conformed
-
ఐక్యరాజ్య సమితికి సైబర్ సెగ, కీలక సమాచారం హ్యాక్!
ఐక్యరాజ్య సమితిపై సైబర్ ఎటాక్ జరిగింది. ఐక్యరాజ్య సమితికి సంబంధించిన సర్వర్లకు ఉండే రక్షణ వ్యవస్థలను హ్యకర్లు చేధించారు. పలు దేశాల మధ్య జరిగిన చర్చలు, లావాదేవీలకు సంబంధించిన కీలక సమాచారం హ్యాక్ అయినట్టు తెలుస్తోంది. అవును నిజమే గుర్తు తెలియని హ్యాకర్లు ఐక్యరాజ్య సమితికి సంబంధించి పలు విభాగాలకు సంబంధించిన సమాచారాన్ని హ్యక్ చేశారని యూఎన సెక్రటరీ జనరల్ అధికార ప్రతినిధి స్టిఫెన్ డుజారిక్ తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో హ్యకింగ్ జరిగినట్టు గుర్తించామని, దీనికిపై విచారణ కొనసాగుతోందని ఆయన తెలిపారు. హ్యకింగ్ ఇలా ఐక్యరాజ్య సమితిలో అన్ని దేశాలకు సంబంధించిన కీలక సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థను హ్యకర్లు ఎలా ఛేధించారనే దానిపై విచారణ కొనసాగుతోంది. యూన్‌కి సంబంధించిన ప్రొప్రైటరీ మేనేజ్మెంట్ ప్రాజెక్టుకు సంబంధించిన ఓ ఉద్యోగికి చెందిన యూజర్ నేమ్, పాస్వర్డ్ ఆధారంగా హ్యకర్లు యూఎన్ సిస్టమ్స్‌తో అనుసంధానమైనట్టు గుర్తించారు. ఆగస్టు వరకు యూఎన్‌కి సంబంధించిన సిస్టమ్స్‌తో యాక్సెస్ సాధించిన హ్యకర్లు ఏప్రిల్ 5 నుంచి ఆగస్టు 7 వరకు వరుసగా చొరబడినట్టు గుర్తించారు. అయితే వారు ఏ సమాచారం తస్కరించారు. అందులో భద్రతాపరంగా కీలకమైనవి ఏమైనా ఉన్నాయా ? అనే అంశాలను గుర్తించే పనిలో యూఎన్ భద్రతా సిబ్బంది ఉన్నారు. చదవండి: అశ్లీల వీడియోలకు పరోక్ష కారణం?.. ఎఫ్బీతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు -
టీచర్ల బదిలీలకు గ్రీన్‌సిగ్నల్
ఎట్టకేలకు తొలగిన ప్రతిష్ఠంబన షెడ్యూల్ విడుదలకు ప్రభుత్వం ఆమోదం రాయవరం(మండపేట): ఉపాధ్యాయ బదిలీలపై సుమారు నెల రోజుల పాటు కొనసాగిన ప్రతిష్ఠంబన తొలగింది. టీచర్ల బదిలీ ప్రక్రియ ఆది నుంచి ఒడిదుడుకులతో సాగింది. వెబ్ కౌన్సెలింగ్, ప్రతిభ ఆధారిత పాయింట్లను వ్యతిరేకిస్తూ వచ్చిన ఉపాధ్యాయ సంఘాలు బదిలీల తీరును నిరశించాయి. ఉపాధ్యాయులు రోడ్డెక్కితేగాని ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకోని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాలతో సంప్రదింపులు జరిపి కొన్ని సవరణలతో బదిలీ షెడ్యూల్‌ను విడుదల చేసేందుకు అంగీకరించింది. దీంతో ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లాలో ఇప్పటికే సుమారు 10 వేల మంది ఉపాధ్యాయులు బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. టీచర్ల నుంచి అభిప్రాయ సేకరణ కొత్తగా బదిలీ షెడ్యూల్ ప్రకటించక ముందు ప్రభుత్వం ఉపాధ్యాయుల నుంచి అభిప్రాయాలను సేకరించింది. బదిలీలు వెబ్ కౌన్సెలింగ్‌లో చేపట్టాలా? మాన్యువల్ విధానంలో చేపట్టాలా? అంటూ ఫోన్ ద్వారా ఉపాధ్యాయుల నుంచి అభిప్రాయ సేకరణ చేసింది. అధిక శాతం మంది మాన్యువల్ విధానంలోనే బదిలీలు చేపట్టాలని కోరారు. చివరకు ప్రభుత్వం స్కూల్ అసిస్టెంట్లకు వెబ్ కౌన్సెలింగ్, ఎస్జీటీ క్యాడర్‌కు మాన్యువల్ విధానంలో బదిలీలు నిర్వహించేలా నిర్ణయించింది. ప్రతిభ ఆధారిత పాయింట్ల విధానంలోనూ మార్పులు తీసుకువస్తూ విద్యాశాఖ సవరణ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మార్పులు జరగనున్నాయి... ఈ నెలలో బదిలీలు చేపట్టేందుకు మంత్రి అంగీకరించారు. దీని ప్రకారం సవరణలతో బదిలీ షెడ్యూల్‌ను అధికారికంగా విద్యాశాఖ విడుదల చేయాల్సి ఉంది. మొత్తం మీద బదిలీ జీవోలు 32, 38కి అనేక సవరణలు చేస్తూ జీవో 43ను విడుదల చేశారు. జీవో 32లోని రూల్ 15లో వెబ్ అసిస్టెడ్, వెబ్ బేస్డ్, ఆన్లైన్ అనే పదాలను తొలగించారు. ప్రతిభ ఆధారిత పాయింట్లను 30 శాతానికి కుదించారు. ఎన్రోల్మెంట్, ట్రాన్సిషన్ పాయింట్లను పూర్తిగా తొలగించారు. కేటగిరీ 1, 2, 3, 4లకు వరుసగా 1, 2, 3, 5 పాయింట్లను కేటాయిస్తారు. మధ్యాహ్న భోజన పథకం పాయింట్లను అందరూ టీచర్లకు సమానంగా ఇవ్వనున్నారు. 1–9 తరగతులు బోధించే వారికి సీసీఈ, శ్లాస్, త్రీఆర్‌ఎస్ మార్కుల మేరకు వారు బోధించిన తరగతుల సగటు ఆధారంగా పాయింట్లు కేటాయిస్తారు. సీసీఈ, శ్లాస్, త్రీఆర్స్ డేటా మార్కులు అప్లోడ్ కాని మండలాలు, పాఠశాలల ఉపాధ్యాయులకు జిల్లా సగటు ఆధారంగా పాయింట్లు కేటాయిస్తారు. రేషనలైజేషన్‌లో ఎఫెక్ట్ అయ్యే వారికి మూడు పాయింట్లు ఇస్తారు. 2015లో రేషనలైజేషన్‌కు గురైన వారు తిరిగి రేషనలైజేషన్‌లో వెళ్లాల్సి వస్తే వారికి గత కౌన్సెలింగ్ పాయింట్లు కొనసాగిస్తారు. ఏజెన్సీలో హిల్‌టాప్‌పై ఉన్న పాఠశాలలను కేటగిరీ–4గా గుర్తిస్తారు. కౌన్సెలింగ్ సమయంలో జూలై 31 నాటికి ఉన్న ఖాళీలన్నీ చూపిస్తారు. 2019 జూలై 31లోపు పదవీ విరమణ చేసే వారికి బదిలీల్లో మినహాయింపు ఇస్తారు. -
ఎట్టకేలకు ఎస్సైల బదిలీలు
58 మందికి స్థానచలనం 29 మంది ప్రొబేషనరీలకు పోస్టింగ్ ఖమ్మం క్రైం : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎస్సైల బదిలీలు ఎట్టకేలకు జరిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 58 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ డీఐజీ ప్రభాకర్‌రావు బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఉత్తర్వులు జారీ చేశారు. ప్రొబేషనరీ కాలం పూర్తి చేసిన 29 మంది ఎస్సైలకు వివిధ పోలీస్స్టేషన్లలో పోస్టింగ్ ఇచ్చారు. గతంలో పనిచేస్తూ.. బదిలీ అయిన ఎక్కువ మంది ఎస్సైలకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా వీఆర్‌లో ఉంచడం గమనార్హం. కొందరు ఎస్సైలు రెండేళ్ల సర్వీసు పూర్తికాక ముందే బదిలీ అయ్యారు. కొంతమేరకు రాజకీయ ఒత్తిళ్లు.. పనితీరును బట్టి బదిలీ అయ్యారని తెలుస్తోంది. ఏడూళ్ల బయ్యారం ఎస్సైని బదిలీ చేసినప్పటికీ.. అక్కడ ఎవరికీ పోస్టింగ్ ఇవ్వలేదు. నగరంలోని మూడు పోలీస్స్టేషన్లలో పనిచేస్తున్న ఎస్సైలలో ఎవరినీ బదిలీ చేయలేదు. వీరిలో కొందరు పలు పోలీస్స్టేషన్లకు బదిలీ కోసం ప్రయత్నాలు చేసినా.. ఉన్నతాధికారులు అవకాశం కల్పించలేదు. ముదిగొండ పోస్టింగ్ కోసం భారీ ఎత్తున పైరవీలు జరిగినా అక్కడున్న ఎస్సైకి విధి నిర్వహణలో మంచి పేరుండటంతో ఆయన బదిలీ జరగలేదని తెలుస్తోంది. దీంతో మరోసారి భారీగా ఎస్సైల బదిలీలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా, బదిలీలు అయిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. –––––––––––––––––––––––––––––––––––––––––– పేరు ప్రస్తుత స్థానం బదిలీ అయిన స్థానం –––––––––––––––––––––––––––––––––––––––––– పొదురి రఘు ప్రొబేషనరీ కూసుమంచి గుంటి శ్రీధర్ కూసుమంచి వీఆర్ తోట నాగరాజు ప్రొబేషనరీ ఏన్కూరు బర్ల సంజీవ్ ఏన్కూరు వీఆర్ గడ్డం ప్రవీణ్‌కుమార్ ప్రొబేషనరీ కొమరారం ముసుకు అబ్బయ్య కొమరారం వీఆర్ మండ చిరంజీవి ప్రొబేషనరీ ఖమ్మం రూరల్ టి.గోపి ఖమ్మం రూరల్ వీఆర్ కొణతం సుమన్ ప్రొబేషనరీ నెలకొండపల్లి దేవేందర్‌రావు నేలకొండపల్లి వీఆర్ పోగుళ్ల సురేష్ ప్రొబేషనరీ చింతకాని సముద్రాల జితేందర్ చింతకాని వీఆర్ వడ్లకొండ సురేష్ ప్రొబేషనరీ గుండాల బొజ్జ మహేష్ గుండాల వీఆర్ వర్ల శ్రీనివాస్ ప్రొబేషనరీ బొనకల్ కన్నం కుమారస్వామి బోనకల్ వీఆర్ మేడా ప్రసాద్ ప్రొబేషనరీ తల్లాడ భానుప్రకాష్ తల్లాడ వీఆర్ బండారి కిషోర్ ప్రొబేషనరీ మధిర రూరల్ జాటోత్ వసంత్‌కుమార్ మధిర రూరల్ వీఆర్ జి.శ్రీనివాస్ వైరా వీఆర్ జె.ఆంజనేయులు ప్రొబేషనరీ ఎర్రుపాలెం ఎన్.గౌతమ్ ఎర్రుపాలెం వీఆర్ బి.సురేష్ ప్రొబేషనరీ అశ్వారావుపేట కొండు శ్రీను అశ్వారావుపేట వీఆర్ గజ్జెల నరేష్ ప్రొబేషనరీ వీ.ఎం.బంజర పులిగండ్ల నవీన్ వీ.ఎం.బంజర అటాచ్డ్ సీసీఎస్ దూలం పవన్‌కుమార్ ప్రొబేషనరీ కల్లూరు పంజాల సర్వయ్య కల్లూరు అటాచ్డ్ సీసీఎస్ పొదిళ్ల వెంకన్న ప్రొబేషనరీ వేంసూరు బిళ్ల వెంకటేశ్వర్లు వేంసూరు అటాచ్డ్ సీసీఎస్ జలకం ప్రవీణ్ ప్రొబేషనరీ దమ్మపేట మడిపల్లినాగరాజు దమ్మపేట అటాచ్డ్ సీసీఎస్ ఇళ్ల రాజేష్ ప్రొబేషనరీ జూలూరుపాడు పెండెం శ్రీనివాస్ జూలూరుపాడు అటాచ్డ్ సీసీఎస్ చిలుముల వంశీధర్ ప్రొబేషనరీ గార్ల బి.రాజు గార్ల అటాచ్డ్ సీసీఎస్ గుర్రం ఉదయ్‌కిరణ్ ప్రొబేషనరీ బూర్గంపహాడ్ ఎన్.కరుణాకర్ బూర్గంపహాడ్ అటాచ్డ్ సీసీఎస్ భానోత్ రాంచరణ్ ప్రొబేషనరీ ముల్కలపల్లి మాచర్ల అరుణ్‌కుమార్ ములక్కలపల్లి అటాచ్డ్ సీసీఎస్ గుండా రంజిత్‌కుమార్ ప్రొబేషనరీ కామేపల్లి ఈ.శ్రీనివాస్ కామేపల్లి అటాచ్డ్ సీసీఎస్ ఎస్.అశోక్ ప్రొబేషనరీ గార్ల బయ్యారం బంగారి అనిల్‌కుమార్ గార్ల బయ్యారం అటాచ్డ్ డీఎస్బీ అరకుల అనిల్ ప్రొబేషనరీ బోడు బి.అశోక్ బోడు అటాచ్డ్ డీఎస్బీ మేకల కుమారస్వామి ప్రొబేషనరీ ఆళ్లపల్లి దోలకాశి చంద్రశేఖర్ ఆళ్లపల్లి అటాచ్డ్ డీఎస్బీ దురుశెట్టి అరుణ్‌ప్రసాద్ ఏడూళ్లబయ్యారం అటాచ్డ్ డీఎస్బీ ఎ.కిరణ్‌కుమార్ ప్రొబేషనరీ కారేపల్లి ముత్త రవికుమార్ కారేపల్లి అటాచ్డ్ డీఎస్బీ ఇమ్మడి రాజ్‌కుమార్ ప్రొబేషనరీ కరకగూడెం ముత్యం రమేష్ కరకగూడెం అటాచ్డ్ డీఎస్బీ బొమ్మర బాలకృష్ణ ప్రొబేషనరీ దుమ్ముగూడెం కడారి ప్రసాద్ దుమ్ముగూడెం అటాచ్డ్ డీఎస్బీ -
నల్లపాడు రోడ్డులో వైఎస్ జగన్ దీక్ష