లింగాల ఘన్‌పూర్ (వరంగల్ జిల్లా) : ఈదురు గాలికి ఇంటి పైకప్పు కూలి వృద్ధుడు మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లాలో శనివారం సాయంత్రం జరిగింది. వివరాల ప్రకారం.. లింగాల ఘన్‌పూర్ మండలం పటేల్‌గూడెంలో గాలి దుమారానికి ఇంటి పైకప్పు కూలి అనుముల మల్లయ్య (60) అనే వృద్ధుడు అక్కడికక్కడే మృతిచెందాడు.