డిజిటల్ క్లాస్‌రూమ్‌తో మంచి ఫలితాలు
కాకినాడ సిటీ :
పాఠశాలల్లో డిజిటల్ క్లాస్‌రూమ్‌ల ద్వారా విద్యాబోధన చేసే ప్రయత్నంతో మంచి ఫలితాలు వస్తాయని, ఇందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ అరుణ్‌కుమార్ కోరారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ కోర్టు హాల్ నుంచి పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో డిజిటల్ క్లాస్ రూమ్‌లపై మండలస్థాయి వీడియో కాన్ఫరె¯Œ్స నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డిజిటల్ క్లాస్‌రూమ్‌ల నిర్వహణతో ఉపాధ్యాయులు సహకారంతో పాటు నాణ్యమైన విద్య పెరుగుతుందన్నారు. ఇంటర్నెట్‌లో ఎక్కువ యాప్‌లు డౌ¯ŒSలోడ్ చేసుకుని విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలన్నారు. ఏపీ ఫైబర్ గ్రిడ్ ద్వారా అన్ని హైస్కూళ్లకు మార్చి నెలాఖరుకు బ్రాడ్ బ్యాండ్ ఇవ్వనున్నామని తెలిపారు. ఈ ఏడాది జిల్లా మొదటి స్థానంలో ఉండేలా ఉపా«ధ్యాయులు కృషి చేయాలన్నారు. ఎస్‌ఎస్‌ఏ పీఓ శేషగిరి, ఇ¯ŒSచార్చి డీఈఓ అబ్రహం, డీవైఈఓ వాడపల్లి పాల్గొన్నారు.