పాట్నా: బీహార్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మహావీర్ మేళా సందర్భంగా నిర్వహించిన సంగీత కార్యక్రమంలో ఉన్నట్టుండి ఓ ఇంటి పైకప్పు కూలడంతో అనేకమందికి గాయాలయ్యాయి. ఛప్రా నగరంలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
ఇషావ్‌పూర్ బ్లాక్‌లో మహావీర్ అఖారా ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన డ్యాన్స్ ప్రదర్శనను చూసేందుకు వేల సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. వేదిక చుట్టూ, రోడ్డు మీద మొత్తం గుమిగూడారు. వీరిలో చాలా మంది భవనాల పైకప్పులపైకి, రోడ్డుపక్కన బాల్కనీలు, చెట్లపైకి ఎక్కారు.
ఈ క్రమంలో వందల మంది ఎక్కడంతో శిథిలావస్థకు చేరిన ఓ ఇంటి పైకప్పు అకస్మాత్తుగా కూలిపోయింది.పైకప్పు పైన నిలబడి ఉన్న వందలాది మంది వ్యక్తులు కిందపడిపోయారు. ఈ ఘటనతో తీవ్ర భయాందోళనకు గురైన జనం గట్టిగా అరుస్తూ పరుగులు తీశారు. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది.
The roof collapsed in Chapra, Bihar, injuring 100 people.#Bihar #Chhapra #RoofCollapse @bihar_police @officecmbihar @ChapraZila pic.twitter.com/PvBT1mno4d
— Payal Mohindra (@payal_mohindra) September 4, 2024
వందలాది మంది ప్రజలు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. రూఫ్ కూలుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment