ఆంధ్రప్రదేశ్ పురోభివృద్ధికి కీలకమైన ప్రత్యేక హోదాపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన దీక్షకు స్థలం ఖరారైంది. గుంటూరు నల్లపాడు రోడ్డులో వైఎస్ జగన్ దీక్ష స్థలాన్ని నిర్ణయించినట్లు పార్టీ ప్రోగ్రాం కన్వీనర్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం బుధవారమిక్కడ వెల్లడించారు. వైఎస్ జగన్ వచ్చే నెల 7వ తేదీన నిరవధిక నిరాహార దీక్ష చేపడుతున్నారు. కాగా ఈ నెల 26 నుంచి ప్రారంభం కావలసిన దీక్ష వాయిదా వేసుకున్న నేపథ్యంలో దాన్ని తిరిగి వచ్చే నెల 7వ తేదీ నుంచి కొనసాగించాలని నిర్ణయించిన విషయం విదితమే.