క్లాస్‌ రూమ్‌లో టీచర్‌కు చేదు అనుభవం | teacher slaps Student, she slaps her back | Sakshi
Sakshi News home page

క్లాస్‌ రూమ్‌లో టీచర్‌కు చేదు అనుభవం

Published Tue, Apr 18 2017 9:06 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

క్లాస్‌ రూమ్‌లో టీచర్‌కు చేదు అనుభవం - Sakshi

క్లాస్‌ రూమ్‌లో టీచర్‌కు చేదు అనుభవం


ఉపాధ్యాయ వృత్తి అనేది నేడు కత్తిమీద సాము లాంటిదే. ఇంట్లో ఒకరిద్దరు పిల్లలను కంట్రోల్‌ చేయడానికే తల్లిదండ్రులకు ప్రాణం మీదకు వస్తుంది. అలాంటిది తరగతి గదిలో విద్యార్థులను మేనేజ్‌ చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. అది కూడా టీనేజ్‌ పిల్లల విషయంలో టీచర్లు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి.  ఏమాత్రం తేడా వచ్చినా అంతే.  చైనాలో ఓ టీచర్‌కు అలాంటి అనుభవమే ఎదురైంది. ప్రస్తుతం ఆ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.  చైనా సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ ‘వైబో’  పోస్ట్‌ చేసిన ఈ వీడియోకు రెండు మిలియన్‌ వ్యూస్‌ వచ్చాయి.

‘ఓ ఉపాధ్యాయురాలు క్లాస్‌రూమ్‌లో  అల్లరి చేస్తున్న ఓ విద్యార్థిని తిడుతోంది. పద్ధతి మార్చుకోవాలంటూ ఆ విద్యార్థిని కొట్టేందుకు టీచర్‌ చెయ్యెత్తుతుంది. అయితే విద్యార్థిని కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ప్రతి సమాధానం ఇవ్వడంతో పాటు, కొట్టాలంటూ తన ముఖాన్ని టీచర్‌ చేతి దగ్గరకు తీసుకువస్తుంది. దీంతో టీచర్‌ ఆ విద్యార్థిని చెంపపై ఒక్కటిస్తుంది. అయితే కథ అక్కడితో ఆగిపోలేదు... విద్యార్థిని కూడా తానేమీ తక్కువ తినలేదంటూ... షార్ప్‌గా రియాక్ట్‌ అవుతుంది.

ప్రతిగా టీచర్‌ చెంప చెళ్లుమనిపిస్తుంది. దీంతో సీన్‌.. టీచర్‌, విద్యార్థిని కలబడి కొట్టుకునేవరకూ వెళుతుంది. ఆ షాక్‌ నుంచి తేరుకున్న మిగతా విద్యార్థులు వారిద్ధర్ని విడదీసేందుకు నానా కష్టాలు పడతారు.’   అయితే ఈ సంఘటన చైనాలోని ఏ స్కూల్‌లో జరిగిందనే వివరాలు మాత్రం ఆ వీడియోలో లేవు.  ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement