YSRCP: పోలీసుల అడ్డంకులు దాటుకుని ఛలో మెడికల్‌ కాలేజీ | YSRCP Chalo Medical College Protests Against Privatization Live News Updates And Top News Headlines In Telugu | Sakshi
Sakshi News home page

YSRCP ఛలో మెడికల్ కాలేజీ ధర్నా: జగన్‌ చరిత్ర సృష్టిస్తే.. చరిత్ర హీనుడిగా బాబు

Sep 19 2025 7:42 AM | Updated on Sep 19 2025 2:16 PM

YSRCP Chalo Medical College Protests Against Privatization Updates News

సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్న చంద్రబాబు సర్కార్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ ఇవాళ ఆందోళన కార్యక్రమానికి పిలుపు ఇచ్చింది. ఛలో మెడికల్ కాలేజీ పేరిట.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మెడికల్ కాలేజీల ఎదుట ధర్నా నిర్వహించబోంది. అయితే ఈ ధర్నాను అడ్డుకునేందుకు వైఎస్సార్‌సీపీ నేతలపైకి కూటమి ప్రభుత్వం పోలీసులను ప్రయోగిస్తోంది.

  • చంద్రబాబు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన ఒక్క మెడికల్ కాలేజ్ కూడా కట్టలేదు
  • వైఎస్‌ జగన్‌కి మంచి పేరు వస్తుందని ప్రైవేట్‌కు అప్పగించాలని నిర్ణయించడం దారుణం
  • ప్రైవేటైజేషన్‌ విధానాన్ని తీవ్రంగా విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు వ్యతిరేకించాయి
  • ప్రభుత్వ మెడికల్ కాలేజీలు  పూర్తయితే జగన్‌కు మంచి పేరు వస్తుందని తట్టుకోలేకపోతున్నారు
  • కూటమి నేతలు తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా?
  • చంద్రబాబు మంత్రులు నాతో వస్తే మెడికల్ కాలేజీ పరిస్థితి ఏంటో చూపిస్తా
  • విజనరీ నాయకుడు అని చెప్పుకునే చంద్రబాబు 5వేల కోట్లు మెడికల్ కాలేజీలకు ఇవ్వలేరా?
  • చంద్రబాబు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో చరిత్ర హీనుడిగా మిగిలిపోతున్నాడు
  • అనిత ఇంఛార్జ్‌గా ఉన్న విజయనగరం, పాడేరు, నర్సీపట్నం కాలేజీలు నాతో అనిత వస్తే చూపిస్తాను
  • 15నెలల్లో మెడికల్ కాలేజీకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు
  • మంత్రి సవిత మెడికల్ కాలేజేల వద్ద కామెడి స్కిట్స్ చేస్తున్నారు
  • బీసీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌కి రూ. 50 కోట్లు కూడా విడుదల చేయించుకోలేకపోయారు.
  • చంద్రబాబు కూటమి ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం మెడికల్ కాలేజీల్ని ప్రైవేటుపరం చేస్తుంది.- వరదు కళ్యాణి

 పార్వతీపురం మన్యం జిల్లా

  • రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం దుర్మార్గ చర్య
  • ఆరోగ్య శ్రీ తొలగిస్తామంటే పేదలకు అందని ద్రాక్షాలా వైద్యం  
  • వైఎస్ జగన్ ప్రజారోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చారు:మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర కామెంట్స్

పల్నాడు జిల్లా:

  • ఛలో మెడికల్ కాలేజీ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాదు నుంచి పిడుగురాళ్ల వస్తున్న మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని మిర్యాలగూడలో అరెస్ట్ చేసిన ఆంధ్ర పోలీసులు
  • పక్క రాష్ట్రానికి వచ్చి మరి పోలీసులు అక్రమ అరెస్టు చేస్తున్నారు
  • ఎన్నికల సమయంలో సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో కట్టిన మెడికల్ కాలేజీలను అమ్మేసుకుంటున్నాడు
  • చంద్రబాబు అనుచరులకు చెంచా గాళ్ళకు మెడికల్ కాలేజీలు కట్ట పెట్టాలని చూస్తున్నారు
  • మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రభుత్వం వెనక్కి తీసుకునే అంతవరకు మా పోరాటం ఆగదు
  • ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టిన న్యాయ పోరాటం చేస్తాం-కాసు మహేష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే  

బాపట్ల

  • చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీ లను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న వైఎస్సార్‌సీపీ
  • వైఎస్సార్‌సీపీ విద్యార్థి,యువజన విభాగం ఆధ్వర్యంలో ఛలో మెడికల్ కాలేజీ కార్యక్రమం
  • కార్యక్రమంలో పాల్గొన్న బాపట్ల జిల్లా అధ్యక్షుడు మెరుగు నాగార్జున, అద్దంకి సమన్వయకర్త చింతలపూడి అశోక్ కుమార్, పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త గాదే మధుసూదన్ రెడ్డి, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్ బాబు.

పార్వతీపురం మన్యం జిల్లా

  • ప్రజలకు సంబంధించిన ఆస్తి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి. దీనిని ప్రైవేట్ చేస్తుంటే చూస్తూ ఊరుకోం.
  • ఎస్టీ లకు సంబంధించిన జిల్లాలో కార్పొరేట్ స్థాయి ప్రభుత్వ ఆస్పత్రిని కబ్జా చేసి ప్రైవేట్‌కు అప్పగిస్తున్నారు.
  • గిరిజన విద్యను ప్రైవేట్ చేయడంని గిరిజన మంత్రి స్పందించరా.
  • కొండపల్లి శ్రీనివాస్ ఎలా మంత్రివి అయ్యావు
  • జగన్ తీసుకొచ్చిన కాలేజీలను కేంద్రం తెచ్చింది అని అబద్ధాలు చెప్తావు.
  • స్టేట్ ఫండ్, నాబార్డ్ ఫండ్ గురుంచి తెలియకుండా ఎలా మాట్లాడుతారు.
  • మంత్రి పదవులు కాపాడుకోవడానికి ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారు.
  • చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముడు పోయారు.
  • ప్రైవేటీకరణ జిఓలను ఉపసంహరించుకోవాలి.
  • లేదంటే మరింత పోరాటం చేస్తాం -మాజీ మంత్రి సీదిరి అప్పల రాజు 

ప్రకాశం

  • చంద్రబాబుకి పేదలంటే అసహ్యం
  • అందుకే  వైద్యం విద్య దూరం చేస్తున్నాడు
  • మార్కాపురం కాలేజీ పూర్తి కాలేదు అంటున్న. కూటమి నాయకులు కళ్లు తెరుచుకొని చూడాలి
  • అమరావతి మీద ఉన్న శ్రద్ద మెడికల్ కాలేజీల మీదలేదు
  • అమరావతి కొంతమందికి మాత్రమే ఉపయోగపడుతుంది
  • మెడికల్ కాలేజీ అందరికీ ఉపయోగపడుతుంది - మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు కామెంట్స్
  • కూటమి నేతలు  కళ్లున్న కబోదిల్లా వ్యవహరిస్తున్నారు
  • మార్కాపురం మెడికల్ కాలేజీ  పూర్తి అయినా కాలేదో  తెలుస్తుంది
  • పదహారు సంవత్సరాలు పరిపాలించిన  తెలుగుదేశం నేతలకు వెనకబడిన ప్రాంతం కనపడలేదు
  • పేదవాళ్ల ఉసురు చంద్రబాబుకి తప్పదు
  • కూటమి నేతలు కృరమృగాలులా ప్రవర్తిస్తున్నారు..‌‌
  • ఎవడబ్బ సొత్తు అని  ప్రయివేటు పరం చేస్తావ్
  • ఒక్కొక్క మెడికల్ కాలేజీకి మూడువందల కోట్లు ఖర్చుపెట్టలేని  మీరు   మీ విలాసాలకు  మూడు హెలికాప్టర్స్ కావాలా?
  • దోచుకోవడమే పనిగా పెట్టుకొని అన్నీ ప్రయివేటు పరం చేస్తున్నాడు
  • ఇంజన్ లేని ప్రభుత్వాన్ని నడుపుతూ  మట్టి నుండి ఆకాశం వరకూ దోచుకుంటున్నారు-యర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ 
     
  • నంద్యాల జిల్లా 
  • ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణకు నిరసనగా ఛలో మెడికల్ కాలేజీకి పిలుపునిచ్చిన వైఎస్సార్‌సీపీ
  • ఛలో మెడికల్ కాలేజ్ కార్యక్రమానికి అడుగడుగున ఆంక్షలు విధించిన పోలీసులు
  • 30 పోలిస్ యాక్ట్ అమలులో ఉందంటూ వైఎస్సార్‌సీపీ శ్రేణులను అడ్డుకున్న పోలీసులు
  • ప్రైవేటీకరణ దారుణమంటూ ఆందోళనకు వచ్చిన వారిని బలవంతంగా పోలీసుల జీపుల్లో , లారీల్లో ఎక్కించి పోలీస్ స్టేషన్లకు తరలింపు
  • మెడికల్ కళాశాలలే కట్టలేదు అని చెప్పే కూటమి ప్రభుత్వానికి ఎందుకు అంత భయం
  • అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరంటూ హెచ్చరించిన వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం
  • వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సురేష్,సర్పంచ్ సుజిత్‌తో పాటు, మహిళలను, విద్యార్థులను,వైఎస్సార్‌సీపీ   నాయకులను అరెస్టు చేసిన పోలీసులు
  • మడకశిర సమన్వయకర్త ఈరలక్కప్ప, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి

పార్వతీపురం మన్యం జిల్లా:

  • రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం దుర్మార్గ చర్య
  • ఆరోగ్య శ్రీ తొలగిస్తామంటే పేదలకు అందని ద్రాక్షాలా వైద్యం  
  • వైఎస్ జగన్ ప్రజారోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చారు:మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర  

పల్నాడు జిల్లా:

  • ఛలో మెడికల్ కాలేజీ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాదు నుంచి పిడుగురాళ్ల వస్తున్న మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని మిర్యాలగూడలో అరెస్ట్ చేసిన ఆంధ్ర పోలీసులు
  • పక్క రాష్ట్రానికి వచ్చి మరి పోలీసులు అక్రమ అరెస్టు చేస్తున్నారు
  • ఎన్నికల సమయంలో సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో కట్టిన మెడికల్ కాలేజీలను అమ్మేసుకుంటున్నాడు
  • చంద్రబాబు అనుచరులకు చెంచా గాళ్ళకు మెడికల్ కాలేజీలు కట్ట పెట్టాలని చూస్తున్నారు
  • మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రభుత్వం వెనక్కి తీసుకునే అంతవరకు మా పోరాటం ఆగదు
  • ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టిన న్యాయ పోరాటం చేస్తాం-కాసు మహేష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే  

బాపట్ల:

  • చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీ లను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న వైఎస్సార్‌సీపీ
  • వైఎస్సార్‌సీపీ విద్యార్థి,యువజన విభాగం ఆధ్వర్యంలో ఛలో మెడికల్ కాలేజీ కార్యక్రమం
  • కార్యక్రమంలో పాల్గొన్న బాపట్ల జిల్లా అధ్యక్షుడు మెరుగు నాగార్జున, అద్దంకి సమన్వయకర్త చింతలపూడి అశోక్ కుమార్, పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త గాదే మధుసూదన్ రెడ్డి, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్ బాబు.

పార్వతీపురం మన్యం జిల్లా

  • ప్రజలకు సంబంధించిన ఆస్తి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి. దీనిని ప్రైవేట్ చేస్తుంటే చూస్తూ ఊరుకోం.
  • ఎస్టీ లకు సంబంధించిన జిల్లాలో కార్పొరేట్ స్థాయి ప్రభుత్వ ఆస్పత్రిని కబ్జా చేసి ప్రైవేట్‌కు అప్పగిస్తున్నారు.
  • గిరిజన విద్యను ప్రైవేట్ చేయడంని గిరిజన మంత్రి స్పందించరా.
  • కొండపల్లి శ్రీనివాస్ ఎలా మంత్రివి అయ్యావు
  • జగన్ తీసుకొచ్చిన కాలేజీలను కేంద్రం తెచ్చింది అని అబద్ధాలు చెప్తావు.
  • స్టేట్ ఫండ్, నాబార్డ్ ఫండ్ గురుంచి తెలియకుండా ఎలా మాట్లాడుతారు.
  • మంత్రి పదవులు కాపాడుకోవడానికి ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారు.
  • చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముడు పోయారు.
  • ప్రైవేటీకరణ జిఓలను ఉపసంహరించుకోవాలి.
  • లేదంటే మరింత పోరాటం చేస్తాం-మాజీ మంత్రి సీదిరి అప్పల రాజు 
     
