ఆమెని చూస్తే అవాక్కవుతారు! | Chinees grandmother Ye Wen is 50 years old but looks two decade younger | Sakshi
Sakshi News home page

ఆమెని చూస్తే అవాక్కవుతారు!

Published Tue, Jun 28 2016 8:29 AM | Last Updated on Mon, Sep 4 2017 3:33 AM

Chinees grandmother Ye Wen is 50 years old but looks two decade younger

'మెరిసేటి కన్నులు రెండు మేడిన్ చైనానా.. నీది ఆ దేశమైతే నేనే మావోనా..' లాంటి పక్తులు ఇంకా ఎన్నెన్నో పాడుకోవచ్చు చైనీస్ పడతి యే వెన్ మీద. ఆమెది.. 135కోట్ల జన చైనాలో 'మోస్ట్ స్టన్నింగ్ బ్యూటీ' అని నెటిజన్ల చేత కితాబుల కామెంట్లు పొందిందన అందం. పేరు యే వెన్. పుట్టింది 1966లో. అంటే ఇప్పుడామె వయసు 50 ఏళ్లన్నమాట!

పెళ్లైన కొన్నేళ్లకే వెన్ ను భర్త విడిచిపెట్టాడు. అప్పటికే వాళ్లకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. ఒంటరిగా పోరాడుతూ, చేతనైన పనులు చేస్తూ పిల్లల్ని పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు కూడా చేసింది. పిల్లలు సెటిల్ అయ్యాక సౌందర్యపోషణపై దృష్టిసారించింది. సహజంగానే మెరుపుతీగలా ఉండే వెన్.. బ్యూటీ కేర్ తో ఇంకా మెరిసిపోయింది.

మొన్న మార్చిలోనే 50వ పుట్టిన రోజు వేడుక జరుపుకొంది. ఆ సందర్భంగా ఆమె పెద్దకూతురు పట్టుపట్టి తల్లితో ఫోటో షూట్ చేసి, వాటిని ఇంటర్నెట్ లో పెట్టింది. అంతే! నెట్ లోకం దిగ్భ్రాంతికి గురైనట్లు స్థాణువైపోయింది. ఈమెకు 50 ఏళ్లా! అని ముక్కున వేలేసుకుంది. అన్నట్లు నిద్రపోయేటప్పుడు ఒంటిమీది దుస్తులన్నీ తీసేసి పడుకుంటుందట వెన్. అలా పడుకుంటే శరీరానికి నిగారింపువస్తుందని చైనాలో కొందరి నమ్మకం. (కింది ఫొటోల్లో ఒకదాంట్లో వెన్ తో కలిసున్న పాప ఆమె మనుమరాలు)


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement