సాహసం చేయడానికి ప్రయత్నించి ఓ యువకుడు 18 అంతస్తులపైనుంచి కిందపడి మృతిచెందాడు. సెంట్రల్ చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లోని క్విన్‌యాంగ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. 19 ఏళ్ల యాంగ్ అనే యువకుడు 18 అంతస్తుల భవనం చివర చిన్నగోడపై నిలబడి సాహసం చేయడానికి ప్రయత్నించి ప్రమాదవశాత్తు కిందపడి మరణించాడు. ఆ సమయంలో ఎదురుగా ఉన్న భవనం నుంచి ఓ వ్యక్తి వీడియో తీయడంతో ఈ ఘటన వెలుగు చూసింది.