    అన్నమయ్య
  • మదనపల్లి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఎదుట వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిరసన
  • ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రవేతీకరణకు నిరసనగా వైఎస్సార్‌సీపీ ఛలో మెడికల్ కాలేజీకి పిలుపు  
  • రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ రెడ్డి,తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాథ్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే లు శ్రీకాంత్ రెడ్డి, తిప్పారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి, తిరుపతి వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జ్‌ భూమన అభినయ్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడు హరిప్రసాద్ రెడ్డి , మదనపల్లి మున్సిపల్ చైర్మన్ మనోజ రెడ్డి, షమీం అష్లాం

ఏలూరు జిల్లా

  • కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయడానికి నిరసిస్తూ..వైఎస్సార్‌సీపీ ఛలో మెడికల్  కాలేజ్ నిరసనకు పిలుపు
  • ఏలూరులో వైఎస్సార్‌సీపీ నేతల నిరసనను అడ్డుకున్న పోలీసులు
  • జిల్లా పార్టీ కార్యాలయం నుండి మెడికల్ కాలేజీకి వెళ్తుండగా నిలిపివేసిన పోలీసులు
  • రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు
  • నిరసన కార్యక్రమంలో పాల్గొన్న  ఏలూరు పార్లమెంట్ కన్వీనర్ కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరావు, పీఏసీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసు బాబు, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఏలూరు ఇంచార్జ్ జయప్రకాష్, చింతలపూడి సమన్వయకర్త కంభం విజయరాజు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు

శ్రీ సత్యసాయి జిల్లా:

  • పెనుకొండ మెడికల్ కాలేజీ ని పరిశీలించిన మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్, మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, జక్కంపూడి రాజా, హిందూపురం సమన్వయకర్త దీపిక, కదిరి సమన్వయకర్త మక్బూల్, అనంతపురం జెడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ, మేయర్ మహమ్మద్ వాసీం

వైఎస్సార్‌ జిల్లా:

  • పులివెందుల మెడికల్ కాలేజీ వద్ద నిరసన తెలుపుతున్న వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగపు నాయకులు
  • ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరైన విద్యార్థులు  
  • మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నడపాలని,పీపీపీ పద్ధతిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్
  • పేదలకు వైద్య విద్యా, వైద్యాన్ని దూరం చేసేందుకు పీపీపీ పద్ధతిని ప్రభుత్వం అనుసరిస్తుంది
  • డౌన్ డౌన్ సీఎం వుయ్ వాంట్ జస్టిస్ అనే నినాదాలు చేస్తూ మెడికల్ కాలేజ్ వద్ద నిరసన

నల్గొండ జిల్లా

  • మిర్యాలగూడ వద్ద గురజాల మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు
  • గుంటూరులో మెడికల్ కాలేజీ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే

కర్నూలు జిల్లా...

  • ఆదోని మెడికల్ కాలేజ్ ప్రవేటికరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ విద్యార్థి,యువజన విభాగం ఆధ్వర్యంలో ఛలో మెడికల్ కాలేజ్ అంటూ నిరసన ర్యాలీ నిర్వహించిన వైఎస్సార్‌సీపీ విద్యార్థి, యువజన సంఘం నాయకులు
  • మెడికల్ కాలేజ్ ప్రవేటికరణకు వ్యతిరేకిస్తూ నినాదాలు చేస్తు విద్యార్థులు,వైఎస్సార్‌సీపీ నాయకులు  
  • చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై మండిపడుతున్న విద్యార్థులు, విద్యార్ది సంఘాలు
  • ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనుక  తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్న విద్యార్దులు
  • ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ బుట్టారేణుకా , మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి,రాష్ట్ర నాయకురాలు ఎస్వీ విజయమనోహరి,విద్యార్ది ,యువజన నాయకులు  

విశాఖ :

  • జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద aisf ధర్నా..
  • మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్..
  • విద్యారంగంలో సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు..
  • మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలి..
  • ఆపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తాం..
  • మంత్రి లోకేష్ విద్యా రంగంలోని సమస్యలను గాలికి వదిలేసారు..
  • యువగళం పాదయాత్రలో లోకేష్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి..
  • లోకేష్‌కి చేతనైతే మెడికల్ కాలేజీలు పూర్తి చేసి ప్రభుత్వ రంగంలో నడపాలి..
  • లేనిపక్షంలో చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చెయ్యాలి.. 

అనకాపల్లి నర్సీపట్నం

  • నర్సీపట్నం ఛలో మెడికల్ కాలేజీపై పోలీసుల ఆంక్షలు
  • నర్సీపట్నం మెడికల్ కాలేజీ సందర్శించకుండా భారీ కేడ్లు ఏర్పాటు
  • మెడికల్ కాలేజీకి వస్తున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులను అడ్డుకుంటున్న వైనం
  • ఛలో మెడికల్ కాలేజీకి అనుమతి లేదంటున్న పోలీసులు..
  • పోలీసులు తీరుపై మండిపడుతున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు..


మచిలీపట్నంలో అడుగడుగునా పోలీసుల ఆంక్షలు

  • ఛలో మెడికల్ కాలేజీ నిరసనకు వెళ్లకుండా వైఎస్సార్‌సీపీ నేతలు,శ్రేణులపై ఆంక్షలు
  • మచిలీపట్నం మూడు స్తంభాల సెంటర్లో వైఎస్సార్‌సీపీ నేతలు దేవినేని అవినాష్ , మొండితోక జగన్మోహన్ రావు , దేవభక్తుని చక్రవర్తి , వైఎస్సార్‌సీపీ విద్యార్ధి విభాగం నేతలను అడ్డుకున్న పోలీసులు
  • తమ వాహనాలను అడ్డుకోవడంతో వాహనాలను అక్కడే వదిలేసి నడుచుకుంటూ వెళ్తున్న వైఎస్సార్‌సీపీ నేతలు

తూర్పుగోదావరి జిల్లా...

  • ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ  చేయడాన్ని వ్యతిరేకిస్తూ రోడ్డుపై బైఠాయించిన మాజీ ఎంపీ భరత్, వైఎస్ఆర్సీపీ శ్రేణులు
  • మార్గాన్ని భరత్‌ను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు

తూర్పుగోదావరి జిల్లా: 

  • రాజమండ్రిలో వైఎస్సార్‌సీపీ తలపెట్టిన ఛలో మెడికల్ కాలేజ్ కార్యక్రమం
  • మాజీ మంత్రి వేణుగోపాల కృష్ణ,జక్కంపూడి గణేష్ మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు గూడూరు శ్రీనివాసులను అడ్డుకున్న పోలీసులు 
  • జక్కంపూడి రాజా ఇంటి వద్ద బైఠాయించిన నేతలు 
  • ప్రభుత్వం చేస్తున్న ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నినాదాలు

 

చంద్రబాబు ఎంత దుర్మార్గుడు అంటే 

  • మెడికల్ కాలేజీ సీటు కోటి రూపాయల పైన పలుకుతోంది
  • ఒక డాక్టర్ బయటకు రావాలంటే కనీసం ఐదు కోట్లు ఖర్చు అవుతోంది
  • ఇంత ఖర్చుతో పేద, మధ్య తరగతి విద్యార్థులు చదవగలరా?
  • అందుకే జగన్ 17 మెడికల్ కాలేజీలు తెచ్చారు
  • అలాంటి కాలేజీలను ప్రైవేటీకరణతో చంద్రబాబు పేదల ఆశలను నీరు గార్చారు
  • మెడికల్ సీట్లు వద్దంటూ లేఖ రాసిన వ్యక్తి చంద్రబాబు
  • మెడికల్ కాలేజీలను తిరిగి ప్రభుత్వ పరంచేసే వరకు ఆందోళనలు చేస్తాం - శివరామిరెడ్డి, ఎమ్మెల్సీ

    పెత్తందార్ల చేతిలో చంద్రబాబు మెడికల్ కాలేజీలను పెడుతున్నారు
     
  • వైఎస్సార్ కుటుంబం పేదల కోసం పాటు పడింది
  • వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్య శ్రీ పేరుతో ఉచిత వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చారు
  • వైఎస్‌ జగన్ మెడికల్ కాలేజీలతో సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చారు
  • అలాంటి వాటిని ప్రైవేటీకరణ సరికాదు
  • పెత్తందార్ల చేతిలో చంద్రబాబు మెడికల్ కాలేజీలను పెడుతున్నారు
  • పేదల ఆరోగ్యాన్ని గాలికి వదిలేయటం సబబు కాదు
  • పీపీపీ విధానాన్ని వెనక్కు తీసుకునే వరకు పోరాటం చేస్తాం -బొమ్ము ఇజ్రాయిల్, ఎమ్మెల్సీ
  • చంద్రబాబు పేదల మీద కక్ష కట్టారు
  • అందుకే మెడికల్ కాలేజీలను ప్రయివేటీకరణ చేస్తున్నారు
  • దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం
  • ప్రభుత్వ మెడలు వంచేదాకా పోరాటం చేస్తాం- సిపాయి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్సీ 
  • ప్రభుత్వం మెడికల్ కాలేజీలను యధావిధిగా కొనసాగించాలి.
  • మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తే సహించేది లేదు
  • చంద్రబాబు ఆలోచన స్వార్ధ పూరితమైనది.
  • చంద్రబాబు ప్రభుత్వం వారి బినామీలకు మేలు చేసే ప్రయత్నం చేస్తోంది.
  • తమ సొంత జేబులు నింపుకునే ప్రయత్నం చేయడం 
    సరికాదు.
  • ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం చేస్తాం.
  • వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక మళ్ళీ మెడికల్ కాలేజీలను ప్రభుత్వ అధీనంలోకి తీసుకువస్తాం -విక్రాంత్, ఎమ్మెల్సీ  

విడుదల రజినిని అడ్డుకున్న పోలీసులు

  • చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడుదల రజిని ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపు
  • చలో మెడికల్ కాలేజీ కార్యక్రమంలో భాగంగా పిడుగురాళ్ల మెడికల్ కాలేజీకి బయలుదేరిన మాజీ మంత్రి విడదల రజిని
  • అడ్డుకున్న పోలీసులు

మాజీ మంత్రి అంబటి రాంబాబుకు నోటీసులు 

  • ఏపీలో మెడికల్‌ కాలేజీ ప్రైవేటీకరణపై వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఛలో మెడికల్‌ కాలేజీ
  • గుంటూరు జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయం లో  విద్యార్థి ,యువజన విభాగాల కార్యకర్తలు
  • పిడుగురాళ్ల, బాపట్ల మెడికల్ కాలేజీలకు ర్యాలీగా బయలుదేరిన విద్యార్థి యువజన విభాగాల కార్యకర్తలు
  • ఛలో మెడికల్ కాలేజీ కార్యక్రమానికి వెళ్ళకూడదు అంటూ అంబటి రాంబాబుకు నోటీసులు
  • పల్నాడులో మాజీ మంత్రి విడదల రజిని, ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నంబూరు శంకర్రావు ఇళ్ల దగ్గర పోలీసుల మోహరింపు
  • పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ కాంపౌండ్‌లోకి వైఎస్సార్‌సీపీ శ్రేణుల్ని వెళ్లనివ్వకుండా బారికేడ్లు ఏర్పాటు

ఇంత నీచంగా దుర్మార్గంగా ఏ ప్రభుత్వం ఆలోచించలేదు

  • ప్రజారోగ్యానికి వ్యతిరేకమైన ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాం
  • దోపిడీ, అవినీతి కోసం ఈ విధానాన్ని తీసుకువస్తున్నారు
  • ఇప్పటికే పార్టీ తరఫున పోరాటం చేస్తున్నాం
  • గతంలో ఏ ప్రభుత్వం ఇలా ఆలోచించలేదు
  • ప్రజలు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు, వైద్యశాలలు రావాలని కోరుకుంటారు
  • ఇంత నీచంగా దుర్మార్గంగా ఏ ప్రభుత్వం ఆలోచించలేదు
  • ప్రభుత్వ మెడికల్ కళాశాల, ఆస్పత్రులను దోచుకోవాలని నీచమైన ఆలోచన రావటం దురదృష్టకరం
  • ఈ విషయంలో ఎంతవరకైనా పోరాటం చేస్తాం
  • కళ్ళుండి చూడలేకపోతున్న కూటమి ప్రభుత్వం
  • ఇప్పటివరకు అమరావతి లో ఏం చేశారు.. ఎంత ఖర్చు పెట్టారు..
  • మేం ఎంత ఖర్చు చేశామో వాళ్ళే చెప్తున్నారు
  • పీపీ అంటే దోపిడీ నా.. పేదలకు ఆరోగ్యం  దొరుకుతుందా..
  • ఎవరు చెప్పారు ఇది.. ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారు..
  • చేతకాకపోతే ఏదీ కాదు..
  • ప్రజల కోసం ఏమైనా చేయాలనే తపన ఉండాలి..- శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ  
     

చరిత్ర హీనుడిగా చంద్రబాబు..

  • చంద్రబాబు నిర్ణయం ప్రజల ఆరోగ్య భద్రతకు ముప్పు

  • పేదలకు వైద్య విద్య దూరం చేసే కుట్రలు

  • మూడుసార్లు సీఎంగా చేసిన వ్యక్తి ఒక్క మెడికల్‌ కాలేజీ అయినా తెచ్చారా?

  • జగన్‌ చరిత్ర సృష్టిస్తే.. బాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోయారు
    :::ఎమ్మెల్సీ వరుదు కల్యాణి

     

  • పేదవాడిపై బాబు సర్కార్‌ కక్ష కట్టింది

  • పేదవాడికి న్యాయం చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు

  • ఛలో మెడికల్‌ కాలేజీ కార్యక్రమంపై ఆంక్షలు విధించారు

  • బాబు హయాంలో ఒక్క మెడికల్‌ కాలేజీ అయినా తెచ్చాడా?
    ::: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి

 

 

అల్లూరి జిల్లా..  

  • మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నేడు చలో మెడికల్ కాలేజీ కు వైయస్సార్సీపి పిలుపు.
  • పాడేరు మెడికల్ కాలేజీను కాసేపట్లో సందర్శించనున్న వైయస్సార్సీపీ నేతలు..
  • పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా పాడేరు మెడికల్ కాలేజీకి వైఎస్సార్సీపీ నాయకులు.
  • 500 కోట్లతో 35 ఎకరాల్లో వైయస్ జగన్ హయాంలో మెడికల్ కాలేజీ నిర్మాణం ప్రారంభం.
  • ఇప్పటికే ప్రారంభమైన మెడికల్ కాలేజీ తరగతులు..
  • చంద్రబాబు నిర్లక్ష్యం వలన 150 ఎంబీబీఎస్ సీట్లు, 50 సీట్లకు కుదింపు
  • వైయస్ జగన్ పాలనలో 70 శాతానికి పైగా పూర్తయిన మెడికల్ కాలేజీ నిర్మాణం
  • కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నత్త నడకన మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు

తూర్పుగోదావరి జిల్లా..

  • వైఎస్సార్సీపీ తలపెట్టిన ఛలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కార్యక్రమానికి అడ్డంకులు సృష్టిస్తున్న ప్రభుత్వం
  • వైఎస్సార్సీపీ నేతల ఇళ్ళ వద్ద పోలీస్ కాపలా
  • నేతలను హౌస్ చేసిన పోలీసులు.. నోటీసులు అందజేత
  • మాజీ ఎంపీ మార్గాన్ని భరత్, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇళ్ల వద్ద భారీగా పోలీసుల మోహరింపు

అమరావతి

  • మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణపై వాయిదా తీర్మానం

  • శాసన మండలిలో వైఎస్సార్‌సీపీ వాయిదా తీర్మానం

  • మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై చర్చించాలని తీర్మానం

  • మరోవైపు.. వైఎస్సార్‌సీపీ ఛలో మెడికల్‌ కాలేజీ నిర్వహణ

అనంతపురం జిల్లా..

  • మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పై నిరసన జ్వాలలు
  • నేడు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చలో మెడికల్ కాలేజీ
  • శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మెడికల్ కాలేజీ వద్ద కార్యక్రమం
  • పెద్దసంఖ్యలో తరలివస్తున్న విద్యార్థులు, యువకులు
  • చంద్రబాబు కు వ్యతిరేకంగా నినాదాలు
  • హాజరుకానున్న వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, వైఎస్సార్ సీపీ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు.. మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్, అనంతపురం జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి

ప్రకాశం జిల్లా ..

  • మార్కాపురం లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీను ప్రవేటికరణ చేయడం పై నిరసన తెలుపునున్నా వైయస్సార్సీపీ నాయకులు
  • ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అనుమతి లేదని ముందస్తు నోటీసులు జారీ చేసిన మార్కాపురం పోలీసులు
  • చీమకుర్తిలోని బూచేపల్లి నివాసంలో దర్శి ఎమ్మెల్యే, జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షుడు బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డికి నోటీసులు ఇచ్చిన చీమకుర్తి ఎస్ఐ కృష్ణయ్య

తూర్పుగోదావరి జిల్లా.

  • ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ వైసీపీ ఛలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ 
  • మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ ఆధ్వర్యంలో క్వారీ సెంటర్ నుండి మెడికల్ కాలేజ్ వరకు శాంతియుత ర్యాలీ

కర్నూలు జిల్లా ..

  • ఛలో  మెడికల్ కాలేజ్ కార్యక్రమాన్ని అడుగడుగున అడ్డుకుంటున్న పోలీసులు,
  • మెడికల్ కాలేజ్ ప్రవేటికరణ చేసిన చంద్రబాబు తీరు మార్చుకోవాలని అన్ని మెడికల్ కాలేజ్ ల వద్ద శాంతియుత నిరసనకు వైఎస్ఆర్సీపీ పార్టీ పిలుపు,
  • శాంతియుత నిరసన  తెలపడానికి నంద్యాల మెడికల్ కాలేజ్ కి వెళ్తున్న రాష్ట్ర యువజన విభాగ వర్కింగ్‌ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి ని కర్నూలులోని ఆయన నివాసం నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు,
  • ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లను ప్రవేటికరణ కార్యకమాన్ని శాంతి యుతంగా చేస్తాం అంటే మీరు ఎలా అడ్డుకుంటారని పోలీసులను ప్రశించిన బైరెడ్డి సిద్దార్థ రెడ్డి,
  • సిద్ధార్థ రెడ్డిని  పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడంతో ఆయన ఇంటి వద్దకి చేరుకుంటున్న వైసీపీ శ్రేణులు,
  • సిద్దార్థ రెడ్డి  ఇంటి వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు...

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా...

  • అమలాపురం ప్రభుత్వ మెడికల్ కళాశాల వద్ద వైఎస్సార్‌సీపీ నిరసన కార్యక్రమం
  • హాజరుకానున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా, నేతలు, కార్యకర్తలు

గత వైఎస్సార్‌సీపీ హయాంలో పేద, మధ్య తరగతి ప్రజల మేలు కోసం 17 మెడికల్ కాలేజీలకు అనుమతి తీసుకొచ్చారు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి. తద్వారా అతి తక్కువ ఖర్చుకే సూపర్ స్పెషాలిటీ వైద్యం అందాలని ఆయన ఆశించారు. ఈ క్రమంలో కొన్ని కాలేజీల్లో తరగతులూ ప్రారంభం అయ్యాయి కూడా. అయితే.. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక నిర్మాణంలో ఉన్న కాలేజీలనూ పట్టించుకోలేదు. పైగా.. ఇప్పుడు పీపీపీ పేరుతో లక్షన్నర కోట్ల రూపాయల విలువ చేసే కాలేజీలను ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో పెడుతున్నారు. ఈ క్రమంలో మంత్రులతో తప్పుడు ప్రచారం సైతం చేయించారు. 

మెడికల్ కాలేజీలను తన బినామీలకు దోచి పెడుతున్న చంద్రబాబు చర్యలను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపు ఇచ్చింది. పార్టీ యువత, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో ధర్నాలు చేపట్టబోతోంది. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత దాకా ఆందోళనలు కొనసాగుతాయని హెచ్చరిస్తోంది కూడా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement