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని పేర్కొంది. రుతుపవనాలు మహారాష్ట్రలోని మిగతాప్రాంతాలు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాలు, రాజస్తాన్, హరియాణా, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌వైపు కదులుతున్నాయని వివరించింది. రానున్న రెండు రోజుల్లో మిగతా ప్రాంతాలకూ విస్తరించేందుకు అనువైన పరిస్థితులున్నాయని తెలిపింది. సాధారణంగా రుతు పవనాలు కేరళను జూన్ 1న, ముంబైని జూన్ 11న, ఢిల్లీని జూన్ 27న తాకుతాయి.
Comments
Please login to add a commentAdd a comment