
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌తో దేశవ్యాప్తంగా నిలిచిపోయిన మెట్రో రైళ్లు ఇప్పట్లో పునఃప్రారంభమయ్యేలా లేవు. జూన్ 30 తర్వాత మెట్రో రైళ్లు పట్టాలపైకి వస్తాయని ఆశించిన నగరవాసులకు నిరాశ ఎదురైంది. కేంద్ర ప్రభుత్వం జారీచేసిన అన్‌లాక్ 2.0 నిబంధనల ప్రకారం తదుపరి ఉత‍్తర్వులు జారీ అయ్యేవరకూ ఢిల్లీ మెట్రో సర్వీసుల నిలిపివేత కొనసాగుతుందని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) మంగళవారం పేర్కొంది. కాగా దేశరాజధాని ఢిల్లీలో కోవిడ్-19 వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఢిల్లీలో ఇప్పటివరకూ 83,077 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా మహమ్మారి బారినపడి 2623 మంది ప్రాణాలు విడిచారు.
Comments
Please login to add a commentAdd a comment