Meet Rhythm Chanana, 'Delhi Metro girl' who went viral - Sakshi
Sakshi News home page

ఢిల్లీ మెట్రో గర్ల్‌: కురచ దుస్తుల్లో మెట్రోలో సంచారం.. కదిలిస్తే ఇదీ కథ!

Published Tue, Apr 4 2023 9:33 AM | Last Updated on Tue, Apr 4 2023 12:02 PM

Meet Delhi Metro girl Rhythm Chanana Reason Behind Her Attire - Sakshi

ఈ భూమ్మీద ఎక్కడా లేని జంక్‌ అంతా ఇప్పుడు సోషల్‌ మీడియాకే చేరుతోంది. ఏదో ఒకటి చేసి వైరల్‌ కావడమే లక్ష్యంగా పెట్టుకుంటోంది యువత. ఇంతకీ  వైరల్‌ కావాలంటే ఏం చేయాలి?.. జనాల  నోళ్లు వెల్లబెట్టి మరీ చూసేలా చేయగలిగినా చాలా?. ఢిల్లీ మెట్రో గర్ల్‌.. ఇప్పుడు అలాంటి పనే చేస్తోంది. ముంబై గడ్డపై ఉర్ఫీ జావెద్‌ అని ఓ మోడల్‌ మొన్నటిదాకా చేసిన పనినే.. ఇప్పుడు ఈ 19 ఏళ్ల అమ్మాయి కంటిన్యూ చేస్తోంది. ఢిల్లీ మెట్రో గర్ల్‌గా నార్త్‌ సోషల్‌ మీడియా పేజీలను షేక్‌ చేస్తోంది. 

బ్రా.. మిని స్కర్ట్‌.. పీలికల్లాంటి దుస్తుల్లో మెట్రో రైలులో ప్రయాణిస్తూ తోటి ప్రయాణికులను బిత్తరపోయేలా చేస్తోంది రిథమ్‌ చననా. సోషల్‌ మీడియాలో ఈ యువతిపై మామూలు తిట్లు పడడం లేదు. సొసైటీని పాడు చేయడానికే అలాంటి బట్టలు వేసుకుంటున్నావా? అంటూ మండిపడుతున్నారంతా. తొలుత ఆమె ఫొటోలు, వీడియోలు చూసి అంతా ఉర్ఫీ జావెద్‌ అనుకుని పొరపడ్డారంతా. చివరికి.. ఆమె అసలు సోషల్‌ మీడియా అకౌంట్ల ద్వారా ఐడెంటింటీ రివీల్‌ అయ్యింది. 

@prettypastry11112222 ఇన్‌స్టాగ్రామ్‌ ఐడీతో రిథమ్‌ చననా పోస్టులు పెడుతోంది. సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారడంతో ఈ యువతి ఉద్దేశం ఏంటో తెలుసుకుందామని ఓ జాతీయ ఛానెల్‌ ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేసింది. తన పేరు రిథమ్‌ చననా అని, పంజాబ్‌ ఫతేగఢ్‌ సాహిబ్‌ నగరం తన స్వస్థలం అని ఆమె తెలిపింది. 

తనది ఎంతో పద్ధతిగల కుటుంబమని చెప్పిన ఆమె.. మొదట్లో తాను అంతే పద్దతిగా ఉండేదానినని చెప్పింది. అయితే.. సడన్‌గా తన ఆలోచనలు మారాయని, ఆ ఆలోచనలకు ఇంట్లో వాళ్లు అంగీకరించకపోవడంతో దూరంగా ఉంటూ వస్తున్నానని తెలిపింది రిథమ్‌. తన మీద ఎవరి ప్రభావం లేదన్న ఆమె.. తన ఇష్టప్రకారంగానే అలాంటి బట్టలు వేసుకుంటున్నట్లు చెప్పింది. పేరు, పబ్లిసిటీ కోసమో తాను ఇలా బతకడం లేదని, విమర్శలను తాను పట్టించుకోనని, తనకు నచ్చినట్లు జీవిస్తానని అంటోందామె.

‘పైకి పద్ధతిగా ఉంటే సరిపోతుందా? లోపలి ఆలోచనల సంగతి ఏంటి?. నేను ఎవరి జీవితాల్లోకి తొంగిచూడనప్పుడు.. నా జీవితాల్లోకి వాళ్లెందుకు చూడడం. నా పని చేసుకుంటూ నా బతుకు నేను బతుకుతున్నా. చాలదా?. అలాంటప్పుడు అవతలివాళ్ల అభిప్రాయాల్ని.. విమర్శలను ఎందుకు పట్టించుకోవడం? అని చెబుతోందామె.  పింక్‌ లైన్‌ మెట్రో రూట్‌లో తప్ప తన వస్త్రధారణపై ఎక్కడా, ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదని అంటోందామె. 

కొసమెరుపు ఏంటంటే.. కిందటి ఏడాది అక్టోబర్‌ వరకు ఆమె సోషల్‌ మీడియా అకౌంట్‌లలో పద్ధతిగానే ఫొటోలు ఉన్నాయి. కామ్‌ బిఫోర్‌ స్ట్రోమ్‌ అంటూ ఓ బోల్డ్‌ ఫొటోను ఉంచిన రిథమ్‌.. అప్పటి నుంచి రెచ్చిపోతూ వస్తోంది. ఎంతలా అంటే.. కురచదుస్తుల్లో ఏం సందేశం ఇస్తున్నావ్‌ తల్లీ అంటూ తిట్టిపోసే స్టేజ్‌కు చేరుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement