విద్యార్థులకు త్రుటిలో తప్పిన ప్రమాదం | Ashram School Top Roof Collpase in Visakhapatnam | Sakshi

విద్యార్థులకు త్రుటిలో తప్పిన ప్రమాదం

Dec 19 2018 12:46 PM | Updated on Jan 3 2019 12:14 PM

Ashram School Top Roof Collpase in Visakhapatnam - Sakshi

కింద పడిన శ్లాబు పెచ్చులను పరిశీలిస్తున్న ఎంఈవో అమృత్‌కుమార్‌

విశాఖపట్నం , నాతవరం(నర్సీపట్నం): మండలంలో సరుగుడు పంచాయతీ శివారు రామన్నపాలెం గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల  భవనం శ్లాబుపెచ్చులూడి పడ్డాయి. అయితే ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. వివరాలు ఇలా ఉన్నాయి  ఈ పాఠశాల భవనాలు చాలా కాలంగా  శిథిలావస్థలో ఉన్నాయి.శిథలమైన  భవనంలో   తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ  ఆశ్రమ పాఠశాలలో   201 మంది విద్యార్థులు చదువుతున్నారు.  పెథాయ్‌ తుపాను కారణంగా   రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా  మంగళవారం శ్లాబు పెచ్చులూడి కిందపడ్డాయి. తరగతులు నిర్వహిస్తుండగా ఈ సంఘటన జరిగింది. విద్యార్థులకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఎంఈవో తాడి అమృత్‌కుమార్‌ పాఠశాలను పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు. శిథిలమైన భవనాల్లో   తరగతులు నిర్వహించరాదని హెచ్‌ఎం మణిగోల్డ్‌కు అదేశించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడతూ 1977లో ఈ పాఠశాల భవనాలు నిర్మించారని, అవి పూర్తిగా శిథిలావస్థలో ఉన్నాయని చెప్పారు. కొత్త భవనాల కోసం పాడేరు ఐటీడీఏ పీవో ప్రతిపాదించినట్టు  చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement