
చిలంకూరులో కూలిన మిద్దె
ఎర్రగుంట్ల:
మండల పరిధిలోని చిలంకూరు గ్రామం పాత ఊరులో శివాలయం సమీపంలో బుధవారం అర్ధరాత్రి ఓ మట్టిమిద్దె కూలిపోయింది. ఇందులో నివాసముంటున్న వృద్ధ వికలాంగుడు హుస్సేన్ సాహెబ్ ఇంటి వరండాలో పడుకొని ఉండటంతో తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ సందర్భంగా హుస్సేన్‌సాహెబ్ మాట్లాడుతు బుధవారం రాత్రి భోజనం చేసి పడుకొన్నానని, అర్థరాత్రి ఉరుములతో కూడిన వర్షం కురిసిందని తెలిపాడు. దీంతో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో ఇంటి పైకప్పు కూలిపోయిందన్నాడు. వెంటనే వరండాలో పడుకొని ఉన్న తాను భయంతో అతి కష్టం మీద బయటకు వచ్చానని వివరించాడు. మట్టి మిద్దె కావడంతో దూలాలన్నీ విరిగిపోయి సామాన్లు
పాడైపోయాయి.