కూలిన బ్యాంకు పైకప్పు.. | Bank Of Maharashtra Solapur Branch Roof Collapses | Sakshi
Sakshi News home page

కూలిన బ్యాంకు పైకప్పు..

Published Wed, Jul 31 2019 2:37 PM | Last Updated on Wed, Jul 31 2019 2:38 PM

Bank Of Maharashtra Solapur Branch Roof Collapses - Sakshi

షోలాపూర్‌ : బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రకు చెందిన భవనం పైకప్పు కూలిన ఘటనలో 20 మందికి పైగా శిథిలాల్లో చిక్కుకున్నారు. ఈ ఘటన షోలాపూర్‌కు సమీపంలోని కర్మాలాలో బుధవారం చోటుచేసుకుంది. సమచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల్లో చిక్కుకున్న 10 మందిని సహాయ బృందాలు రక్షించాయి. మిగతా వారిని కూడా బయటకు తీసేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ విషయం తెలియగానే స్థానికులు పెద్ద ఎత్తున బ్యాంకు వద్దకు చేరుకున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement