విజయవాడ (విద్యాధరపురం): విజయవాడ నగరంలో ఇంటి పైకప్పు కూలి ఇద్దరు కూలీలు మృతిచెందిన సంఘటన ఆదివారం జరిగింది. ఈ సంఘటన విజయవాడ నగరంలోని విద్యాధరపురం కాలనీలోని కొండ ప్రాంతంలో పాత భవనం మరమ్మతులు నిర్వహిస్తుండగా సంభవించింది. భవన నిర్మాణంలో భాగంగా పాత కప్పును తీసివేసే సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
భవనం పైభాగం నుంచి దిమ్మిసతో కొడుతున్న సమయంలో కింది భాగంలో పనిచేస్తున్న ఇద్దరు కూలీలపై స్లాబ్ ఒక్కసారిగా పడటంతో వారు అక్కడికక్కడే మృతిచెందారు. భవనం పైభాగంలో ఉన్న వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. మృతులు ఎవరెవరు అనేది ఇంకా తెలియరాలేదు.