పెషావర్ : ఓ ఇంటి పైకప్పు కూలిన ఘటనలో ఒకే కుటుంబానికి ఐదుగురు మృతిచెందారు. పాకిస్తాన్ లోని ఆగ్నేయ ప్రాంతంలోని కరాక్ జిల్లాలో శుక్రవారం జరిగిన ఈ ఘటనలో తల్లి సహా నలుగురు సంతానం చనిపోయారు. పోలీసుల కథనం ప్రకారం... మహమ్మద్ ఖలీద్ కు చెందిన ఇల్లు చాలా కాలం కిందట కట్టారు.
అక్కడ కురుస్తున్న భారీ వర్షాలకు ఈ రోజు ఆ ఇల్లు పైకప్పు ప్రమాదవశాత్తూ కూలడంతో ఐదుగురు మృతిచెందారు. మర్యామ్ (12), ముకాద్దాస్ (8), అలీహా (6) లు అక్కడిక్కడే మృతిచెందగా, ఖలీద్ భార్య, ఓ చిన్నారి తీవ్రంగా గాయపడ్డారు. వారు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతిచెందారు.