
కర్నూలు, కల్లూరు (రూరల్) : బాత్‌రూం పైకప్పు కూలి పాత కల్లూరులో ఓ మహిళ మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి.. పాతకల్లూరులోని చెంచునగర్‌లో చెంచు పెద్దక్క(27) మంగళవారం రాత్రి స్నానం చేసేందుకు బాత్‌రూం వెళ్లింది. ఈక్రమంలో బాత్‌రూం పైకప్పు కూలింది. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో భర్త వెంటనే అక్కడి చేరుకున్నాడు. తీవ్రగాయాలపాలైన ఆమెను వెంటనే కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలికి నాలుగేళ్ల కూతురు ఉంది. పెద్దక్క మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మృతురాలి కుటుంబాన్ని ఎమ్మెల్యే గౌరు చరిత పరామర్శించారు. ఈమె కుటుంబానికి రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment