18వ అంతస్తుపై సాహసం చేస్తూ.. | Teen Plunges 18 Floors in Central China | Sakshi
Sakshi News home page

18వ అంతస్తుపై సాహసం చేస్తూ..

Published Fri, May 3 2019 2:54 PM | Last Updated on Fri, May 3 2019 3:16 PM

Teen Plunges 18 Floors in Central China - Sakshi

ముంబై : సాహసం చేయడానికి ప్రయత్నించి ఓ యువకుడు 18 అంతస్తులపైనుంచి కిందపడి మృతిచెందాడు. సెంట్రల్‌ చైనాలోని హెనాన్‌ ప్రావిన్స్‌లోని క్విన్‌యాంగ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. 19 ఏళ్ల యాంగ్‌ అనే యువకుడు 18 అంతస్తుల భవనం చివర చిన్నగోడపై నిలబడి సాహసం చేయడానికి ప్రయత్నించి ప్రమాదవశాత్తు కిందపడి మరణించాడు. ఆ సమయంలో ఎదురుగా  ఉన్న భవనం నుంచి ఓ వ్యక్తి వీడియో తీయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. గోడ రూఫ్‌ కూలిపోవడంతో యువకుడు ఒక్కసారిగా కిందకుపడిపోయాడు. రూఫ్‌టాప్‌ నిర్మాణంలో నాణ్యత లేకపోవడం వల్ల ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. 

సెల్ఫీ పిచ్చితోనో లేక సాహసాల పేరుతోనో ప్రాణాలు కోల్పోవొద్దని సందేశమిస్తూ ఏప్రిల్‌ 22న జరిగిన ఈ ఘటనకు సంబంధించి వీడియోను ముంబై పోలీసులు ట్వీట్‌ చేశారు. దీంతో ఈవీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. డేరింగ్‌ సెల్ఫీ కోసం ప్రయత్నం చేస్తున్నారా? బాధ్యత లేకుండా సాహసాలు చేస్తున్నారా ? చేసేదేదైనా మీకు మిగిలేది రిస్క్‌ మాత్రమే అంటూ హెచ్చరించారు. సేఫ్టీ ఫస్ట్‌ అనే హ్యాష్‌ ట్యాగ్‌తో ముంబైపోలీసులు ఈ పోస్ట్‌ పెట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement