breaking news
Medical Colleges Privatization
-
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఏఐఎస్ఎఫ్ నిరసన
పాడేరు(అల్లూరి జిల్లా: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఏఐఎస్ఎఫ్ నిరసన చేపట్టింది. విద్యావ్యవస్థను నీరుగారుస్తున్న కూటమి ప్రభుత్వం చర్యలను తప్పుబట్టింది. ఈ మేరకు పాడేరు మెడికల్ కళాశాలను విద్యార్థి సంఘాల బృందం సందర్శించింది. విద్యార్థుల సంస్థల్లో నెలకొన్న సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర చేపట్టింది ఏఐఎస్ఎఫ్.సీపీపీ పేరుతో ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రేవేటుపరం చేస్తే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించింది. ప్రభుత్వ యూనివర్సిటీలను కాపాడుదాం! ఉద్యమాలను తీవ్రతం చేద్దాం!.... అంటూ పిలుపునిచ్చింది. ప్రభుత్వం తీసుకొచ్చిన తప్పుడు జీవో నెంబర్77ను రద్దు చేయాలని డిమాండ్ చేసింది. విద్యార్థుల హక్కులను హరించే ప్రభుత్వ ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. -
మెడికల్ కాలేజీలను ఎవరికి దోచి పెట్టాలో రెడీ చేశారు: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలకు వైఎస్సార్సీపీ సిద్ధమైంది. ఇందులో భాగంగా ఈనెల 28న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో ధర్నాలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ నేతలు పోస్టర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, అరుణ్ కుమార్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, కారుమూరి నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ హయాంలో ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి అయ్యాయి. అబద్ధాలు చెప్పి దబాయించడం చంద్రబాబు అలవాటే. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను అన్ని వర్గాల ప్రజలకు వ్యతిరేకిస్తున్నారు. వైఎస్ జగన్ ఒకేసారి 17 మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేశారు. కోవిడ్ తర్వాత ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి అయ్యాయి. కూటమి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆపే వరకు వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది. మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ దుర్మార్గ చర్య. దీనిపై ప్రజల్లో కూడా వ్యతిరేకత బాగా పెరిగింది. ప్రభుత్వం వెనక్కు తగ్గే వరకు పోరాటం చేస్తాం. ఇది రాజకీయాల కోసం కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసమే. ఈనెల 28న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో నిరసన ర్యాలీలు చేస్తాం. ప్రజాస్వామ్య వాదులంతా హాజరు కావాలని కోరుకుంటున్నాం. ఇప్పటికే కోటి సంతకాల సేకరణ ఉదృతంగా జరుగుతోంది. ప్రజల అభిప్రాయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తాం. స్వచ్ఛందంగా ప్రజా సంఘాలు, మేధావులు ఈ పోరాటంలో పాల్గొంటున్నారు.అందులో భాగంగానే ఈనెల 28న అసెంబ్లీ నియోజకవర్గాలలో ర్యాలీలు చేయబోతున్నాం. తర్వాత నవంబర్ 12న జిల్లా కేంద్రాలలో కూడా ర్యాలీలు చేస్తాం. కోటి సంతకాలు పూర్తి చేసుకుని వాటిని నవంబర్ 23న జిల్లాలకు తరలిస్తాం. అనంతరం కేంద్ర కార్యాలయానికి వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణను ఆపాలి. పేద, మధ్య తరగతి కుటుంబాలకు వైద్యం, వైద్య విద్యను అందించాలన్నది వైఎస్ జగన్ ఉద్దేశం. అందుకే 17 మెడికల్ కాలేజీలను తీసుకువచ్చారు. మెడికల్ కాలేజీల నిర్మాణాలు ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతాయి. ఒక్కరోజులో ఏ కాలేజీ పూర్తి కాదు. ఎయిమ్స్ లాంటి సంస్థ పూర్తవటానికే తొమ్మిదేళ్లు పట్టింది.పులివెందుల కాలేజీ పూర్తయినా చంద్రబాబు సీట్లు రాకుండా అడ్డుకున్నారు. పాడేరు కాలేజీకి 50 సీట్లు చాలని మిగతావి రాకుండా అడ్డుకున్నారు. సంవత్సరానికి వెయ్యి కోట్లు చొప్పున నాలుగైదేళ్లు ఖర్చు చేస్తే కాలేజీలన్నీ అందుబాటులోకి వస్తాయి. పీపీపీ అంటే ప్రయివేటీకరణ కాదని చంద్రబాబు కొత్త భాష్యం చెప్తున్నారు. లాభాల కోసమే ప్రైవేటు వ్యక్తులు మెడికల్ కాలేజీలతో వ్యాపారం చేస్తారు. ఇప్పటికే ఎవరెవరికి ఏ కాలేజీని దోచి పెట్టాలో నిర్ణయం తీసుకున్నారు. ఇక పేద, మధ్య తరగతి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పవు. ఇలాంటి విధ్వంసాన్ని ఏపీలో ఎప్పుడూ చూడలేదు. కానీ, తన మీడియా పవర్‌తో ఎదుటి వారిపై విమర్శలు చేస్తున్నారు’ అని అన్నారు. -
చంద్రబాబు అంటేనే కాపీ కొట్టడం: మల్లాది విష్ణు
సాక్షి, విజయవాడ: చంద్రబాబు అప్పులు చేసి అభూత కల్పనపై ఖర్చు పెడుతున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు వైఎస్సార్సీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. వైఎస్ జగన్ చేసిన పనులను చూసి కాపీ కొట్టడమే చంద్రబాబుకు తెలిసిన విద్య అని ఎద్దేవా చేశారు. అలాగే, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరిగింది అంటూ వ్యాఖ్యలు చేశారు.మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేవీనగర్‌లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్ శైలజ రెడ్డి, కార్పొరేటర్ జానారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ..‘మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. చంద్రబాబు అప్పులు చేసి అభూత కల్పనపై ఖర్చు పెడుతున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరిగింది. చంద్రబాబు ఆరోగ్య శ్రీని నిర్వీర్యం చేశాడు . వైఎస్ జగన్ ఆరోగ్యశ్రీకి గ్రీన్ చానల్ అని పెట్టి ఎప్పటికప్పుడు బకాయిలు చెల్లించారు. ఆరోగ్య శ్రీ ఉద్యోగులు రోడ్డుపై నిరసనలకు దిగుతున్నారుప్రతి సందర్భంలో వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా కూటమి నేతలు విర్రవీగుతున్నారు. వైఎస్ జగన్ దీపావళి పండగ చేస్తే.. దానిపై బురద జల్లుతున్నారు. వైఎస్ జగన్ చేసిన పనులన్నీ చంద్రబాబు కాపీ కొట్టడమే పని. వైఎస్ జగన్ దీపావళి చేస్తే.. చంద్రబాబు విజయవాడలో దీపావళి చేస్తాడు. వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తే.. చంద్రబాబు విజయవాడలో వినాయక చవితి వేడుకలు ఏర్పాటు చేశాడు. వైఎస్ జగన్ చేసే ప్రతీ పనిని చంద్రబాబు కాపీ కొడుతున్నాడు. ప్రజల విషయంలో అన్యాయం జరిగితే వైఎస్సార్సీపీ ఉద్యమాలు చేపడుతుంది. 28వ తేదీన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా భారీ ర్యాలీ చేపడతాం’ అని చెప్పుకొచ్చారు. -
వైఎస్ జగన్ స్థాపించిన మెడికల్ కాలేజీలకు పీజీ సీట్ల మంజూరు
విజయవాడ: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ హయాంలో స్థాపించిన మెడికల్ కాలేజీలకు పీజీ సీట్లు మంజూరయ్యాయి. తొలిసారి కొత్త మెడికల్ కాలేజీలకు పీజీ సీట్లు మంజూరు చేసింది ఎన్ఎంసీ(National Medical Commission). ఇందులో మచిలీపట్నం-12, నంద్యాల-16, విజయనగరం -12, రాజమండ్రి-16, ఏలూరు -4 చొప్పున పీజీ సీట్లు మంజూరు చేసింది. ఐదు మెడికల్ కాలేజీలకు 60 మెడికల్ పీజీ సీట్లు మంజూరు చేయడంతో ఇన్నాళ్లు కూటమి ప్రభుత్వ పెద్దలు చెబుతున్నది అబద్ధమేనని తేలిపోయింది. వైఎస్ జగన్ మెడికల్ కాలేజీలు కట్టలేదంటూ మంత్రులు సైతం అబద్ధాలు చెప్పారు. వైఎస్ జగన్ స్థాపించిన మెడికల్ కాలేజీలకు తాజాగా పీజీ సీట్లు మంజూరు కావడంతో ప్రభుత్వ పెద్దలు చెప్పేదంతా అసత్య ప్రచారమేనని నిర్ధారణ అయ్యింది. ఇప్పటికే 5 కాలేజీల్లో 150 చొప్పున ఎంబీబీఎస్ సీట్లు మంజూరు కాగా, తాజాగా 60 పీజీ సీట్లు మంజూరు చేసింది ఎన్ఎమ్సీ.ఇదీ చదవండి: ‘వైద్య రంగంలో జగన్ సేవలను శత్రువులైనా అంగీకరించాల్సిందే’ -
మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి వాహనంపై టీడీపీ గూండాల దాడి
సాక్షి,కర్నూల్: కృష్ణగిరి మండలం చిట్యాల గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి వాహనంపై టీడీపీ గూండాలు దాడి చేశాయి. చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు వెళ్తుండగా టీడీపీ గూండాలు కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. టీడీపీ గూండాల దాడిలో వైఎస్సార్సీపీ ఎంపీపీ వాహనం ధ్వంసమైంది. వైఎస్సార్సీపీ నేతలు గ్రామంలోకి అడుగు పెట్టకూడదు అంటూ హుకుం జారీ చేశారు. గ్రామంలో రెచ్చిపోతూ స్థానికుల్ని టీడీపీ గూండాలు భయబ్రాంతులకు గురి చేశారు. -
డబ్బులేని పేదోడు ఈ రాష్ట్రంలో బతకొద్దా.. బాబుకు శ్యామల వార్నింగ్
-
ప్రైవేటీకరణ ఆపించండి.. ప్రధానిని కలిసి విజ్ఞప్తి చేసిన వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, కర్నూలు: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం ఆపించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీని వైఎస్సార్సీపీ నేతలు కోరారు. తాజాగా జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన్ని ఎయిర్‌పోర్టు వద్ద పలువురు నేతలు కలిశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిలిపివేయాలని ఈ సందర్భంగా ప్రధానిని వైఎస్సార్సీపీ నేతలు కోరారు. అలాగే.. వాల్మీకీలను ఎస్టీ జాబితాలో చేర్చే అంశం పరిశీలించాలని, నంద్యాల-కల్వకుర్తి బ్రిడ్జి కమ్ బ్యారేజ్ నిర్మించే అంశాన్ని పరిశీలించాలని కోరారు. ప్రధాని మోదీని కలిసిన వాళ్ళలో ఎమ్మెల్యే విరూపాక్షి, ఎమ్మెల్సీ మధుసూదన్, జెడ్పీ చైర్మన్.. తదితరులు ఉన్నారు. -
Malladi Vishnu: పేరుకే అనుభవం అభివృద్ధిలో శూన్యం
-
పేదలకు వైద్యవిద్యను దూరం చేయొద్దు మెడికల్ కళాశాలల పీపీపీ ఆపండి
గాందీనగర్(విజయవాడసెంట్రల్): కూటమి ప్రభుత్వం పేదలకు వైద్య విద్యను దూరం చేసేందుకే ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరిస్తోందని మేధోమథన సదస్సులో పలువురు వక్తలు విమర్శించారు. పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు మెడికల్ కాలేజీలు కట్టబెట్టేందుకు జారీ చేసిన జీవోను తక్షణమే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్య, వైద్యం ప్రభుత్వం రంగంలోనే నడపాలని పట్టుబట్టారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో శనివారం జై భీమ్ రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో మేధోమథన సదస్సు జరిగింది. ఈ సదస్సులో పలువురు వక్తలు మాట్లాడుతూ గత ఎన్నికల్లో కూటమికి సహకరించిన ఎన్ఆర్ఐలు, కార్పొరేట్లు, తమకు కావాల్సిన వారికి మెడికల్ కళాశాలలను కట్టబెట్టేందుకు లోపభూయిష్టమైన పీపీపీ విధానం ముందుకు తెచ్చిందని ధ్వజమెత్తారు. మెడికల్ కాలేజీల నిర్మాణం, నిర్వహణకు డబ్బులు లేవని సర్కారు కుంటి సాకులు చెబుతోందని, వాస్తవంగా డబ్బులు లేకపోతే తాము జోలెపట్టి డబ్బులు అడిగి ప్రభుత్వానికి ఇస్తామని, వైద్య కళాశాలలు ప్రైవేటుపరం చేయడానికి వీల్లేదని తేల్చిచెప్పారు. ప్రభుత్వం వెనక్కు తగ్గకపోతే మహోద్యమం తప్పదని హెచ్చరించారు. రాబోయే రెండు నెలల్లో సర్కారు తీరుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా 110 నియోజకవర్గాల్లో రౌండ్‌టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలల విషయంలో అబద్ధపు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ప్రజలకు వాస్తవాలు వివరించి ప్రభుత్వ కుట్రలు బహిర్గతం చేస్తామన్నారు. వాస్తవాలు వివరించేందుకే సదస్సు..‘‘వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణం ప్రారంభించారు. వీటిలో ఐదు కళాశాలలు వైఎస్సార్సీపీ హయాంలోనే ప్రారంభమయ్యాయి. మరో రెండు కూడా పూర్తవగా, ఎన్నికల తర్వాత ఒక కాలేజీలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. మరో కాలేజీకి ఎంబీబీఎస్ సీట్లు మంజూరైనా కూటమి ప్రభుత్వం వద్దని ఎన్ఎంసీకి లేఖ రాసింది. మరో రెండు అడ్మిషన్లకు సిద్ధంగా ఉన్నాయన్నారు. మిగిలిన కళాశాలలు వివిధ దశల్లో ఉన్నాయి. కూటమి నేతలు మెడికల్ కాలేజీలకు జీవోలు లేవని, అసలు నిర్మాణం జరగలేదని అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. దీనిపై ప్రజలకు వాస్తవాలు వివరించేందుకే మేధోమథన సదస్సు నిర్వహించాం. ఈ విషయంలో వైఎస్ జగన్‌కే మా మద్దతు. ఆయనను అందరూ అభినందించి తీరాల్సిందే. కమీషన్లకు ఆశపడి చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్ పీపీపీపై మోజు పెంచుకున్నారు. సర్కారు తీరువల్ల ఏటా 2,500 మంది ఏపీ విద్యార్థులు నష్టపోతారు. హోమంత్రి అనిత తన శాఖ పనిని వదిలేసి మెడికల్ కాలేజీలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం అసంబద్ధం. స్పీకర్ అయ్యన్నపాత్రుడు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మేమూ భాగస్వాములం అవుతాం.’’ అని వక్తలు స్పష్టం చేశారు. ఈ మేరకు తీర్మానం చేశారు. అనంతరం మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను ఒక్కొక్కటి చదివి వినిపించారు. సదస్సులో వైఎస్సార్సీపీ నాయకురాలు మంచా నాగమల్లేశ్వరి, వైఎస్సార్సీపీ వైద్యవిభాగం ఎనీ్టఆర్ జిల్లా అధ్యక్షుడు అంబటి నాగరాధాకృష్ణ, న్యాయవాది సాయిరామ్, రిటైర్డ్ జడ్జి జయసూర్య, ముస్లిం లీగ్ నాయకులు బషీర్ అహ్మద్, ఆమ్ ఆద్మీ పార్టీ నేత నేతి మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
పీపీపీ కమిషన్లలో బాబు, పవన్, లోకేష్‌కు వాటాలు: జడ శ్రావణ్ కుమార్
సాక్షి, విజయవాడ: ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణతో బడుగు,బలహీన వర్గాలే కాదు అగ్రవర్ణాల్లోని పేదలకు సైతం తీరని అన్యాయం జరుగుతుందని జైభీమ్ రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు సర్కార్ నిర్ణయానికి వ్యతిరేకంగా విజయవాడలో శనివారం మేధోమథనం సదస్సు జరిగింది.జడ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ.. పీపీపీ అంటే పూర్తిగా ప్రైవేటీకరణ చేయడమే. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడం వల్ల సామాన్యులకు తీరని నష్టం తప్పదు. ఈ విధానం వల్ల బడుగు,బలహీన వర్గాలే కాదు అగ్రవర్ణాల్లోని పేదలకు సైతం తీరని అన్యాయం జరుగుతుంది. తీవ్ర వ్యతిరేకత వస్తున్న చంద్రబాబు వెనక్కి తగ్గకపోవడం వెనుక అతిపెద్ద లాభం ఉందనేది స్పష్టమవుతోంది. పీపీపీ చేయడం వల్ల వచ్చే కమిషన్లలో చంద్రబాబు,పవన్,లోకేష్‌కు వాటాలు పంచుకోవాలనుకుంటున్నారు... ప్రైవేటీకరణ చేయడం వల్ల ఒక్క ఏడాది అడ్మిషన్లలోనే రూ.400 కోట్లు సంపాదిస్తారు. చంద్రబాబుకు నాదొక సూటి ప్రశ్న..ధైర్యముంటే సమాధానం చెప్పాలి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు జరిగే విధానంలోనే పీపీపీలోనూ చేపడతారని చెప్పగలరా?. ప్రైవేటీకరణను అడ్డుకోకపోతే మన భావితరాలు తీవ్రంగా నష్టపోతాయి. మెడికల్ విద్యను ప్రైవేటీకరణ చేయనిస్తే మన భవిష్యత్ తరాలు మనల్ని క్షమించరు. కచ్చితంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీరణకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగించాలి అని అన్నారాయన. ఈ క్రమంలో.. సీఎం చంద్రబాబు,హోంమంత్రి అనిత పై జడ శ్రవణ్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. ‘‘అన్నీ నేనే కనిపెట్టానని చంద్రబాబు చెబుతారు. చంద్రబాబు వల్ల ఏడాదికి 2500 మంది పేద విద్యార్ధులకు విద్య అందకుండా చేశారు. హోంమంత్రి వంగలపూడి అనిత తన పని తాను చేయడం లేదు. శాంతిభద్రతలను గాలికొదిలేసి మెడికల్ కాలేజీల పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన వంగలపూడి అనితకు నాదొక ప్రశ్న. ప్రభుత్వ మెడికల్ కాలేజీల అడ్మిషన్ పద్ధతిలోనే ప్రైవేట్ మెడికల్ కాలేజీల అడ్మిషన్లు జరుగుతాయా?. పేద విద్యార్ధులకు అన్యాయం జరుగుతుంటే ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఎక్కడికి పోయారు?’’ అని ప్రశ్నించారాయన. అమ్ ఆద్మీ పార్టీ నేత నేతి మహేశ్వరరావు మాట్లాడుతూ.. పీపీపీ అంటే చంద్రబాబుకు తెలుసా?. పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రజలకు ఇచ్చే అసలైన సంక్షేమం. కోవిడ్ నేర్పిన పాఠాలను మనం గుర్తు తెచ్చుకోవాలి. పేదలకు మెరుగైన వైద్యం,వైద్య విద్యను అందజేస్తేనే సమాజం బాగుపడుతుంది. రూ.3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో ఏడాదికి రూ.2 వేల కోట్లు ఖర్చు చేయలేకపోతున్నారా?.. మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా...ప్రజలతో వ్యాపారం చేస్తున్నారా? అని నిలదీశారు. జైభీమ్ రావ్ భారత్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొని.. ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకించారు. ఇదీ చదవండి: టీడీపీలో వాళ్లు పనోళ్లేనా? -
జగన్ దెబ్బకు టీడీపీ మైండ్ బ్లాక్
‘‘ఆధునిక దేవాలయాలను అమ్మేస్తున్నారు..’’ ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలన్న కూటమి సర్కారు నిర్ణయంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్య. ‘‘వైద్య కళాశాలలను పీపీపీ పద్ధతిలో నిర్మిస్తే తప్పేంటి? నిధుల కొరత ఉండవచ్చు.. వనరుల లేమితో కోర్టు భవన నిర్మాణాలే ఆగిపోయాయి’’ - ఏపీ హైకోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయం. తెలుగుదేశం మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు సహజంగానే హైకోర్టు వ్యాఖ్యలను పతాక శీర్షికలుగా చేశాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ నర్సీపట్నం వద్ద ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శించడానికి వెళుతున్న రోజే ఎల్లో మీడియాలో ఈ కథనం వచ్చింది. జగన్ పర్యటనకు వచ్చిన స్పందన చూసిన తర్వాత జనాభిప్రాయం ఎలా ఉందో తెలుసుకోవడం కష్టం కాదు. ఆంక్షలతో అడ్డుకోవడానికి ఎన్ని కుయుక్తులు పన్ననా, జనం మాత్రం తరలి సంద్రంలా తరలి వచ్చారు. వర్షం జోరున కురుస్తున్నా ప్రజలు జగన్‌తో సమస్యలు విన్నవించడానికి తండోపతండాలుగా వచ్చారు. అరవై కిలో మీటర్ల దూరం ప్రయాణించడానికి ఆరు గంటలు పట్టిందంటేనే జన ప్రభంజనం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ జనాన్ని చూసి కూటమి పార్టీల నేతలకు మతిపోయి ఉండాలి. ప్రజలు ప్రైవేటీకరణపై ఎంత ఆగ్రహంగా ఉన్నారో అర్థమై ఉండాలి. కొద్దిరోజుల క్రితం శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఒక సమావేశంలో మాట్లాడుతూ అసలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎక్కడ? అని ప్రశ్నించారు. దీనికి సంబంధించిన జీవో ఎక్కడ అని అడిగారు. తన ప్రాంతంలో మెడికల్ కాలేజీ భవనాల నిర్మాణం జరుగుతున్నట్లు తెలిసి కూడా అయ్యన్న ఆ వ్యాఖ్య చేయడాన్ని వైసీపీ సవాల్ గా తీసుకుంది. జగన్ గతంలో చెప్పిన విధంగా తన హయాంలో చేపట్టిన మెడికల్ కాలేజీల సందర్శనకు ఇది ఒక అవకాశంగా మారింది. తదుపరి ఆయన నర్సీపట్నం టూర్ పెట్టుకున్నారు. ఆ సందర్భంగానే జగన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రాష్ట్రానికి 17 వైద్య కళాశాలలు ఎలా తీసుకొచ్చింది వివరించారు. భవన నిర్మాణాలకు తీసుకున్న చర్యలతోపాటు జారీ చేసిన జీవోలను కూడా చూపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైద్య కళాశాలలను టీడీనే తెచ్చిందని అనంతపురంలో ప్రకటించి భంగపడితే జీవోలు ఎక్కడని అడిగి స్పీకర్ అయ్యన్నపాత్రుడు అభాసుపాలయ్యారని జనమిప్పుడు వ్యాఖ్యానిస్తున్నారు. గౌరవ న్యాయస్థానం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పద్దతిలో నడిపే ప్రతిపాదనపై అభిప్రాయం వ్యక్తం చేయడాన్ని మనం తప్పు పట్టనక్కర్లేదు. అయితే ఆ మీడియాలోనే ఆ రోజు వచ్చిన వార్తలే న్యాయమూర్తుల సందేహాన్ని తీర్చే విధంగా ఉన్నాయన్న విశ్లేషణలు వచ్చాయి. అమరావతిలో రూ.212 కోట్లతో రాజ్ భవన్ నిర్మాణం చేపట్టాలని రాజధాని అభివృద్ది సంస్థ (సీఆర్డీయే) సమావేశంలో నిర్ణయించారన్నది ఆ వార్త సారాంశం. మూడు నెలల్లో రాజధానికి ఒక రూపు తీసుకు రావాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ సమావేశంలో చెప్పినట్లు కూడా రాశారు. అమరావతిలో రూ.104 కోట్లతో క్వాంటమ్ హబ్ భవనం నిర్మాణానికి సీఆర్డీయే నిర్ణయం అన్నది ఎల్లో మీడియా ఇచ్చిన ఇంకో వార్త. ప్రధాన రోడ్లకు రూ.వెయ్యి కోట్లు వ్యయం చేయడానికి ప్రభుత్వం పాలన అనుమతులు ఇచ్చింది.గోదావరి- బనకచర్ల స్కీమును రూ.81 వేల కోట్లతో చేపట్టే విషయంలో ముందుకే వెళ్లాలని, డీపీఆర్‌లు సిద్దం చేయడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లు మరో కథనం. ఇంతకన్నా ఆసక్తికరమైన విశేషం ఏమిటంటే ప్రభుత్వం రూ.257 కోట్లు వ్యయం చేసి జీ+ 7 అంతస్తుల సీఆర్డీయే కార్యాలయ భవన నిర్మాణాన్ని పూర్తి చేసింది. వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి భవనాలు, ఇతర నిర్మాణాలు చేపడుతున్న కూటమి సర్కార్ పేదలకు ఉపయోగపడే ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణం విషయానికి వచ్చేసరికి డబ్బులు లేకుండా పోయాయా? అన్న సాధారణ పౌరుల ప్రశ్నలకు జవాబు దొరకడం లేదు. గౌరవ న్యాయస్థానం కోర్టుల నిర్మాణం కూడా ఆగిపోయిన విషయాన్ని ప్రస్తావించారు. అంటే కోర్టుల కన్నా కూడా రాజధానిలో తాము అనుకున్న విలాసవంత భవనాలే ముఖ్యమని ప్రభుత్వ అధినేతలు భావిస్తున్నారని అనుకోవాల్సి వస్తుంది కదా! ఈ తరహా వ్యాఖ్య కోర్టు జగన్ ప్రభుత్వ టైమ్‌లో చేసి ఉంటే ప్రభుత్వం దివాళా తీసిందని, కోర్టుల భవనాలను కూడా నిర్మించ లేకపోతోందని ఎల్లో మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసేది. కాని ఇప్పుడు మాత్రం కోర్టు భవనాలకే డబ్బు లేనప్పుడు మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ఎలా కట్టగలుగుతుందని ప్రశ్నిస్తున్నట్లుగా ఉంది. అందుకే పీపీపీ మోడల్లో ప్రైవేటు వారికి అప్పగిస్తున్నట్లు జనాన్ని మభ్య పెట్టాలని యత్నిస్తోంది. మెడికల్ కాలేజీల నిర్మాణానికి రూ.ఐదు వేల కోట్ల వనరులు లేకపోతే రాజధాని నిర్మాణానికి లక్ష కోట్లు ఎక్కడ నుంచి వస్తున్నాయి? వైఎస్ జగన్ తీసుకువచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో అన్ని సీట్లు మెరిట్ బేసిస్ మీదే కేటాయించాలని, సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ కింద ఎన్నారైలకు ఇవ్వడానికి వీల్లేదని చంద్రబాబు, లోకేశ్‌లు ఎన్నికలకు ముందు చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం ఒక్కో సీటును ఏకంగా రూ.57 లక్షలకు అమ్ముకోవడానికి అవకాశం ఇస్తున్నారు. ప్రభుత్వ విధాన నిర్ణయాలలో జోక్యం చేసుకోవచ్చా అన్న సంశయం కోర్టుకు ఉండవచ్చు. ఇది కేవలం విధానానికి సంబంధించిందే కాదు. వందల కోట్ల విలువైన భూములను ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతున్నారు. ఇప్పటికే నిర్మించిన భవనాలను అప్పగించేస్తారు. ఎకరా వంద రూపాయల లీజుకే ఇచ్చేయబోతున్నారు. ఈ కాలేజీలకు అనుబంధంగా ఏర్పాటయ్యే వైద్యశాలల్లో కూడా అన్ని సేవలు పేదలకు ఉచితంగా లభించే అవకాశం తక్కువే. ఒకవేళ ఇచ్చినా, వాటికి రాష్ట్ర ప్రభుత్వమే చెల్లింపులు చేస్తుంది. ఇలా రకరకాల అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. వీటన్నిటి మీద కోర్టులో వాద, ప్రతివాదాలు జరుగుతాయో లేదో తెలియదు. కోర్టు వారు ఎలాంటి తీర్పు ఇచ్చినా, రాజకీయ పార్టీలు తమ విధానం ప్రకారం ఇలాంటి అంశాలపై నిర్ణయాలు తీసుకుంటాయి. అయితే ఈ టెండర్లు ఖరారు కాకుండా స్టే ఇవ్వలేమని కోర్టు పేర్కొనడం గమనించదగ్గ విశేషమే. మెడికల్ కాలేజీలను ఈ ప్రభుత్వం పీపీపీ విధానం కింద ప్రైవేటు సంస్థలకు అప్పగించినా, తాము అధికారంలోకి వచ్చాక తిరిగి స్వాధీనం చేసుకుంటామని జగన్ ఇప్పటికే ప్రకటించారు. ఈ లోగా ప్రైవేటికరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ఉద్యమాన్ని వైసీపీ ఆరంభించింది. ఈ రకంగా ప్రజల మనోగతాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకురావడంలొ వైసీపీతో సహా వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు తగు పాత్ర పోషిస్తాయి. అందువల్ల కోర్టు ప్రభుత్వ చర్యలకు ఆమోదం తెలిపినా, తెలపకపోయినా, దానితో నిమిత్తం లేకుండా వైఎస్సార్ కాంగ్రెస్ తమ విధానం ప్రకారం ప్రజల అభిప్రాయాన్ని కూడగట్టుకోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పాలి. జగన్ వ్యాఖ్యానించినట్లు ఆధునిక దేవాలయాల వంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అమ్మడం న్యాయం కాదని ప్రజలు భావిస్తున్నారు . జగన్ టూర్ కు జనం రాకుండా చూడడంలో పోలీసులు విఫలమయ్యారని, మంత్రులు సరిగా స్పందించ లేకపోతున్నారని.. చంద్రబాబు అభిప్రాయపడ్డారని వార్తలు వచ్చాయి. దానిని బట్టే జగన్ టూర్ సక్సెస్ అయిందని చంద్రబాబుతో సహా కూటమి నేతలంతా పరోక్షంగా ఒప్పుకుంటున్నట్లే!. కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
జన జాతర
సాక్షి, అమరావతి : కర్ఫ్యూను తలపిస్తూ మోహరించిన పోలీసులు.. అడుగడుగునాఆంక్షలు.. బారికేడ్లు.. ఆటోవాలాలకు బెదిరింపులు.. పార్టీ నేతలకు వేధింపులు.. ఖాకీల దిగ్బంధంలో నర్సీపట్నం మెడికల్ కాలేజీ రోడ్డు..! ఉత్తరాంధ్రలో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనను అడ్డుకునేందుకు కూటమి సర్కారు ఎన్ని ఆంక్షలు పెట్టినా జన సునామీ ఎదుట తల వంచక తప్పలేదు! జోరు వర్షంతో పాటు ప్రజల అభిమానంతో తడిసి ముద్ద కావడంతో 65 కిలోమీటర్ల రోడ్డు ప్రయాణాన్ని వైఎస్ జగన్ ఏకంగా 6 గంటల పాటు ఎడతెరపి లేకుండా సాగించాల్సి వచ్చింది. వాహనాలను పోలీసులు అడ్డుకున్నా ప్రజలు పెద్ద ఎత్తున ఆయన వెంట తరలి వచ్చారు. ఇటీవలి కాలంలో అతి పెద్ద రాజకీయ సభగా పరిశీలకులు దీన్ని అభివర్ణిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నా అశేష ప్రజాదరణతో జనం గుండెల్లో జగన్ చిరస్థాయిగా నిలిచారని.. ఇంటికే పథకాలు, సేవలతో పేదల జీవితాల్లో చెరగని ముద్ర వేశారని పేర్కొంటున్నారు. కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ ప్రజా ఉద్యమానికి పిలుపునిస్తూ వైఎస్ జగన్ నర్సీపట్నం వైద్య కశాశాలను సందర్శించిన నేపథ్యంలో.. చంద్రబాబు సర్కారు దారుణ పాలన వైఫల్యాలు, సూపర్ సిక్స్ మోసాలు, రెడ్‌బుక్ కుట్రలు మరోసారి సర్వత్రా చర్చనీయాంశంగా మారాయని విశ్లేషిస్తున్నారు. పేదల జీవితాల్లో మార్పు కోసం తాపత్రయపడుతూ.. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన మంచి, తీసుకొచ్చిన విప్లవాత్మక వ్యవస్థలు, సంపద సృష్టిని గుర్తు చేసుకుంటున్నారు. సచివాలయాలు, వలంటీర్లు, ఆర్బీకేలు లాంటి వినూత్న వ్యవస్థల ద్వారా ఊరు దాటాల్సిన అవసరం లేకుండా ఇంటివద్దే పథకాలు, పౌర సేవలు అందాయని గ్రామాల్లో చర్చ జరుగుతోంది. కోవిడ్ సంక్షోభంలోనూ ఎక్కడా ఆగకుండా డీబీటీ ద్వారా నేరుగా పథకాలు అందించటాన్ని ప్రస్తావిస్తున్నారు. గత 16 నెలల కూటమి పాలనలో ఎంతో నష్టపోయామని.. బాబు చేతిలో మోసపోయామని అన్ని వర్గాల ప్రజలు బేరీజు వేసుకుంటున్నారు. ఐఆర్, నాలుగు డీఏలు పెండింగ్‌లో పెట్టారని, పీఆర్సీ ఊసే లేదని ఉద్యోగులు మండిపడుతున్నారు. బాబు ష్యూరిటీ పోయి.. మోసం గ్యారెంటీగా మారిందని.. వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని.. ఇసుక దోపిడీ.. విద్యుత్తు చార్జీల బాదుడు.. నకిలీ మద్యంతో అమాయకులు ప్రాణాలు పోతున్నాయని.. ఏడాది తిరగక ముందే కూటమి పాలనపై ప్రజలకు భ్రమలు పూర్తిగా తొలగిపోయాయని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.ఆరోగ్యానికి సంపూర్ణ భరోసా..వైఎస్ జగన్ వైద్య, ఆరోగ్య శాఖలో జీరో వేకెన్సీ విధానాన్ని అమలు చేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యానికి భరోసా కల్పించారు. ఫ్యామిలీ డాక్టర్, హెల్త్ క్లినిక్స్ ద్వారా ప్రజారోగ్య పరిరక్షణకు పెద్ద పీట వేశారు. వందేళ్లుగా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కేవలం రెండే రెండు మెడికల్ కాలేజీలు ఉండగా... మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో ఏకంగా నాలుగు కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం గమనార్హం. మాట ప్రకారం ఉద్దానంలో కిడ్నీ వ్యాధుల రీసెర్చ్ సెంటర్, అతిపెద్ద డయాలసిస్ సెంటర్ నిర్మించారు. ఉత్తరాంధ్రతో పాటు మైదాన ప్రాంత గిరిజనులకు ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తూ ఐదు గిరిజన మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, బుట్టాయగూడెం, దోర్నాలల్లో ఆస్పత్రుల నిర్మాణం చేపట్టారు. చంద్రబాబు గద్దెనెక్కిన వెంటనే మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం ఆగిపోయింది. భావి తరాలకు విలువైన సంపద సృష్టిస్తూ ప్రభుత్వ రంగంలో 17 కొత్త మెడికల్ కాలేజీలకు వైఎస్ జగన్ ప్రభుత్వం శ్రీకారం చుడితే.. పది కాలేజీలను చంద్రబాబు సర్కారు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతోంది. చంద్రబాబు సర్కారు ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకుండా పెండింగ్ పెట్టడంతో రోగులకు వైద్యం నిలిచిపోయిన దుస్థితి.పిల్లలకు మోసం.. వైఎస్ జగన్ హయాంలో నాడు – నేడు, ఇంగ్లీషు మీడియం స్కూళ్లు, ట్యాబ్‌లు, డిజిటల్ తరగతి గదులు, 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్‌్ట, అమ్మఒడి, గోరుముద్ద, విద్యా కానుక, విద్యా దీవెన, వసతి దీవెన, ఐబీ, టోఫెల్, ద్వారా ప్రభుత్వ విద్యా వ్యవస్థను సమున్నతంగా తీర్చిదిద్ది పిల్లల చదువులకు గట్టి భరోసా కల్పించారని చర్చించుకుంటున్నారు. అదే ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఏకంగా దాదాపు ఐదు లక్షల వరకు తగ్గిపోవడం ప్రభుత్వ విద్యావ్యవస్థ దుస్థితి, తల్లిదండ్రుల్లో సన్నగిల్లిన నమ్మకానికి నిదర్శనంగా నిలుస్తోందని పేర్కొంటున్నారు. విద్యాదీవెన, వసతి దీవెన బకాయిలు చెల్లించకపోవడంతో పిల్లలు చదువులకు దూరమవుతున్నారు. ఆర్వో ప్లాంట్ల నిర్వహణ కూడా సరిగా చేయకపోవడంతో కురుపాంలో ఇద్దరు విద్యార్థనులు మృతి చెందారు. పిల్లలకు పచ్చకామెర్లు సోకితే కనీసం పట్టించుకున్న దిక్కు లేకుండా పోయింది.అన్నదాతకు మహిళలకు దగా..ఈ ప్రభుత్వం వ్యవసాయ సీజన్లో కనీసం ఎరువులు కూడా సమకూర్చలేకపోయిందని, యూరియా నల్ల బజారుకు తరలిపోగా.. ఏ పంటకూ మద్దతు ధరలు దక్కక అన్నదాతలు అగచాట్లు పడుతున్నారని గుర్తు చేస్తున్నారు. ఇంటికే సేవలందించిన వలంటీర్ల వ్యవస్థను రద్దు చేసి నమ్మక ద్రోహానికి పాల్పడ్డారని పేర్కొంటున్నారు. రైతులకి ఉచిత క్రాప్ ఇన్సూరెన్స్ గాలికి ఎగిరిపోయింది. ఇన్పుట్ సబ్సిడీకి దిక్కే లేదు. ఈ క్రాప్ కనపడకుండా పోయింది. ఆర్బీకేలు, సచివాలయాలు నిర్వీర్యమయ్యాయి. పీఎం కిసాన్ కింద కేంద్రం ఇచ్చే రూ.6 వేలు కాకుండా అన్నదాతా సుఖీభవ ద్వారా తామే ఏటా రూ.20 వేలు చొప్పున ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ లెక్కన రెండేళ్లకు కలిపి రూ.40 వేలకుగాను ఇచ్చింది కేవలం రూ.5 వేలు మాత్రమే. ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ తల్లికి వందనం కింద ఏటా రూ.15 వేలు చొప్పున ఇస్తామని హామీ ఇచ్చి గత ఏడాది చంద్రబాబు పూర్తిగా ఎగరగొట్టేశారు. రెండో ఏడాది తూతూమంత్రంగా అమలు చేసి 30 లక్షల మంది పిల్లలకు ఎగ్గొట్టారు. ఆడబిడ్డ నిధి కింద రాష్ట్రంలో మహిళలందరికీ ఏటా రూ.18 వేల చొప్పున ఇస్తామన్న హామీని ఎగ్గొట్టారు. అటు 20 లక్షల ఉద్యోగాలూ లేవు.. ఇటు నిరుద్యోగ భృతీ ఇవ్వట్లేదు! ఈ నేపథ్యంలో అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఉంది? ప్రభుత్వ ఆధ్వర్యంలో విద్య, వైద్య రంగాలను బలోపేతం చేసి పటిష్టంగా నిర్వహించాల్సిన ఆవశ్యకతపై సర్వత్రా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.ప్రైవేట్ దోపిడీకి చెక్ పెడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా మంచి చేసే కార్యక్రమంలో భాగంగా 17 కొత్త మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టాం. 52 ఎకరాల్లో ఉన్న నర్సీపట్నం మెడికల్ కాలేజీకి సంబంధించి.. కోవిడ్ లాంటి సంక్షోభం ఉన్నా కూడా, రూ.500 కోట్ల ఖర్చుతో 2022 డిసెంబర్ 30న కాలేజీకి శంకుస్థాపన చేశాం -నర్సీపట్నం నియోజకవర్గం భీమబోయినపాలెం మెడికల్ కాలేజీ సందర్శనలో వైఎస్ జగన్ -
కొల్లు రవీంద్ర ఖుషి కోసం... సుబ్బన్న అక్రమ అరెస్టుపై పేర్ని నాని రియాక్షన్
-
అంతర్మధనంలో అధికార టీడీపీ
సాక్షి, విశాఖపట్నం: తమ కుట్రలు విఫలం కావడంతో ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పర్యటనను ఎలాగైనా అడ్డుకోవాలని చూస్తే.. వైఎస్సార్సీపీ కేడర్ సైతం విస్తుపోయే రేంజ్లో సూపర్ సక్సెస్ కావడంతో అధికార టీడీపీ ఇప్పుడు అంతర్మధనంలో పడిపోయింది(YS Jagan Uttarandhra Tour Success).జగన్ పర్యటనను ఎలాగైనా అడ్డుకోవాలని ఆంక్షల పేరిట ఆటంకాలు సృష్టించింది కూటమి ప్రభుత్వం. ఖాకీలను ప్రయోగించి జనాన్ని రాకుండా ప్రయత్నించింది. అయితే చెక్‌పోస్టులు, బారికేడ్లను జగన్ మీద ఉన్న అభిమానం బద్దలు కొట్టేసింది. జనాలు తండోపతండాలుగా తరలి రావడం చూసి పోలీసులే కంగుతిన్నారు. ఎయిర్పోర్ట్ నుంచి మాకవరపాలెం వరకు.. దారి పొడవునా జగన్ ఆగిన చోటల్లా ఇసకేస్తే రాలని జనమే కనిపించారు. ఆంక్షల వలయాన్ని చేధించుకుని.. గుట్టలు, పొలాల గుండా కొందరు యువకులు బైకులపై తరలి రావడం గమనార్హం. తొలుత.. ఈ పర్యటన కోసం దళితులను వాడుకోవాలని అధికార టీడీపీ విశ్వప్రయత్నాలు చేసింది. డాక్టర్ సుధాకర్ పేరుతో హోర్డింగులు ఏర్పాటు చేయించడంతో పాటు ఫకార్డుల ప్రదర్శన చేయించాలని స్కెచ్ వేసింది. అయితే దళితులు ఆ కుట్రలకు లొంగలేదు. పైపెచ్చు జగన్ ర్యాలీకి భారీగా తరలి వచ్చారు. వివిధ వర్గాలు సైతం జగన్‌ను కలిసి తమ గోడును వెల్లదీసుకోవడం.. ప్రభుత్వానికి ఏమాత్రం మింగుడుపడని విషయం. ఇంకోవైపు..చివరకు ప్రకృతిపైనా పచ్చ బ్యాచ్ ఆశలు పెట్టుకోగా.. అది నెరవేరలేదు. కుండపోత వర్షంలోనూ రోడ్డు పొడవునా.. మహిళలు, వృద్ధులు, రైతులు బారులు తీయడం.. ఎల్లో మీడియాకు సైతం సహించనట్లుంది. అందుకే ట్రాఫిక్ జామ్, షరతుల ఉల్లంఘన పేరుతో విషం చిమ్ముతోంది. వెరసి..ఊహించని రీతిలో జగన్ ఉత్తరాంధ్ర పర్యటన సక్సెస్ కావడంతో కరకట్ట బంగ్లాకు ఏం సమాధానం చెప్పుకోవాలో అని ఉత్తరాంధ్ర తమ్ముళ్లు తెగ మదనపడిపోతున్నారు.క్లిక్ చేయండి: ఉత్తరాంధ్రలో జగన్ కోసం జన సునామీ.. చూశారా? -
ఆధునిక దేవాలయాలను అమ్మేస్తున్నారు... ఆంధ్రప్రదేశ్‌లో వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
-
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమం
సాక్షి, అమరావతి: పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యాన్ని, వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో వైఎస్ జగన్ 17 ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుడితే, ప్రైవేటీకరణ ద్వారా వాటిని సీఎం చంద్రబాబు పేదలకు దూరం చేస్తున్నారని వైఎస్సార్సీపీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమ కార్యక్రమం పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ, ‘‘ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజలు, ప్రజా సంఘాలతో కలిసి 175 నియోజకవర్గాల్లో శుక్రవారం నుంచి వైఎస్సార్సీపీ 45 రోజుల పాటు గ్రామ స్థాయి వరకూ ప్రజా ఉద్యమం చేపడుతుంది. సంతకాల సేకరణ ప్రజా ఉద్యమ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నుంచి రచ్చబండ కార్యక్రమాలు మొదలవుతాయి. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల ఆధ్వర్యంలో పోస్టర్ల ఆవిష్కరణతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. సంతకాల సేకరణలో భాగంగా రచ్చబండలో నాయకులు పాల్గొని ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై అవగాహన కల్పిస్తారు. అక్టోబర్ 28న నియోజకవర్గ కేంద్రాల్లో, నవంబర్ 12న జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీ చేపట్టి సంబంధిత అధికారులకు వినతిపత్రాలు సమరి్పస్తారు. నవంబర్ 23న జిల్లా కేంద్రాల నుంచి సేకరించిన సంతకాల పత్రాలను కేంద్ర కార్యాలయానికి పంపిస్తారు. నవంబర్ 24న ఈ పత్రాలు కేంద్ర కార్యాలయానికి చేరుకుంటాయి. అనంతరం పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ నేతృత్వంలో గవర్నర్ కు కోటి సంతకాలను సమర్పిస్తాం. పార్టీ మాత్రమే కాకుండా, పౌరసమాజంలో కీలక పాత్ర పోషిస్తున్న మేధావి వర్గాలు, ప్రజాసంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు సంతకాల సేకరణలో పాల్గొనాలని కోరుతున్నాం’’అని పిలుపునిచ్చారు. ఆరోగ్యశ్రీని కూడా నిర్వీర్యం చేయడాన్ని చూస్తే, చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలు తారస్థాయికి చేరాయని అర్థం అవుతోందని సజ్జల అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి , ఎనీ్టఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, పలువురువైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు. 13న నకిలీ మద్యంపై నిరసన కార్యక్రమాలు నకిలీ మద్యంపై సోమవారం (13వ తేదీ) అన్ని నియోజకవర్గాల్లో ఎక్సైజ్ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ నేతలకు సజ్జల పిలుపునిచ్చారు. నకిలీ మద్యంపై ఇప్పటికే మహిళా విభాగం నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, ఇతర ముఖ్య నాయకులతో గురువారం సజ్జల టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ కార్యక్రమాల విజయవంతంతోపాటు, పార్టీ కమిటీల నియామకంపై ఫోకస్ పెట్టాలని ఈ సందర్భంగా సూచించారు. -
YS Jagan: చంద్రబాబుకు సైన్స్ ఉంటే.. పిల్లలు చనిపోయేవాళ్లు కాదు
-
ఇదే నర్సీపట్నం మెడికల్ కాలేజీ అయ్యన్నను ఏకిపారేసిన YS జగన్
-
YS Jagan: చంద్రబాబు.. ఇదే నా వార్నింగ్
-
Medical College: అయ్యా చంద్రబాబు నీకే చెప్తున్నా.. రేపటినుండి మీకు చుక్కలే
-
అయ్యన్న ఇదిగో జీవో... వైఎస్ జగన్ దిమ్మతిరిగే కౌంటర్
-
కళ్ళు కనబడని వాళ్లకు చెబుతున్నా... ఇదిగో మెడికల్ కాలేజ్
-
జగనన్న కోసం కదిలిన ఊరూ-వాడా (ఫొటోలు)
-
మేం మంచి చేస్తే.. చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు: వైఎస్ జగన్
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. నేడు నర్సీపట్నంలో పర్యటనలో భాగంగా.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పోరుబాటు... -
ఆంధ్రప్రదేశ్‌లో వైద్య కళాశాలల రక్షణకు పోరుబాట... నేడు నర్సీపట్నం వైద్య కళాశాలను సందర్శించనున్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి
-
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ పోరుబాట... ఉద్యమాన్ని ఉదృతం చేయాలని పార్టీ శ్రేణులకు వైఎస్ జగన్ పిలుపు
-
Ys Jagan: జిల్లా కేంద్రాల్లో నవంబర్ S 12న ధర్నాలు
-
ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ పోరు.. ఇక రచ్చబండ, ధర్నాలు..
సాక్షి, తాడేపల్లి: ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై(Medical Colleges Privatization) ఆందోళనలకు వైఎస్సార్సీపీ(YSRCP) సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఈ నెల 10 నుంచి 22 వరకు రచ్చబండ కార్యక్రమాలను ప్లాన్ చేసింది.ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరుకు వైఎస్సార్సీపీ ముందు సాగనుంది. రచ్చబండ(Rachabanda), కోటి సంతకాల సేకరణ, గవర్నర్‌ని కలవటం, నియోజకవర్గం, జిల్లా స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో అక్టోబర్ పదో తేదీ నుంచి 22 వరకు రచ్చబండ కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. అన్ని నియోజకవర్గాల్లో 28న నిరసన ర్యాలీలు చేపట్టనుంది. జిల్లా కేంద్రాల్లో నవంబర్ 12న ధర్నాలు చేసేందుకు సిద్ధమైంది. ప్రతీ నియోజకవర్గం నుండి 50వేల సంతకాలు సేకరణ చేయనున్నారు. చివరగా నవంబర్ 26న పార్టీ నేతలు గవర్నర్‌ని కలిసేలా నిర్ణయం తీసుకున్నారు. -
వైఎస్సార్సీపీ నేతలతో ముగిసిన వైఎస్ జగన్ భేటీ
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన ఆ పార్టీ కీలక భేటీ ముగిసింది. తాడేపల్లిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో జరుగుతున్న ఈ భేటీకి జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో-ఆర్డినేటర్లు, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు హాజరయ్యారు. ఈ సమావేశంలో.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంతో పాటు రాష్ట్రంలో యదేచ్ఛగా నడుస్తున్న నకిలీ మద్యం వ్యవహారంపై వైఎస్ జగన్ ప్రముఖంగా ప్రసంగించినట్లు తెలుస్తోంది. ఈ అంశాలపై ప్రజా పోరాటం చేయాలని కేడర్‌కు ఆయన పిలుపు ఇచ్చినట్లు సమాచారం. ఈ భేటీకి కీలక నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, కాకాణి గోవర్దన్ రెడ్డి, పేర్ని నాని, భూమన కరుణాకర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. జగన్ హయాంలో మొదలైన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలన్న చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ప్రజా పోరాటానికి పిలుపు ఇచ్చింది. ఈ క్రమంలో 9వ తేదీన అనకాపల్లి జిల్లాలో వైఎస్ జగన్ పర్యటించిన.. మాకవరం మెడికల్ కాలేజీని సందర్శించనున్న సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: బాబు చీటర్.. లోకేష్ లూటర్! -
వైద్యకళాశాలల ప్రైవేటీకరణ ఎవరికి లాభం?
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా తీసుకొచ్చిన వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై ఇప్పుడు చర్చ జోరందుకుంటోంది. ఈ చర్యలో అసలు హేతుబద్ధత అన్నదే లేదని, టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి సర్కారు ప్రైవేటీకరణ పేరుతో వైద్యకళాశాలలను తమ తాబేదార్లకు అప్పగిస్తోందన్న విమర్శలు అటు సామాన్య ప్రజానీకంతోపాటు ప్రతిపక్ష వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణలు వినిపిస్తున్నారు. ఎన్నికలకు ముందు సంపద సృష్టించి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తానని బీరాలు పలికిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు ప్రజల ఆస్తులు అమ్ముతూ ప్రైవేటువారికి సంపద సృష్టిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ప్రభుత్వ వైద్యకళాశాలల్లో యాభై శాతం సీట్లను సెల్ఫ్ ఫైనాన్సింగ్ పద్ధతిని పెడతామన్న వైఎస్ జగన్ మాటలను అప్పట్లో తీవ్రంగా వ్యతిరేకించిన బాబు, లోకేశ్‌లు ఇప్పుడు మాటమార్చడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పైగా పీపీపీ విధానం ప్రైవేటేషన్ కాదని, జగన్‌కు ఆ విషయం తెలియదని బాబు అండ్ కో బుకాయిస్తున్న వైనం ఆశ్చర్యం కలిగిస్తోంది. చంద్రబాబు నాయుడు, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌లు అసెంబ్లీలోని ఇరు సభల్లో చేసిన వాదనలను పరిశీలిస్తే వీరు వైద్యకళాశాలల ప్రైవేటీకరించి కళ్లప్పగించి చూడబోతున్న వైనం స్పష్టమవుతోంది. పేదలకు వైద్యవిద్య అన్నది ఒట్టిమాటేనని, వ్యహారమంతా ధనికులకు అనకూలంగానే నడుస్తోందని విమర్శలు వస్తున్నాయి. పీపీపీ అంటే ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధానమంటున్న చంద్రబాబు తద్వారా కాలేజీలు, ఆసుపత్రుల నిర్వహణలో తమ అసమర్థతను బయటపెట్టుకున్నట్లు అయ్యింది. జగన్ ప్రభుత్వం నాడు-నేడు కింద ఆస్పత్రులను బాగు చేయించి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తే, సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు ప్రభుత్వం కంటే ప్రైవేటు వారే బెటర్ అంటున్నారా? ఈ మాత్రం దానికి ప్రభుత్వం ఎందుకో? వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నిర్మాణాల మాదిరి అయితే ఈ పది మెడికల్ కాలేజీలు పూర్తి కావడానికి 15 ఏళ్లు పడుతుందని చంద్రబాబు అనడం చూస్తే ఆయన తనను తాను అసమర్థుడిగా చెప్పుకుంటున్నట్లే కదా అని వైసీపీ వారు ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో లక్ష కోట్లైనా ఖర్చు చేసి అమరావతి మొదటి దశ నిర్మాణం పూర్తి చేస్తామనడం మరీ విడ్డూరంగా ఉంది. జగన్ సీఎంగా రెండేళ్లలోనే ఐదు వైద్య కశాళాలలను అందుబాటులోకి తెచ్చారు. ఆ తరువాత ఇంకో రెండు దాదాపుగా పూరర్తయ్యాయి. మిగిలిన పదింటికీ అయ్యే రూ.ఐదారు వేల కోట్లు ప్రభుత్వం సమకూర్చుకోలేదా? లక్షల కోట్ల బడ్జెట్ కలిగిన ప్రభుత్వమే ఈ మాత్రం డబ్బు సమకూర్చు కోలేకపోతే ప్రైవేటు సంస్థలు ఎలా తెచ్చుకుంటాయి? ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడా లేని విధంగా ఒక్కో వైద్యకళాశాలలకు కేటాయించిన దాదాపు యాభై ఎకరాల భూమిని ఎకరా రూ.వంద చొప్పున లీజుకు ఇవ్వడమంటే ఉత్తినే ఇచ్చినట్లు కదా? ప్రైవేట్ సంస్థలు ఈ భూములను తాకట్టు పెట్టి రుణం తెచ్చుకుంటే.. ప్రభుత్వం తన సంపదను రాసిచ్చినట్లే అవుతుంది.ప్రస్తుతం 33 ఏళ్లు ఉన్న లీజు భవిష్యత్తులో పొడిగించరన్న గ్యారెంటీ ఏమీ లేదు కాబట్టి.. ఇవి శాశ్వతంగా ప్రైవేటు వారి పరమవుతాయి. పేద ప్రజలకు ఉపయోగపడే మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులకు అమరావతి మాదిరే ప్రభుత్వం రుణాలు తేలేదా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ చంద్రబాబు ప్రభుత్వం 54 ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేసింది. కొనుగోలు చేసిన సంస్థలు తమకు దక్కిన భూమితో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాయని ఒక రిటైర్డ్ అధికారి చెప్పారు. ఎవరి సంపద ఎవరి పరమైనట్లు? జగన్ ప్రభుత్వం ఏభై శాతం సీట్లు సెల్ప్ ఫైనాన్స్ పద్దతిలో కేటాయించి, వాటికి రూ.20 లక్షల చొప్పున ఫీజ్ వసూలు చేయాలని నిర్ణయిస్తే, చంద్రబాబు, లోకేశ్‌లు తప్పు పట్టారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ విధానాన్ని రద్దు చేసి అంతా ఫ్రీ చేస్తామని లోకేశ్ విద్యార్ధుల సమావేశంలోనే ప్రకటించారు. ఇప్పుడు మొత్తం ప్రైవేటుపరం చేయడమే కాకుండా, ఆ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల ఖరీదు రూ.57 లక్షలు ప్రభుత్వ రంగంలో రూ.20 లక్షలు అంటే అంతే మొత్తం వసూలు చేస్తారు. అదే ప్రైవేటు వారు అయితే ఈ రూ.57 లక్షలే కాకుండా, అదనంగా రూ.కోటి పైనే వసూలు చేయవచ్చు అంటున్నారు. మొత్తం డబ్బు ప్రభుత్వ ఖాతాలోకి వచ్చేలా జగన్ చేస్తే, చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు వేల కోట్ల రూపాయలు దక్కేలా చేస్తున్నారన్న విమర్శకు సమాధానం దొరకదు. ఇంతా చేసి ఆ వైద్య కళాశాలల ఆసుపత్రుల్లో ప్రజలందరికి ఉచిత వైద్య సేవలు అందుతాయన్న గ్యారంటీ కూడా లేదు. ప్రైవేటు సంస్థలు లాభాలు రాకపోతే మనలేవన్నది తెలిసిన సత్యమే. ప్రభుత్వ ఆసుపత్రుల్లో లక్ష రూపాయల విలువైన చికిత్స అయినా, ఆపరేషన్ అయినా ఉచితంగా చేస్తారు. మరి పీపీపీ మోడల్లో ఏర్పాటైన ప్రైవేట్ కళాశాలలు ఇలా చేస్తాయా? చేయవు. ఒకవేళ చేసినా ఆ మొత్తాలను ఎన్టీఆర్ వైద్య సేవ లేదా బీమా సదుపాయం పేరుతో ప్రభుత్వం నుంచే వసూలు చేసే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి పీపీపీ విధానంతో ప్రజలకు ఒరిగేదేమిటి? ప్రభుత్వానికి మిగిలేదేమిటి? ప్రైవేటీకరణే విధానమని నిర్ణయించుకుని ఉంటే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత వీటిపై రూ.700 కోట్లు ఎందుకు ఖర్చు చేసినట్లు? ఇప్పటివరకూ ఆయా కళాశాలల ఏర్పాటుకు అయిన ఖర్చు (భూమి + నిర్మాణాలు) తీసుకుని ప్రైవేట్ సంస్థలకు ఇచ్చి ఉంటే కనీసం ప్రభుత్వానికి కొంత డబ్బు మిగిలి ఉండేదేమో. ప్రస్తుతం ఉన్న ప్రైవేటు మెడికల్ కాలేజీలలో కూడా ఏభై శాతం సీట్లు మెరిట్ ప్రకారం, రిజర్వేషన్లు పాటిస్తూ కేటాయించాల్సిందే. ఈ పరిస్థితిలో ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటువారికి ఉత్తపుణ్యానికి ధారాదత్తం చేసి మెడికల్ కాలేజీలను నడపాలని చెప్పడం అర్ధరహితం. ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అనుమతి పొందిన సంస్థలు భూమిని స్వయంగా సమకూర్చుకుంటున్నాయి. భవనాలు సొంత ఖర్చుతో నిర్మించుకుంటున్నాయి. యంత్ర పరికరాలు ఇతర సదుపాయాలన్నీ సొంత ఖర్చుతోనే చేసుకుంటున్నాయి. కాని ఇప్పుడు ప్రభుత్వం భూమి, భవనాలు ఉచితంగా ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడంలో అర్ధం ఏమి ఉంటుంది? పైగా ఈ కాలేజీలకు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రులను కూడా అప్పగిస్తారట. ఈ సంస్థలు ఉచితంగా సేవలు అందించనప్పుడు ,ప్రభుత్వం వారికి రకరకాల రూపాలలో ఫీజులు చెల్లిస్తున్నప్పుడు ప్రైవేటు పరం చేయవలసిన అవసరం ఏమిటో తెలియదు. ప్రస్తుతం నాలుగు కాలేజీలకు పీపీపీ విదానం అమలు చేస్తున్నా, భవిష్యత్తులో మిగిలిన కాలేజీలన్నిటిని అదే రకంగా అప్పచెప్పనున్నారు. బహుశా పూర్తి అయిన ఏడు కాలేజీలను కూడా అలాగే ఇచ్చేస్తే జగన్ ప్రభుత్వ రంగంలో తీసుకు వచ్చిన ఆశయాన్ని పూర్తిగా నీరుకార్చిన ఘనత కూటమి సర్కార్ కు దక్కుతుంది. ఝార్కండ్ రాజధాని రాంచీలో ఒక ప్రభుత్వ ఆస్పత్రిని ఇదే విధంగా పీపీపీ అంటూ ప్రైవేటీకరించబోగా ప్రజాసంఘాలు, రాజకీయ పక్షాలు తీవ్రంగా వ్యతిరేకించి ఉద్యమించడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఒడిశా లో గత బీజేడీ ప్రభుత్వం తీసుకు వచ్చిన మెడికల్ కాలేజీలను ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ప్రైవేటు పరం చేయలేదు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణల్లో ప్రభుత్వాలే కొత్త కాలేజీలను నడుపుతున్నాయి. ఇవన్ని ఎందుకు! ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలలో ఎయిమ్స్ సంస్థలను ఏర్పాటు చేస్తోంది కదా! ఎందుకు వారు ప్రభుత్వరంగంలోనే నెలకొల్పుతున్నారు? కొత్తగా కేంద్రం ఇస్తున్న పదివేల మెడికల్ సీట్లను ప్రభుత్వ కాలేజీలకే ఎందుకు ఇస్తున్నారు? ఏపీ ప్రభుత్వం రోడ్లు, పోర్టులు ప్రైవేటైజ్ చేయడం లేదా అని పిచ్చి వాదన చేస్తోంది. రోడ్లకు, ఓడరేవులకు వైద్యరంగానికి పోలిక పెట్టడం అంటే ప్రజారోగ్యంపైన, పేదల వైద్యంపై చులకన భావం ఉన్నట్లు అనిపించడం లేదా?ఏది ఏమైనా సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క మెడికల్ కాలేజీని కూడా తీసుకు రాలేకపోయిన చంద్రబాబు నాయుడు, తనకంటే చిన్నవాడైన వైఎస్ జగన్ తీసుకు వచ్చిన మెడికల్ కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేటైకీరణకు దిగుతుండడం శోచనీయం. ఈ నేపథ్యంలోనే జగన్... బుద్ది జ్ఞానం ఉన్నవారెవరైనా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ కింద ప్రైవేటు వారికి అప్పగిస్తారా? అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చాక వీటిని తిరిగి స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. ప్రజల కోసం జగన్ సంపద సృష్టిస్తే,, ఆ సందపను చంద్రబాబు ప్రైవేటువారికి ధారాదత్తం చేయడం సరైనదా? ఇదేనా చంద్రబాబు చెప్పే విజన్?- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. రంగంలోకి YS జగన్
-
వైద్య కళాశాలల ప్రైవేటీకరణ విరమించకపోతే ఉద్యమం
పాలకొల్లు సెంట్రల్: రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల్ని పీపీపీ విధానం పేరిట ప్రైవేటీకరించేందుకు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విరమించుకోకుంటే ఉద్యమం తప్పదని పశ్చిమ గోదావరి జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ సమితి హెచ్చరించింది. శనివారం పాలకొల్లులోని పూలపల్లి అంబేడ్కర్ భవనంలో సీపీఎం ఆధ్వర్యంలో ‘పాలకొల్లు ప్రభుత్వ మెడికల్ కళాశాల పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ’ అంశంపై నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో పలువురు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ వైద్య విద్య అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఒకటి చొప్పున ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.ఇందులో భాగంగా 17 మెడికల్ కళాశాలలను జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఇందుకోసం గత ప్రభుత్వం రూ.2,400 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. ఇంకా దాదాపు రూ.5 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర బడ్జెట్ రూ.3 లక్షల కోట్లు అని గొప్పలు చెబుతున్న చంద్రబాబు ప్రభుత్వం కనీసం రూ.5 వేల కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పూర్తి చేయలేదా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం అరకొర పనులు చేపట్టిందని కూటమి ప్రభుత్వం అబద్ధాలు చెబుతూ వాటిని ప్రైవేటుకు అప్పగించాలని నిర్ణయించామని కబుర్లు చెబుతూ ప్రజలకు చేసిన ద్రోహాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. పీపీపీ అంటూనే వైద్యకళాశాలలు ప్రైవేటుపరం కావని చెప్పడం హాస్యాస్పదమని మండిపడ్డారు. పీపీపీ పద్ధతి ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకే కాకుండా ఓసీ కులాల్లోని పేద విద్యార్థులకూ నష్టం కలిగిస్తుందన్నారు.వైద్యం, విద్య రెండూ ప్రభుత్వ రంగాల్లో ఉంటేనే ప్రజలకు మేలు కలుగుతుందన్నారు. ఇప్పటికే విద్య, వైద్యం రెండూ ఖరీదయ్యాయని, మరింత ఖరీదు కాకుండా ఉండాలంటే కూటమి ప్రభుత్వ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి, మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్యే దిగుపాటి రాజగోపాల్, ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్, సీపీఎం నేత జేఎన్వీ గోపాలన్, దళిత ఐక్యవేదిక అధ్యక్షుడు గంటా సుందర్‌కుమార్, సంచార జాతుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పెండ్ర వీరన్న, ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు జవ్వాది శ్రీనివాసరావు, జేవీవీ జిల్లా నాయకుడు యర్రా అజయ్‌కుమార్, దగ్గులూరు సర్పంచ్ పేరయ్య, పట్టణ జేఏసీ చైర్మన్ గుడాల హరిబాబు తదితరులు మాట్లాడారు. -
విద్య, వైద్యాన్ని పెత్తందారుల చేతుల్లో పెట్టే కుట్ర
సాక్షి, విశాఖపట్నం: విద్య, వైద్యాన్ని పెత్తందారుల చేతుల్లో పెట్టేసి.. ప్రజలకు ప్రధాన అవసరాల్ని దూరం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ పేరుతో కుట్ర పన్నుతోందని ‘పీపుల్స్ ఫర్ ఇండియా’ ధ్వజమెత్తింది. రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన మెడికల్ కాలేజీల్ని పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) పేరుతో కట్టబెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాల్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రజారోగ్యం ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కోరుతూ ప్రజారోగ్య వేదిక, పీపుల్ ఫర్ ఇండియా విశాఖపట్నం చాప్టర్ ఆధ్వర్యంలో స్థానిక అల్లూరి విజ్ఞాన కేంద్రంలో శనివారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. విలువైన ప్రజాధనాన్ని కారుచౌకగా ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేసే చంద్రబాబు వైఖరిపై ప్రజా ఉద్యమాలు చేపట్టాలని తీర్మానించారు.ఐదేళ్ల తర్వాత పదవిలో ఉంటామన్న గ్యారెంటీ లేదు ఐదేళ్ల తర్వాత గెలుస్తామో లేదో అన్న గ్యారెంటీ అధికారంలో ఉన్న వాళ్లకి లేదు. ఐదేళ్లలోనే 50 ఏళ్ల రాజకీయ జీవితంలో సంపాదించాల్సిందంతా సంపాదించేయాలన్న తొందరతోనే రాజకీయ నాయకులు తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రజలు బలవుతున్నారు. కాబట్టి.. ప్రజలే ముందుకు రావాలి. నిరసనల్ని ఉద్యమంగా మార్చి.. ప్రజావ్యతిరేక వైఖరికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది. – ఎంవీఎస్ శర్మ, మాజీ ఎమ్మెల్సీప్రజాధనాన్ని ప్రైవేట్‌కివ్వడమే సంపద సృష్టా? సంపద సృష్టి అంటే ప్రజలకు అనుకున్నారు. కానీ.. ప్రైవేట్ వాళ్లకు అని చంద్రబాబు ప్రభుత్వ విధానాల ద్వారా అర్థమవుతోంది. వైద్య కళాశాలల్ని ప్రైవేట్‌పరం చేస్తే.. పేద విద్యార్థులు ఆర్థిక భారంతో చదువుకు దూరమవుతారు. ఇప్పటికే పేదలకు వైద్యం భారంగా మారింది. ఈ కాలేజీలు ప్రైవేట్‌పరం చేస్తే.. మరింత భారమవుతుందన్న విషయం ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. – కేఎస్ చలం, మాజీ ఉపకులపతి, ద్రవిడ యూనివర్సిటీప్రజాధనాన్ని ప్రైవేట్‌కివ్వడమే సంపద సృష్టా? సంపద సృష్టి అంటే ప్రజలకు అనుకున్నారు. కానీ.. ప్రైవేట్ వాళ్లకు అని చంద్రబాబు ప్రభుత్వ విధానాల ద్వారా అర్థమవుతోంది. వైద్య కళాశాలల్ని ప్రైవేట్‌పరం చేస్తే.. పేద విద్యార్థులు ఆర్థిక భారంతో చదువుకు దూరమవుతారు. ఇప్పటికే పేదలకు వైద్యం భారంగా మారింది. ఈ కాలేజీలు ప్రైవేట్‌పరం చేస్తే.. మరింత భారమవుతుందన్న విషయం ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. – కేఎస్ చలం, మాజీ ఉపకులపతి, ద్రవిడ యూనివర్సిటీప్రభుత్వం తీరు దుర్మార్గంగా ఉంది కేజీహెచ్‌కు రోజూ 3,200 ఓపీ వస్తోంది. చుట్టుపక్కల ఉన్న ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్ అన్నీ కలిపితే ఇందులో పావు వంతు కూడా ఓపీ ఉండదు. సింహభాగం ప్రజలకు వైద్యం ఉచితంగా.. ప్రభుత్వ హాస్పిటల్స్‌లోనే అందాలి. అమరావతికి రూ.లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారు. మెడికల్ కాలేజీల నిర్మాణానికి రూ.5 వేల కోట్లు కేటాయించలేరా. – టి.కామేశ్వరరావు, అధ్యక్షుడు, ప్రజారోగ్య వేదిక అప్పుడొకటి చెప్పి.. ఇప్పుడు ముంచేస్తున్నారు పీపీపీ పేరుతో సంపద మొత్తం ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే.. ఎవరికి సొంత ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయో అందరికీ తెలిసిందే. ఈ విషయంలో చంద్రబాబు వైఖరి స్పష్టంగానే ఉంది. లోకేశ్ పాదయాత్ర సందర్భంగా మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నడుపుతుందని హామీ ఇచ్చారు. ఇప్పుడు నిలువునా ముంచేస్తున్నారు. ప్రైవేటీకరణ నిర్ణయం వల్ల విద్యార్థులతో పాటు.. ప్రజలూ తీవ్రంగా నష్టపోతారు. – పి.రామ్మోహన్, రాష్ట్ర అధ్యక్షుడు, ఎస్ఎఫ్ఐకార్పొరేట్ పీఎం, కార్పొరేట్ సీఎం వల్లే..! వైద్య కళాశాలలపై పోరాటం ప్రజా ఉద్యమంగా మారాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కేంద్రంలో కార్పొరేట్ పీఎం, రాష్ట్రంలో కార్పొరేట్ సీఎం ఉన్నారు. ప్రజలకు సేవ చేయరు కానీ.. ప్రైవేట్ సంస్థలపై మాత్రం ప్రేమ కురిపిస్తారు. కనిపించిన ప్రభుత్వ భూములన్నీ ప్రైవేట్‌కు «కట్టబెట్టేలా చట్టం చేస్తారేమో. భూమి, భవనం, మౌలిక వసతులు అన్నీ కల్పించి ప్రైవేట్‌కు కాలేజీలను అప్పగించడం హేయమైన చర్య. – రామారావు, రిటైర్డ్ డీఎంహెచ్‌వో ప్రభుత్వం తీరు దుర్మార్గంగా ఉంది కేజీహెచ్‌కు రోజూ 3,200 ఓపీ వస్తోంది. చుట్టుపక్కల ఉన్న ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్ అన్నీ కలిపితే ఇందులో పావు వంతు కూడా ఓపీ ఉండదు. సింహభాగం ప్రజలకు వైద్యం ఉచితంగా.. ప్రభుత్వ హాస్పిటల్స్‌లోనే అందాలి. అమరావతికి రూ.లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారు. మెడికల్ కాలేజీల నిర్మాణానికి రూ.5 వేల కోట్లు కేటాయించలేరా. – టి.కామేశ్వరరావు, అధ్యక్షుడు, ప్రజారోగ్య వేదిక అప్పుడొకటి చెప్పి.. ఇప్పుడు ముంచేస్తున్నారు పీపీపీ పేరుతో సంపద మొత్తం ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే.. ఎవరికి సొంత ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయో అందరికీ తెలిసిందే. ఈ విషయంలో చంద్రబాబు వైఖరి స్పష్టంగానే ఉంది. లోకేశ్ పాదయాత్ర సందర్భంగా మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నడుపుతుందని హామీ ఇచ్చారు. ఇప్పుడు నిలువునా ముంచేస్తున్నారు. ప్రైవేటీకరణ నిర్ణయం వల్ల విద్యార్థులతో పాటు.. ప్రజలూ తీవ్రంగా నష్టపోతారు. – పి.రామ్మోహన్, రాష్ట్ర అధ్యక్షుడు, ఎస్ఎఫ్ఐకార్పొరేట్ పీఎం, కార్పొరేట్ సీఎం వల్లే..! వైద్య కళాశాలలపై పోరాటం ప్రజా ఉద్యమంగా మారాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కేంద్రంలో కార్పొరేట్ పీఎం, రాష్ట్రంలో కార్పొరేట్ సీఎం ఉన్నారు. ప్రజలకు సేవ చేయరు కానీ.. ప్రైవేట్ సంస్థలపై మాత్రం ప్రేమ కురిపిస్తారు. కనిపించిన ప్రభుత్వ భూములన్నీ ప్రైవేట్‌కు «కట్టబెట్టేలా చట్టం చేస్తారేమో. భూమి, భవనం, మౌలిక వసతులు అన్నీ కల్పించి ప్రైవేట్‌కు కాలేజీలను అప్పగించడం హేయమైన చర్య. – రామారావు, రిటైర్డ్ డీఎంహెచ్‌వో -
7న వైఎస్సార్సీపీ కీలక సమావేశం
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) ఈ నెల 7వ తేదీన ఆ పార్టీ ముఖ్యనేతలతో భేటీ కానున్నారు. మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించనున్న ఈ కీలక భేటీలో రీజనల్ కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు హాజరు కానున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, ప్రజా పోరాటాలు సహా అనేక అంశాలపై ఈ కీలక భేటీలో చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అంతేకాదు.. ఈ నెల 8, 9 వ తేదీల్లో వైఎస్ జగన్ పర్యటనలకు సంబంధించిన అప్డేట్స్ను అందించాయి. ఈ నెల 8వ తేదీన వైఎస్ జగన్ భీమవరంలో పర్యటించనున్నారు(YS Jagan Bhimavaram Tour). మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు కుమారుడి వివాహ వేడుకకు హాజరై నూతన జంటను ఆశీర్వదించనున్నారు. అలాగే.. ఈ నెల 9వ తేదీన వైఎస్ జగన్ అనకాపల్లిలో పర్యటించనున్నారు(jagan Anakapalle Tour). నర్సీపట్నం మాకవరపాలెంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఆయన సందర్శించనున్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలని చంద్రబాబు సర్కార్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై ప్రజాగ్రహం వ్యక్తం అవుతున్న తరుణంలో ఇటు వైఎస్ జగన్ పర్యటన రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది. -
9న అనకాపల్లికి వైఎస్ జగన్
సాక్షి, అనకాపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) ఈ నెల 9వ తేదీన అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. నర్సీపట్నం మెడికల్ కాలేజీ(Narsipatnam Medical College)ని సందర్శించి.. జరిగిన పనులను పరిశీలిస్తారని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వైఎస్ జగన్ హయాంలో చేపట్టిన 17 మెడికల్ కాలేజిల నిర్మాణం ఒక చరిత్ర. కానీ, విద్యా వైద్యాన్ని చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారు. ఏకంగా అందులో పది మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్నారు. తన అనునాయులకు మెడికల్ కాలేజీలను కట్టబెడుతున్నారు. తద్వారా జగన్‌కు మంచి పేరు రాకుండా అడ్డుకుంటున్నారు. కానీ, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది... చంద్రబాబు ఆరోగ్య శ్రీని నిర్వీర్యం చేశారు. కళ్లుండి కబోదుల్లా టిడిపి నేతలు వ్యవహరిస్తున్నారు. స్పీకర్ అయ్యన్న అవగాహనతో మాట్లాడాలి. ఆయన మెడికల్ కాలేజీని సందర్శిస్తే నిర్మాణం జరిగిందో లేదో తెలుస్తుంది. మెడికల్ కాలేజ్ నిర్మాణం జరగకపోతే ప్రైవేటీకరణ ఎలా చేస్తున్నారు. చంద్రబాబు నిర్ణయాలపై ప్రజలు చీ అంటున్నారు. అయినా ఆయన సిగ్గు తెచ్చుకోవడం లేదు. కేవలం జగన్ మీద కక్ష సాధింపు చర్యతో మెడికల్ కాలేజీలను అమ్మేస్తున్నారు అని అన్నారు. మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ అధికారంలోకి రాకముందు 11 మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో ఉండేవి. వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఒకేసారి 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారు. పేదవాడికి ఆధునిక వైద్యం అందించాలనే లక్ష్యంతో మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నర్సీపట్నం మెడికల్ కాలేజీను వైఎస్ జగన్ సందర్శిస్తారు. .. పేదవాడికి ఇంగ్లీష్ మీడియం విద్యను చంద్రబాబు దూరం చేశారు. మెడికల్ విద్య చదివే విద్యార్థులకు నేడు మెడికల్ సీట్లును దూరం చేస్తున్నారు. ప్రజలకు ఉపయోగ పడే మెడికల్ కాలేజిల ఐదు వేల కోట్లు ఖర్చు మీద పెట్టలేరా. విద్యా వైద్యంతోపాటు అన్ని రంగాలను చంద్రబాబు ప్రవేటిపరం చేస్తున్నారు. మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది’’ అని అమర్నాథ్ అన్నారు. -
ప్రశ్నిస్తానన్న పవన్ ఏమైపోయాడు.. మా పోరాటం ఆగదు
-
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. కడపలో వైఎస్సార్ సీపీ భారీ నిరసన
-
పేదల వైద్యాన్ని పెద్దల చేతుల్లో పెడతారా?
సాక్షి నెట్వర్క్: ‘‘ప్రభుత్వ వైద్య కళాశాలల్లో చదివేవారిలో అధికులు ఆర్థిక స్థోమత లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే. ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లేది కూడా వీరే. అలాంటి వైద్య విద్య, వైద్యాన్ని వారికి దూరం చేసి, ప్రయివేటుకు కట్టబెట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నించడం దారుణం’’ అని వైఎస్సార్సీపీ మండిపడింది. వైద్య కళాశాలల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు మంగళవారం వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ‘సమర భేరి’ పేరిట నిరసనలు నిర్వహించారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు ప్రధాన కూడళ్లలో నల్లబ్యాడ్జీలు ధరించి బైఠాయించారు.చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకాన్ని ఎండగడుతూ... ఇదేం పాలన.. ఇదేం పాలన.. సర్కార్ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. పార్టీ కార్యాలయాల నుంచి నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు సమరి్పంచారు. సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వ బుద్ధి మారేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో వైఎస్సార్సీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా నాయకులు, ఎస్సీ సెల్ నాయకులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ చంద్రబాబూ... కార్పొరేట్లపై ప్రేమ.. పేదలపై కక్షనా? బడుగు బలహీన వర్గాల పిల్లలకు వైద్య విద్యను అభ్యసించే అర్హత లేదా? అని ప్రశి్నంచారు. వైద్య కళాశాలలను ప్రైవేటీకరిస్తే పేదలకు సరైన వైద్యం అందక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘పేదలకు విద్య, వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యత. పేదల సంక్షేమమే లక్ష్యంగా, జిల్లాకో మెడికల్ కాలేజీ ఉండాలని, సామాన్యులకూ వైద్య విద్య అందుబాటులోకి రావాలన్న గత ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రానికి 17 వైద్య కళాశాలలను తీసుకొచ్చి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించేలా చూశారు. కూటమి సర్కారు మాత్రం ప్రయివేటుకు కట్టబెట్టి పేదలకు వైద్య విద్యతో పాటు వైద్యాన్ని దూరం చేస్తోంది’’ అని మండిపడ్డారు. మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ఆ«దీనంలోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. ‘‘చంద్రబాబూ 15 ఏళ్లు సీఎంగా చేశావ్.. ఒక్క ప్రభుత్వ వైద్య కాలేజీ తేలేకపోయావ్..? అలాంటిది ఐదేళ్లలోనే జగన్ 17 మెడికల్ కాలేజీలను తెచ్చారు. వాటిని నువ్వొచ్చి ప్రయివేటుపరం చేస్తావా?’’ అని నిప్పులు చెరిగారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన తీవ్రం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో కావాల్సిన వారికి కట్టబెట్టాలనేదే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ ఆలోచన అని వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపకపోతే... అంబేద్కర్ విగ్రహం ముందే కిరోసిన్ పోసుకుని
-
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. వైఎస్సార్సీపీ నిరసనలు
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయటాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పీపీపీకి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ అజిత్‌సింగ్ నగర్లో అంబేద్కర్ విగ్రహానికి వైఎస్సార్సీపీ నేతలు వినతి పత్రం ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అవినాష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మొండితోక జగన్మోహన్రావు, ఎమ్మెల్సీ రాహుల్లా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ తదితరులు పాల్గొన్నారు.ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక.. సామాన్య ప్రజలు బతికే పరిస్థితి లేదని మండిపడ్డారు. వైఎస్ జగన్ ఐదేళ్లలో సామాన్యుల పిల్లలు, బడుగు బలహీన వర్గాల పిల్లలు మెడికల్ విద్య చదవాలని కాలేజీలు తీసుకువచ్చారు. ప్రైవేట్ కాలేజీలు ఇచ్చిన ప్యాకేజి తీసుకోవాలని చంద్రబాబు, లోకేష్, పవన్ ప్రైవేట్‌పరం చేయాలని చూస్తున్నారు. డబ్బు మీద ప్రేమతో సామాన్యుల కలను చిదిమేస్తున్నాడు మెడికల్ కాలేజీల పరిశీలనకు వెళ్తే పోలీసులతో అడ్డుకున్నారు.. కేసులు పెట్టారు. నిర్బంధంతో పోరాటం ఆపలేరు. మెడికల్ కాలేజీల ప్రవేటికరణ ఆపకపోతే పోరాటం తీవ్రతరం చేస్తాం’ అని హెచ్చరించారు.విశాఖ: మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయొద్దంటూ వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో పార్టీ నేతలు ధర్నా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. కుటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు. గొల్ల బాబురావు మాట్లాడుతూ.. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిర్వహించలేని దద్దమ్మ ప్రభుత్వం కూటమి సర్కార్ అంటూ మండిపడ్డారు. వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలను తీసుకువస్తే చంద్రబాబు ప్రైవేటుపరం చేస్తున్నారు. విజయవాడ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో చంద్రబాబు పెడుతున్నారు. పేదల పక్షపాతి వైఎస్ జగన్. దళితుల జోలికి వస్తే చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చివేస్తాం’’ అంటూ గొల్ల బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్సార్ జిల్లా: కడప అంబేద్కర్ సర్కిల్ వద్ద వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ నాయకులు ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలోని మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడంపై నిరసన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బద్వేలు ఎమ్మెల్యే దాసరి సుధ, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.అనంతపురం: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై దళిత సంఘాల ఆగ్రహం వ్యక్తం చేశాయి. నగరంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో నిరసనలు నిర్వహించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయవద్దని డిమాండ్ చేస్తూ.. నల్లబ్యాడ్జీలు, బెలూన్లతో నిరసన తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.తిరుపతి: ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్‌పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట వైఎస్సార్సీపీ నేతలు నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వం పేద వర్గాల పిల్లలకు వైద్య విద్యను దూరం చేస్తూ కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఉమ్మడి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు రాజేంద్ర మండిపడ్డారు. సీఎం చంద్రబాబు ప్రైవేట్ మెడికల్ కాలేజీల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని.. పునరాలోచన చేయాలంటూ ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం డిమాండ్ చేశారు.గుంటూరు: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గుంటూరులో వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు గెడ్డేటి సురేంద్ర ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, మంగళగిరి వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి, తాడికొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ వనమా బాల వజ్రబాబు, పొన్నూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ పాల్గొన్నారు. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను గట్టిగా నిరసించాలి: సజ్జల
-
నీకు జ్వరం వస్తే హైదరాబాద్ పోతావ్.. మరి పేదవాడికి ఆరోగ్యం బాగోలేకపోతే..
-
‘ చంద్రబాబు ప్రభుత్వంలో విద్య, వైద్యం పూర్తిగా నాశనం’
తాడేపల్లి : ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్న కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ ధ్వజమెత్తారు. ఇది నిజంగా కూటమి ప్రభుత్వం సిగ్గు పడాల్సిన అంశమని మండిపడ్డారు. ఈరోజు(గురువారం, సెప్టెంబర్ 25వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన శైలజానాథ్.. ‘చంద్రబాబు ప్రభుత్వంలో విద్య, వైద్య రంగాలు పూర్తిగా నాశనం అయ్యాయి. ఆ రెండు రంగాలనూ తమ గుప్పెట్లో పెట్టుకుని పేదలను పీల్చి పిప్పి చేస్తున్నారు. గిరిజనులకు మెరుగైన వైద్యం కోసం జగన్ పాడేరులో మెడికల్ కాలేజీ పెట్టారు. అలాంటి కాలేజీని కూడా అడవి బిడ్డలకు దూరం చేస్తున్నారు. అదేమని అడిగితే చట్టసభలోనే లోకేష్ పీకుడు భాష మాట్లాడుతున్నారు. ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి మెడికల్ కాలేజీలు వెళ్లిపోతే పేద, మధ్య తరగతి ప్రజలు బతికేది ఎలా?, జగన్ సీఎం అయ్యాక మెడికల్ కాలేజీలను మళ్ళీ ప్రభుత్వపరం చేస్తాం. మంత్రి సత్యకుమార్ అసత్యాలు మాట్లాడుతున్నారు. ఆయన రాష్ట్ర మంత్రిగా కాకుండా బీజేపీ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. లోకేష్ నోరు తెరిస్తే పీకుడు భాష తప్ప మరేమీ మాట్లాడటం లేదు. బూతు మాటలు మానేసి మంచి మాటలు నేర్చుకుంటే మంచిది. చంద్రబాబు తనవారికి మెడికల్ కాలేజీలను దోచి పెడుతున్నారు. దీన్ని రాష్ట్ర ప్రజలు సహించే పరిస్థితి లేదు’ అని స్పష్టం చేశారు. -
YSRCP పాలనలో ఇలాంటి పరిస్థితులు లేవు: వైఎస్ జగన్
-
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చర్చపై పట్టు వీడని YSRCP..
-
మోదీని మరోసారి అవమానించిన బాబు.. మీ శిష్యుడిని చూసి బుద్ధి తెచ్చుకో
-
మీరు చెప్పినట్టు ముగ్గురు పిల్లల్ని కనాలంటే ఆరోగ్యం కావాలి కదా బాబు.. యువ డాక్టర్ సెటైర్లు
-
మెడికల్ కాలేజీల విషయంలో పాపం మూట కట్టుకుంటున్న బాబు సర్కార్
సాక్షి, వెలగపూడి: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేయాలనే కూటమి ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యమ సంఘాలు, ప్రజలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. మరోవైపు.. రాజకీయంగానూ వైఎస్సార్సీపీ తమ ఆందోళనలను కొనసాగిస్తోంది. ఈ క్రమంలో.. చట్ట సభలో ఈ అంశంపై చర్చ జరగాల్సిందేనని పట్టుబడుతోంది. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలన్న నిర్ణయంపై అసెంబ్లీలో చర్చకు వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోంది. అయితే ప్రభుత్వం ఈ అంశంపై ఇంతకు ముందు షార్ట్ డిస్కషన్‌కు ఒప్పుకుంది. ఈ క్రమంలో ఇవాళ శాసన మండలిలో ఎలాగైనా చర్చ జరిగేలా చూడాలని వైఎస్సార్సీపీ ప్రయత్నిస్తోంది. తక్షణమే ఈ అంశంపై చర్చించాలని సోమవారం మండలి చైర్మన్‌కు వాయిదా తీర్మానం అందజేసింది కూడా. అయితే.. ఈ వాయిదా తీర్మాన్ని చైర్మన్ తిరస్కరించడంతో.. ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. నల్ల కండువాలతో మండలిపై శాసనమండలికి హాజరైన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. ‘‘ఈరోజు చర్చ జరుపుతాం అన్నారు. బీఏసీలో తీసుకున్న నిర్ణయాన్ని ఎందుకు పాటించరు?. ఇది ప్రజలకు సంబంధించిన సమస్య. ఇది ప్రజారోగ్యానికి సంబంధించిన అంశం. ఈ అంశంపై చర్చించాల్సిన అవసరం ఉంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ రద్దు కావాల్సిందే’’ అని మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. తక్షణం చర్చ జరగాలి అంటూ మండలి చైర్మన్ పోడియం చుట్టూ చేరి వైఎస్సార్సీపీ సభ్యులు ఆందోళన కొనసాగించారు. వైఎస్సార్సీపీ పట్టు వీడకపోవడంతో ఆందోళన నడుమ.. చైర్మన్ మండలిని కాసేపు వాయిదా వేశారు.మండలి బయట ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం పాపం మూట కట్టుకుంటోంది. మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణను ఆపాలని అన్ని వర్గాల ప్రజలు కోరుతున్నా చంద్రబాబుకు చెవికి ఎక్కటం లేదు. ప్రజల నిర్ణయాలకు వ్యతిరేకంగా పని చేస్తే ఆ ప్రభుత్వాలనే జనం కూల్చేసిన సంఘటనలు ఉన్నాయి. తమ తాబేదార్లకి మెడికల్ కాలేజీలను దోచి పెడుతున్నారు. రాష్ట్ర ప్రజలు దీనిపై తిరుగుబాటు చేయబోతున్నారు. వైద్యం అందుబాటులో లేక జనం ఇబ్బంది పడుతుంటే ఈ ప్రభుత్వానికి కనపడటం లేదా?. 17 కాలేజీలను ప్రభుత్వ పరంలోనే నడపాలి అని డిమాండ్ చేశారు.అంతకు ముందు.. సోమవారం ఉదయం శాసనమండలి ప్రారంభానికి ముందు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు.. నల్లకండువాలతో, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకోవాలంటూ ఫ్లకార్డులు చేతపట్టి నినాదాలు చేస్తూ అసెంబ్లీకి ర్యాలీగా వచ్చారు. ఆ సమయంలో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా.. ముందుకు సాగారు. ‘‘కూటమి ప్రభుత్వం చాలా దుర్మార్గంగా ఆలోచిస్తోంది. ప్రజారోగ్యాన్ని చంద్రబాబు రోడ్డుపాలు చేస్తున్నారు. ప్రజల కోసం ఎందాకైనా పోరాటం చేస్తాం’’ అని మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఈ సందర్భంగా అన్నారు. -
టీడీపీ నేతలు ప్రశ్న... దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన వడ్డే శోభనాద్రీశ్వరరావు
-
చంద్రబాబూ.. ఆ అధికారం నీకు ఎక్కడిది?: వడ్డే శోభనాద్రీశ్వరరావు
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ భూములను కోటీశ్వరులకు కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు. పీపీపీ విధానం అంటూ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం దుర్మార్గం. ప్రభుత్వ భూములను ప్రైవేటు పరం చేసే అధికారం.. చంద్రబాబుకు ఎక్కడిది?. మెడికల్ కాలేజీలను వైఎస్ జగన్ కట్టించడం హర్షించదగినది అని ప్రశంసలు కురిపించారు.మాజీ మంత్రి వడ్డే శోభానాద్రీశ్వరరావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. నిర్మాణం పూర్తయిన మెడికల్ కళాశాల్లో పీపీపీ విధానం తీసుకురావడం సరైన విధానం కాదు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం దుర్మార్గం. వైద్య, విద్యా రంగాలను ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా?. వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేస్తే ప్రైవేటు వాళ్లకే లబ్ది జరుగుతుంది. 1972 నుండి నేను రాజకీయాల్లో ఉన్నాను. చంద్రబాబు.. కోటేశ్వరులకు ప్రభుత్వ భూములు కట్టబెడుతున్నారు. కోట్ల విలువ చేసే భూములను 95 పైసలకు చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నాడు.P4 విధానాన్ని చంద్రబాబు విరమించుకోవాలి. 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వం నడపాలి. UHI మెడికల్ కాలేజీ విశాఖపట్నంలో పెట్టాలి. అమరావతిలో పెట్టేందుకు వీల్లేదు. టూరిజం పాలసీ ప్రకారం లులు కంపెనీలకు చంద్రబాబు కట్టబెడుతున్నాడు. లులు మీద ప్రేమతో ఆర్టీసీ స్ధలాన్ని 99 సంవత్సరాలకు ప్రైవేటు పరం చేశాడు. చంద్రబాబుకు ప్రభుత్వ భూములను ప్రైవేటు పరం చేసే అధికారం ఎక్కడుంది?. విజయవాడలో లులు కంపెనీకి ప్రైవేట్ పరం చేసిన దానిపై సుప్రీంకోర్టులో ఫిల్ వేశాను.చంద్రబాబుకు సానుకూలమైన పత్రికలోనే మట్టి దందా వార్తలు వస్తున్నా పట్టించుకోవడం లేదు. ఇబ్రహీంపట్నం బూడిద కంపెనీలో వ్యాపార లావాదేవీలు సాగుతున్నాయి. గతంలో నీరు చెట్టు-కార్యక్రమంలో ఉన్న బాకీలు నేటి కూడా చంద్రబాబు చెల్లించలేదు. మంత్రి నారాయణ కళాశాలల్లో 10 శాతం సీట్లు ఉచితంగా ఇవ్వండి. అప్పుడు పీఫోర్ విధానం అమలు చేయండి. గతంలో 75 ఏళ్లలో 2365 మెడికల్ సీట్లు ఉండేవి. వైఎస్ జగన్ తీసుకువచ్చిన మెడికల్ కాలేజీలు వల్ల 2550 మెడికల్ సీట్లు వస్తాయి’ అని తెలిపారు. -
ప్రజల కోసం పోరాటం.. ఎన్ని రోజులైనా జైల్లో పెట్టండి: పేర్ని నాని
సాక్షి, కృష్ణా: రాష్ట్ర ప్రజల కోసం పోరాడుతున్నాం.. నెలకాకపోతే రెండు నెలల జైల్లో పెట్టండి అని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకిస్తూ మేం శాంతియుతంగా నిరసనకు పిలుపునిచ్చాం. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 400 మందిపై కేసులు పెట్టారని మండిపడ్డారు. జిల్లా ఎస్పీ వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు పెట్టడాన్ని తాము తప్పుబట్టడం లేదన్నారు.వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి పేర్ని నాని తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘360 రోజులు సెక్షన్ 30 పెట్టడం అనేది ధర్మమేనా?. ఈ విషయాన్ని రాష్ట్ర హోం మంత్రి, డీజీపీ విజ్ఞతకే వదిలేస్తున్నా. ప్రభుత్వం మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రైవేట్ పరం చేస్తున్నారు. ప్రభుత్వం మెడికల్ కాలేజీలను నడపలేదని 2014-19 మధ్యలోనే చంద్రబాబు ప్రభుత్వం స్పష్టం చేసింది. 2019లో వైఎస్ జగన్ వచ్చిన తర్వాత వైద్యానికి పెద్దపీట వేశారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ఆలోచన చేశారు. పేద పిల్లలు మెరుగైన వైద్య విద్యను అభ్యసించాలని ఆలోచన చేశారు. 17 కొత్త మెడికల్ కాలేజీలను తెచ్చారు. ఇందులో భాగంగా ఐదు మెడికల్ కాలేజీలను పూర్తి చేశారు.మాట తప్పిన లోకేష్ నాయుడు..కాలేజీల నిర్వహణకు ఇబ్బంది లేకుండా ఒక 50 సీట్లకు పేమెంట్ కోట కింద పెట్టారు. వైఎస్ జగన్ ఆలోచనతో ప్రభుత్వం నుంచి డబ్బుల కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. అధికారంలోకి రాగానే 150 సీట్లు 15 వేలకే అందిస్తామని లోకేష్ నాయుడు చెప్పాడు. కానీ, అసలు కాలేజీలనే నడపలేనని ప్రైవేటు వాళ్లకు అప్పగించేస్తున్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ మేం శాంతియుతంగా నిరసనకు పిలుపునిచ్చాం. నిరసనకు పర్మిషన్ అడిగాం ఇవ్వనన్నారు. మెడికల్ కాలేజీ వద్దకు వెళ్తే లోపలేస్తామన్నారు. ప్రజల తరపున ప్రతిపక్షంగా పోరాడటం మా బాధ్యత. అందుకే ఛలో మెడికల్ కాలేజ్ కార్యక్రమం చేపట్టాం.జనసేన, టీడీపీ సంగతేంటి?రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 400 మందిపై కేసులు పెట్టారు. 10 సంవత్సరాలు శిక్ష పడే సెక్షన్ల కింద కేసు పెట్టారని చెబుతున్నారు. ప్రజల కోసం మేము పోరాడుతున్నాం.. ఎన్ని కేసులు అయినా పెట్టుకోండి. మంత్రి కొల్లు రవీంద్ర, చంద్రబాబుకు నచ్చింది చేసుకోనివ్వండి. హత్యలు చేసి దొరికిపోయిన వాళ్లే నామోషిగా ఫీలవ్వడం లేదు. ఇలాంటి కేసులకు మేమెందుకు బాధపడాలి. ప్రజల కోసం పోరాడాం.. నెలకాకపోతే రెండు నెలలు జైల్లో పెట్టండి. జిల్లా ఎస్పీ మాపై కేసులు పెట్టడాన్ని మేము తప్పు పట్టడం లేదు. ఎస్పీ చర్యలను స్వాగతిస్తున్నాం. కృష్ణాజిల్లాలో జనసేన, టీడీపీ నేతల అరాచకాలపై ఇలాగే కొరడా ఝుళిపించాలని కోరుకుంటున్నాం.ఎస్పీకి సూచన..గత ఎస్పీ కారణంగా స్టేషన్ హౌస్ ఆఫీసర్లు రాజకీయ వ్యవస్థకు తలొగ్గారు. ఏకపక్షంగా వ్యవహరించడానికి అలవాటైపోయారు. గాడి తప్పిన పోలీసులను గాడిలో పెట్టండి. పాత అలవాట్లను వదిలించండి. స్టేషన్ ఆఫీసర్లు పేకాటను నడిపిస్తున్నారు. మర్డర్లు చేసే వారికి కొమ్ము కాస్తున్నారు. మరో స్టేషన్ ఆఫీసర్ పెద్ద ఎత్తున డీజిల్ మాఫియా నడిపిస్తున్నారు. మంత్రి కొల్లు రవీంద్ర కనుసన్నల్లో ఆయన నడుచుకుంటారు. మంత్రి గారి అనుచరులు తప్ప మరొకరు డీజిల్ అమ్మితే ఆయన ఊరుకోరు. నెలకు పది నుంచి 12 లారీల డీజిల్ అమ్ముకుంటున్నారు. పోర్టు దగ్గర్లో భూమిలో రెండు ట్యాంకర్లు ఏర్పాటు చేసుకున్నారు. పోలీసులకు తెలిసే ఇంతలా బరితెగించారు. బందరు వాళ్లను కాకుండా బయట నుంచి ఆఫీసర్లను పంపించండి మీకే తెలుస్తుంది. మీ చుట్టూ గాడి చెప్పిన వ్యవస్థను సరిదిద్దండి. తప్పు చేసిన వాడు ఏ పార్టీ అయినా శిక్షించండి’ అని డిమాండ్ చేశారు. -
ప్రైవేటీకరణపై ప్రజా యుద్ధం.. బాబుకు YS జగన్ వార్నింగ్
-
ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై జనాగ్రహం... చంద్రబాబు కూటమి సర్కార్ నిర్ణయంపై వెల్లువెత్తిన నిరసన
-
మెడికల్ కాలేజీలపై ‘మండలి’లో ఆందోళన
సాక్షి, అమరావతి: పీపీపీ విధానంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను చంద్రబాబు ప్రభుత్వం వెంటనే రద్దుచేయాలి వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు శుక్రవారం శాసనమండలి సమావేశంలో పట్టుబట్టారు. సమావేశాలు జరుగుతున్నంతసేపూ వారు పోడియం ముందే నిలబడి పెద్దఎత్తున నినాదాలు, ఆందోళన చేశారు. దీంతో శుక్రవారం గంటపాటు కూడా సభ జరగలేదు. వీరి ఆందోళనల మధ్యే ‘మండలి’ చైర్మన్ మోషేన్‌రాజు ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని నిర్వహించేందుకు యత్నించారు. మధ్యలో రెండుసార్లు సభను తాత్కాలికంగా వాయిదా వేసి గందరగోళ పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయినా, పరిస్థితిలో మార్పు రాకపోవడంతో మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. వాయిదా తీర్మానం, తిరస్కరణ..అంతకుముందు.. ఉదయం సభ ప్రారంభం కాగానే ‘ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ–పీపీపీ విధానం’ గురించి చర్చించేందుకు వైఎస్సార్సీపీ సభ్యులు మొండితోక అరుణ్‌కుమార్, సిపాయి సుబ్రమణ్యం, కుంభా రవిబాబు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించినట్లు చైర్మన్ మోషేన్‌రాజు ప్రకటించారు.ఇందుకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు అభ్యంతరం తెలుపుతూ, ఈ అంశంపై సభలో చర్చ చేపట్టాలంటూ పోడియం వద్దకు చేరుకుని ‘ప్రజారోగ్యం ప్రైవేటీకరణా.. పేదలు చదువుకునే ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ సిగ్గుసిగ్గు’.. వంటి ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు ఉపక్రమించారు. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య విద్యా శాఖకు సంబంధించిన ప్రశ్నకు మంత్రి లోకేశ్ బదులిచ్చారు. బీఏసీలో చర్చించి ఈ అంశంపై నిర్ణయం తీసుకుందాం.. అప్పటివరకు సభ్యులు సహకరించాలని చైర్మన్ సూచించినప్పటికీ సభ్యులు శాంతించలేదు. దీంతో, ఆయన సభను కొద్దిసేపు వాయిదా వేశారు.మళ్లీ అదే సీన్..అనంతరం.. ఉ.10.44కు సభ తిరిగి ప్రారంభమయ్యాక మండలి చైర్మన్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు తిరిగి పోడియం వద్దకు చేరుకుని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు కొనసాగించారు. ఇంతలో మరో రెండు ప్రశ్నలకు మంత్రులు బదులిచ్చారు. పరిస్థితిలో మార్పు రాకపోవడంతో చైర్మన్ మోషేన్‌రాజు 11 గంటలకు మళ్లీ వాయిదా వేశారు. మండలి బీఏసీ సమావేశానంతరం సభ తిరిగి కొనసాగుతుందని ఆయన ప్రకటించారు.టీడీపీ వర్సెస్ వైఎస్సార్సీపీ..సభ తిరిగి మ.12.38కు ప్రారంభం కాగానే వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు పోడియం వద్ద మళ్లీ తమ ఆందోళన కొనసాగించారు. మెడికల్ కాలేజీ అంశంపై స్వల్పకాలిక చర్చకు ప్రభుత్వం బీఏసీ సమావేశంలో అంగీకరించిందని.. సభ్యులు తమ సీట్లలోకి వెళ్లి కూర్చోవాలంటూ విజ్ఞప్తి చేసినా వారు అక్కడే ఉండిపోయారు. దీంతో ప్రశ్నోత్తరాల అజెండాల్లో ఉన్న అన్ని ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానాలు ఉంచాలంటూ చెప్పి ప్రశ్నోత్తరాల కార్యక్రమం ముగిసినట్లు చైర్మన్ ప్రకటించారు. దీంతో టీడీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నోత్తరాలు కొనసాగించాలంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ పోడియం వద్దకు చేరుకోవడంతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. కొద్దిసేపటికి టీడీపీ సభ్యులు తమ స్థానాల్లోకి వెళ్లగా, వైఎస్సార్సీపీ సభ్యులు ఆందోళన కొనసాగిస్తూ పోడియం ముందే ఉండిపోయారు. ఈ సమయంలో జీఎస్టీపై ప్రభుత్వ ప్రకటన చేసేందుకు మంత్రి పయ్యావుల కేశవ్ యత్నించగా.. సభలో పరిస్థితులు చూసి సోమవారం ప్రకటన చేస్తానంటూ చెప్పారు. దీంతో.. మ.ఒంటిగంట ప్రాంతంలో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. -
మెడికల్ కాలేజీలను అమ్మేస్తుంటే ప్రశ్నించకూడదా?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఈ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం అనేది ఉందా? అంటూ చంద్రబాబు సర్కార్‌పై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ‘ఛలో మెడికల్ కాలేజీ’ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నం చేయటంపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రజల తరఫున నిరసన తెలిపే రాజ్యాంగ పరమైన హక్కులను కాలరాస్తారా? అంటూ ఎక్స్ వేదికగా నిలదీశారు.‘‘చంద్రబాబూ.. ప్రజారోగ్య రంగాన్ని, పేదల ఆరోగ్య భద్రతను కాపాడుకునేందుకు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, ప్రజల తరఫున, వారి గొంతును గట్టిగా వినిపిస్తూ, వారితో కలిసి వైఎస్సార్సీపీ యూత్, స్టూడెంట్ విభాగాల నేతృత్వంలో చేపట్టిన శాంతియుత ఆందోళనలు, ర్యాలీలను ఎందుకు పాశవికంగా అడ్డుకోవాలనుకున్నారు? లాఠీచార్జ్‌లు ఎందుకు చేశారు? గృహనిర్బంధాలు, అరెస్టులు ఎందుకు చేశారు?’’ అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు.‘‘మీరు స్కాములు చేస్తూ తరతరాల ప్రజల ఆస్తులైన గవర్నమెంటు మెడికల్ కాలేజీలను మీ అనుయాయులకు అమ్మేస్తుంటే వాటిని ప్రశ్నించకూడదా? ప్రజల తరఫున గొంతెత్తితే అణచివేస్తారా? మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఇటు అసెంబ్లీ వెలుపలకూడా మా పార్టీ ఎమ్మెల్సీలు నిరసన తెలుపుతుంటే పోలీసులచేత దౌర్జన్యం చేయించడం మీ బరితెగింపు కాదా? ఇది కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై దాడులకు దిగుతారా? ఏమిటీ రాక్షసత్వం...మీరింతగా తెగబడినా ప్రజాప్రయోజనాల పరిరక్షణ కోసం మా పార్టీ ఆధ్వర్యంలో మా నాయకులు, వీరితో పాటు యువతీయువకులు, స్టూడెంట్లు తెగింపు చూపారు. ప్రజల పక్షాన నిలిచి అటు శాసన మండలిలోనూ, ఇటు మెడికల్ కాలేజీల ఆవరణలోనూ విజయవంతంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో పాల్గొన్న వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. పేదల ఆరోగ్య భద్రత, పేద విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణ కోసం, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకూ పోరాటాలు మరింత ఉద్ధృతంగా కొనసాగుతాయి’’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు..@ncbn గారూ.. ప్రజారోగ్య రంగాన్ని, పేదల ఆరోగ్య భద్రతను కాపాడుకునేందుకు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, ప్రజల తరఫున, వారి గొంతును గట్టిగా వినిపిస్తూ, వారితో కలిసి వైయస్సార్సీపీ యూత్, స్టూడెంట్ విభాగాల నేతృత్వంలో చేపట్టిన శాంతియుత ఆందోళనలు, ర్యాలీలను ఎందుకు… pic.twitter.com/EkqzMcG9cW— YS Jagan Mohan Reddy (@ysjagan) September 19, 2025 -
'ఛలో మెడికల్ కాలేజ్' విజయవంతం: విడదల రజిని
సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపు మేరకు నిర్వహించిన ఛలో మెడికల్ కాలేజ్ కార్యక్రమం విజయవంతం అయిందని మాజీ మంత్రి విడదల రజని అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తూ ఇచ్చిన జీవోను తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం స్పందించకుంటే దిగొచ్చేదాకా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని రజని హెచ్చరించారు. పోలీసులను ప్రయోగించి నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూసినా పార్టీ శ్రేణులు, విద్యార్థులు, యువత, ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చారని వివరించారు. మెడికల్ కాలేజీలు పూర్తి కాలేదని కూటమి నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఆయా మెడికల్ కాలేజీల వద్దకు వెళ్లి ఫొటోలు, వీడియోలు ప్రదర్శించారని ఆమె మీడియాకు వివరించారు. ఆమె ఇంకా ఏమన్నారంటే..మెడికల్ కాలేజీల నిర్మాణానికి నిధుల కొరత లేదువైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో జరిగిన ఛలో మెడికల్ కాలేజీల కార్యక్రమం విజయవంతమైంది. గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో రూ.8,500 కోట్ల వ్యయంతో వైఎస్ జగన్ 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టి 5 కాలేజీలను పూర్తి చేశారు. వాటిల్లో అడ్మిషన్లు పూర్తయ్యి క్లాసులు జరుగుతున్నాయి. ఎన్నికల నాటికి పూర్తయిన పాడేరు మెడికల్ కాలేజీని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రారంభించింది.వైఎస్ జగన్ మీద కక్షతో పులివెందుల మెడికల్ కాలేజీని మాత్రం ప్రారంభించకుండా ఎన్ఎంసీ సీట్లు కేటాయించినా వద్దని లేఖరాసిన నీచుడు చంద్రబాబు. వీటితో పాటు రెండో దశలో ప్రారంభంకావాల్సిన మరో 3 మెడికల్ కాలేజీలు 90 శాతం పనులు పూర్తయినా, కూటమి ప్రభుత్వం వచ్చాక 15 నెలలుగా పెండింగ్ పనులను పూర్తి చేయకుండా పక్కనపెట్టేశారు. మూడో దశలో పూర్తి చేయాల్సిన కాలేజీలు సైతం పిల్లర్ల దశలో ఉన్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి కూడా పనులన్నీ ప్రణాళిక ప్రకారం శరవేగంగా జరుగుతుండేవి. మెడికల్ కాలేజీలు పూర్తయితే వైఎస్ జగన్‌కి మంచి పేరు వస్తోందన్న కుట్రతో ప్రారంభించకుండా సేఫ్ క్లోజర్ పేరుతో మూసేసిన నీచ చరిత్ర చంద్రబాబుది.పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో జిల్లాకో మెడికల్ కాలేజీ ఉండాలని కొత్తగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. కాలేజీల నిర్మాణం నిధుల కొరత కారణంగా ఆగిపోకూడదన్న ఉద్దేశంతో సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్, నాబార్డు నిధులు వచ్చేలా టైఅప్ చేసుకున్నారు. పేదల వైద్యం ప్రభుత్వ బాధ్యతగా భావించి వైయస్ జగన్ అంత గొప్పగా ఆలోచించి ముందుచూపుతో వ్యవహరిస్తే కూటమి ప్రభుత్వం వచ్చాక సీఎం చంద్రబాబు వాటిని పీపీపీ పేరుతో పప్పు బెల్లాలకు తన వారికి కట్టబెట్టేందుకు సిద్దమయ్యారు.10 మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీలు, ప్రభుత్వ ఆస్తులను దోచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ప్రజారోగ్యం గురించి ఆలోచించకుండా, మెడిసిన్ చదివి డాక్టర్ కావాలని కలలు కంటున్న పేద విద్యార్థుల ఆశలను చిదిమేస్తూ దోపిడీయే ధ్యేయంగా సీఎం చంద్రబాబు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్నాడు.పోలీసుల వేధింపులకు లెక్క చేయకుండా వచ్చారుప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మరీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చింది. వైఎస్సార్సీపీ వాదనకు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనలపై సమాధానం చెప్పుకోలేని కూటమి ప్రభుత్వం, కాలేజీల నిర్మాణమే జరగలేదని విష ప్రచారం మొదలు పెట్టింది. కాలేజీల నిర్మాణం పూర్తయి క్లాసులు జరుగుతున్నప్పటికీ పిల్లర్ల దశలో ఉన్న భవనాల పొటోలు చూపించి ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్రకు తెరలేపారు. ఈ నేపథ్యంలో ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని విద్యార్థులు, యువజన విభాగాల ఆధ్వర్యంలో `ఛలో మెడికల్ కాలేజీ`ల కార్యక్రమానికి వైఎస్సార్సీపీ నిర్వహించింది. కేసులు పెడతామని బెదిరించినా ఎక్కడా వెనక్కి తగ్గకుండా 17 కొత్త మెడికల్ కాలేజీల వద్దకు వెళ్లి కాలేజీ నిర్మాణాల పరిస్థితిని ప్రజలకు వివరించాం. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి కూడా విశేషమైన స్పందన లభించింది. ఏ కాలేజీ ఏయే స్థితిలో ఉందో మా కార్యకర్తలు నేరుగా ఆయా భవనాల వద్దకు వెళ్లి వీడియోలు, ఫొటోల ద్వారా వివరించడం జరిగింది.హౌస్ అరెస్టులు, అక్రమ కేసులతో అడ్డుకోవాలని ఎంత ప్రయత్నించినా అడ్డంకులన్నీ దాటుకుని వైయస్సార్సీపీ నాయకులతో పాటు విద్యార్థులు, సామాన్య ప్రజలు ఈ ఆందోళన కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంపైనే చర్చ జరుగుతోంది. కూటమి ప్రభుత్వ నిర్ణయంపై యవతలో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. సోషల్ మీడియాలో సైతం స్వచ్ఛందంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలని వైయస్సార్సీపీ చేస్తున్న ఆందోళనలకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. ప్రైవేటీకరణ జీవోను వెనక్కి తీసుకోవాలివైఎస్సార్సీపీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తారనే భయంతో ఎక్కడికక్కడ నాయకులను హౌస్ అరెస్టులు చేసినా, అరెస్టులు, కేసుల పేరుతో భయపెట్టినా వైఎస్సార్సీపీ శ్రేణులు వెనకడుగు వేయలేదు. పల్నాడు జిల్లా పరిధిలో నిరసన కార్యక్రమాన్ని ఎలాగైనా అడ్డుకుని తీరాలన్న లక్ష్యంతో ప్రత్యేక దృష్టి పెట్టారు. నిరసన కార్యక్రమానికి వెళ్లకుండా నన్ను హౌస్ అరెస్టు చేశారు.మా నాయకులు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డిని పక్క రాష్ట్రం మిర్యాలగూడలో అడ్డుకుని కార్యక్రమంలో పాల్గొనకుండా చూశారు. పోలీసులను ప్రయోగించి అక్కడక్కడా వైయస్సార్సీపీ నాయకులను అడ్డుకుని ఉండొచ్చేమో కానీ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేదాకా వైఎస్సార్సీపీ పోరాటం ఆపడం జరగదని స్పష్టంగా చెబుతున్నాము. ఎంత ఆపుదామని ప్రయత్నిస్తే అంతగా రెట్టింపు ఉత్సాహంతో వైయస్సార్సీపీ పోరాడుతుంది. ప్రైవేటీకరణ పేరుతో ఇచ్చిన జీవోను తక్షణం వెనక్కి తీసుకోవాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వం మేల్కొనేదాకా మా పోరాటం ఆగదు. -
Kurnool: విద్య, వైద్యాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం పట్ల ఆగ్రహం
-
Vidadala: కూటమి ప్రభుత్వం వల్ల సర్కార్ వైద్యం ప్రజలకు దూరమవుతుంది
-
Perni Nani: పీపీపీ పేరుతో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి మెడికల్ కాలేజీలు
-
ప్రభుత్వం దిగి వచ్చేవరకు ఆందోళనలు ఆగవని YSRCP హెచ్చరిక
-
రూ.6 వేల కోట్లు ఇవ్వడానికి చేతులు పడిపోయినాయా బాబూ..
-
ఎవరి సొమ్ము.. ఎవరి సొత్తు.. బాబును రఫ్ఫాడించిన పేర్ని కిట్టు
-
భయపడ్డ చంద్రబాబు.. ఇంత మంది పోలీసులా..
-
KSR Live Show: ప్రభుత్వ మెడికల్ కాలేజీల చరిత్రలో చీకటి రోజు
-
మెడికల్ కాలేజీలు పేదల కోసం.. బినామీలకు ఇస్తానంటే ఊరుకోము
-
Watch Live: ఛలో మెడికల్ కాలేజ్
-
17 మెడికల్ కాలేజీల వద్ద నేడు YSRCP పోరుబాట
-
YSRCP: పోలీసుల అడ్డంకులు దాటుకుని ఛలో మెడికల్ కాలేజీ
సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్న చంద్రబాబు సర్కార్ నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఇవాళ ఆందోళన కార్యక్రమానికి పిలుపు ఇచ్చింది. ఛలో మెడికల్ కాలేజీ పేరిట.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మెడికల్ కాలేజీల ఎదుట ధర్నా నిర్వహించబోంది. అయితే ఈ ధర్నాను అడ్డుకునేందుకు వైఎస్సార్సీపీ నేతలపైకి కూటమి ప్రభుత్వం పోలీసులను ప్రయోగిస్తోంది.చంద్రబాబు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన ఒక్క మెడికల్ కాలేజ్ కూడా కట్టలేదువైఎస్ జగన్‌కి మంచి పేరు వస్తుందని ప్రైవేట్‌కు అప్పగించాలని నిర్ణయించడం దారుణంప్రైవేటైజేషన్ విధానాన్ని తీవ్రంగా విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు వ్యతిరేకించాయిప్రభుత్వ మెడికల్ కాలేజీలు పూర్తయితే జగన్‌కు మంచి పేరు వస్తుందని తట్టుకోలేకపోతున్నారుకూటమి నేతలు తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా?చంద్రబాబు మంత్రులు నాతో వస్తే మెడికల్ కాలేజీ పరిస్థితి ఏంటో చూపిస్తావిజనరీ నాయకుడు అని చెప్పుకునే చంద్రబాబు 5వేల కోట్లు మెడికల్ కాలేజీలకు ఇవ్వలేరా?చంద్రబాబు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో చరిత్ర హీనుడిగా మిగిలిపోతున్నాడుఅనిత ఇంఛార్జ్‌గా ఉన్న విజయనగరం, పాడేరు, నర్సీపట్నం కాలేజీలు నాతో అనిత వస్తే చూపిస్తాను15నెలల్లో మెడికల్ కాలేజీకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదుమంత్రి సవిత మెడికల్ కాలేజేల వద్ద కామెడి స్కిట్స్ చేస్తున్నారుబీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి రూ. 50 కోట్లు కూడా విడుదల చేయించుకోలేకపోయారు.చంద్రబాబు కూటమి ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం మెడికల్ కాలేజీల్ని ప్రైవేటుపరం చేస్తుంది.- వరదు కళ్యాణి పార్వతీపురం మన్యం జిల్లారాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం దుర్మార్గ చర్యఆరోగ్య శ్రీ తొలగిస్తామంటే పేదలకు అందని ద్రాక్షాలా వైద్యం వైఎస్ జగన్ ప్రజారోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చారు:మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర కామెంట్స్పల్నాడు జిల్లా:ఛలో మెడికల్ కాలేజీ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాదు నుంచి పిడుగురాళ్ల వస్తున్న మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని మిర్యాలగూడలో అరెస్ట్ చేసిన ఆంధ్ర పోలీసులుపక్క రాష్ట్రానికి వచ్చి మరి పోలీసులు అక్రమ అరెస్టు చేస్తున్నారుఎన్నికల సమయంలో సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో కట్టిన మెడికల్ కాలేజీలను అమ్మేసుకుంటున్నాడుచంద్రబాబు అనుచరులకు చెంచా గాళ్ళకు మెడికల్ కాలేజీలు కట్ట పెట్టాలని చూస్తున్నారుమెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రభుత్వం వెనక్కి తీసుకునే అంతవరకు మా పోరాటం ఆగదుప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టిన న్యాయ పోరాటం చేస్తాం-కాసు మహేష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే బాపట్లచంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీ లను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న వైఎస్సార్సీపీవైఎస్సార్సీపీ విద్యార్థి,యువజన విభాగం ఆధ్వర్యంలో ఛలో మెడికల్ కాలేజీ కార్యక్రమంకార్యక్రమంలో పాల్గొన్న బాపట్ల జిల్లా అధ్యక్షుడు మెరుగు నాగార్జున, అద్దంకి సమన్వయకర్త చింతలపూడి అశోక్ కుమార్, పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త గాదే మధుసూదన్ రెడ్డి, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్ బాబు.పార్వతీపురం మన్యం జిల్లాప్రజలకు సంబంధించిన ఆస్తి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి. దీనిని ప్రైవేట్ చేస్తుంటే చూస్తూ ఊరుకోం.ఎస్టీ లకు సంబంధించిన జిల్లాలో కార్పొరేట్ స్థాయి ప్రభుత్వ ఆస్పత్రిని కబ్జా చేసి ప్రైవేట్‌కు అప్పగిస్తున్నారు.గిరిజన విద్యను ప్రైవేట్ చేయడంని గిరిజన మంత్రి స్పందించరా.కొండపల్లి శ్రీనివాస్ ఎలా మంత్రివి అయ్యావుజగన్ తీసుకొచ్చిన కాలేజీలను కేంద్రం తెచ్చింది అని అబద్ధాలు చెప్తావు.స్టేట్ ఫండ్, నాబార్డ్ ఫండ్ గురుంచి తెలియకుండా ఎలా మాట్లాడుతారు.మంత్రి పదవులు కాపాడుకోవడానికి ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారు.చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముడు పోయారు.ప్రైవేటీకరణ జిఓలను ఉపసంహరించుకోవాలి.లేదంటే మరింత పోరాటం చేస్తాం -మాజీ మంత్రి సీదిరి అప్పల రాజు ప్రకాశంచంద్రబాబుకి పేదలంటే అసహ్యంఅందుకే వైద్యం విద్య దూరం చేస్తున్నాడుమార్కాపురం కాలేజీ పూర్తి కాలేదు అంటున్న. కూటమి నాయకులు కళ్లు తెరుచుకొని చూడాలిఅమరావతి మీద ఉన్న శ్రద్ద మెడికల్ కాలేజీల మీదలేదుఅమరావతి కొంతమందికి మాత్రమే ఉపయోగపడుతుందిమెడికల్ కాలేజీ అందరికీ ఉపయోగపడుతుంది - మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు కామెంట్స్కూటమి నేతలు కళ్లున్న కబోదిల్లా వ్యవహరిస్తున్నారుమార్కాపురం మెడికల్ కాలేజీ పూర్తి అయినా కాలేదో తెలుస్తుందిపదహారు సంవత్సరాలు పరిపాలించిన తెలుగుదేశం నేతలకు వెనకబడిన ప్రాంతం కనపడలేదుపేదవాళ్ల ఉసురు చంద్రబాబుకి తప్పదుకూటమి నేతలు కృరమృగాలులా ప్రవర్తిస్తున్నారు..ఎవడబ్బ సొత్తు అని ప్రయివేటు పరం చేస్తావ్ఒక్కొక్క మెడికల్ కాలేజీకి మూడువందల కోట్లు ఖర్చుపెట్టలేని మీరు మీ విలాసాలకు మూడు హెలికాప్టర్స్ కావాలా?దోచుకోవడమే పనిగా పెట్టుకొని అన్నీ ప్రయివేటు పరం చేస్తున్నాడుఇంజన్ లేని ప్రభుత్వాన్ని నడుపుతూ మట్టి నుండి ఆకాశం వరకూ దోచుకుంటున్నారు-యర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ నంద్యాల జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణకు నిరసనగా ఛలో మెడికల్ కాలేజీకి పిలుపునిచ్చిన వైఎస్సార్సీపీఛలో మెడికల్ కాలేజ్ కార్యక్రమానికి అడుగడుగున ఆంక్షలు విధించిన పోలీసులు30 పోలిస్ యాక్ట్ అమలులో ఉందంటూ వైఎస్సార్సీపీ శ్రేణులను అడ్డుకున్న పోలీసులుప్రైవేటీకరణ దారుణమంటూ ఆందోళనకు వచ్చిన వారిని బలవంతంగా పోలీసుల జీపుల్లో , లారీల్లో ఎక్కించి పోలీస్ స్టేషన్లకు తరలింపుమెడికల్ కళాశాలలే కట్టలేదు అని చెప్పే కూటమి ప్రభుత్వానికి ఎందుకు అంత భయంఅరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరంటూ హెచ్చరించిన వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగంవైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సురేష్,సర్పంచ్ సుజిత్‌తో పాటు, మహిళలను, విద్యార్థులను,వైఎస్సార్సీపీ నాయకులను అరెస్టు చేసిన పోలీసులుమడకశిర సమన్వయకర్త ఈరలక్కప్ప, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిపార్వతీపురం మన్యం జిల్లా:రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం దుర్మార్గ చర్యఆరోగ్య శ్రీ తొలగిస్తామంటే పేదలకు అందని ద్రాక్షాలా వైద్యం వైఎస్ జగన్ ప్రజారోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చారు:మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర పల్నాడు జిల్లా:ఛలో మెడికల్ కాలేజీ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాదు నుంచి పిడుగురాళ్ల వస్తున్న మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని మిర్యాలగూడలో అరెస్ట్ చేసిన ఆంధ్ర పోలీసులుపక్క రాష్ట్రానికి వచ్చి మరి పోలీసులు అక్రమ అరెస్టు చేస్తున్నారుఎన్నికల సమయంలో సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో కట్టిన మెడికల్ కాలేజీలను అమ్మేసుకుంటున్నాడుచంద్రబాబు అనుచరులకు చెంచా గాళ్ళకు మెడికల్ కాలేజీలు కట్ట పెట్టాలని చూస్తున్నారుమెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రభుత్వం వెనక్కి తీసుకునే అంతవరకు మా పోరాటం ఆగదుప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టిన న్యాయ పోరాటం చేస్తాం-కాసు మహేష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే బాపట్ల:చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీ లను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న వైఎస్సార్సీపీవైఎస్సార్సీపీ విద్యార్థి,యువజన విభాగం ఆధ్వర్యంలో ఛలో మెడికల్ కాలేజీ కార్యక్రమంకార్యక్రమంలో పాల్గొన్న బాపట్ల జిల్లా అధ్యక్షుడు మెరుగు నాగార్జున, అద్దంకి సమన్వయకర్త చింతలపూడి అశోక్ కుమార్, పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త గాదే మధుసూదన్ రెడ్డి, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్ బాబు.పార్వతీపురం మన్యం జిల్లాప్రజలకు సంబంధించిన ఆస్తి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి. దీనిని ప్రైవేట్ చేస్తుంటే చూస్తూ ఊరుకోం.ఎస్టీ లకు సంబంధించిన జిల్లాలో కార్పొరేట్ స్థాయి ప్రభుత్వ ఆస్పత్రిని కబ్జా చేసి ప్రైవేట్‌కు అప్పగిస్తున్నారు.గిరిజన విద్యను ప్రైవేట్ చేయడంని గిరిజన మంత్రి స్పందించరా.కొండపల్లి శ్రీనివాస్ ఎలా మంత్రివి అయ్యావుజగన్ తీసుకొచ్చిన కాలేజీలను కేంద్రం తెచ్చింది అని అబద్ధాలు చెప్తావు.స్టేట్ ఫండ్, నాబార్డ్ ఫండ్ గురుంచి తెలియకుండా ఎలా మాట్లాడుతారు.మంత్రి పదవులు కాపాడుకోవడానికి ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారు.చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముడు పోయారు.ప్రైవేటీకరణ జిఓలను ఉపసంహరించుకోవాలి.లేదంటే మరింత పోరాటం చేస్తాం-మాజీ మంత్రి సీదిరి అప్పల రాజు అన్నమయ్యమదనపల్లి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఎదుట వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసనప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రవేతీకరణకు నిరసనగా వైఎస్సార్సీపీ ఛలో మెడికల్ కాలేజీకి పిలుపు రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ రెడ్డి,తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాథ్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే లు శ్రీకాంత్ రెడ్డి, తిప్పారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి, తిరుపతి వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడు హరిప్రసాద్ రెడ్డి , మదనపల్లి మున్సిపల్ చైర్మన్ మనోజ రెడ్డి, షమీం అష్లాంఏలూరు జిల్లాకూటమి ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయడానికి నిరసిస్తూ..వైఎస్సార్సీపీ ఛలో మెడికల్ కాలేజ్ నిరసనకు పిలుపుఏలూరులో వైఎస్సార్సీపీ నేతల నిరసనను అడ్డుకున్న పోలీసులుజిల్లా పార్టీ కార్యాలయం నుండి మెడికల్ కాలేజీకి వెళ్తుండగా నిలిపివేసిన పోలీసులురోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న వైఎస్సార్సీపీ శ్రేణులునిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఏలూరు పార్లమెంట్ కన్వీనర్ కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరావు, పీఏసీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసు బాబు, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఏలూరు ఇంచార్జ్ జయప్రకాష్, చింతలపూడి సమన్వయకర్త కంభం విజయరాజు, వైఎస్సార్సీపీ శ్రేణులుశ్రీ సత్యసాయి జిల్లా:పెనుకొండ మెడికల్ కాలేజీ ని పరిశీలించిన మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్, మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, జక్కంపూడి రాజా, హిందూపురం సమన్వయకర్త దీపిక, కదిరి సమన్వయకర్త మక్బూల్, అనంతపురం జెడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ, మేయర్ మహమ్మద్ వాసీంవైఎస్సార్ జిల్లా:పులివెందుల మెడికల్ కాలేజీ వద్ద నిరసన తెలుపుతున్న వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగపు నాయకులుఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరైన విద్యార్థులు మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నడపాలని,పీపీపీ పద్ధతిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్పేదలకు వైద్య విద్యా, వైద్యాన్ని దూరం చేసేందుకు పీపీపీ పద్ధతిని ప్రభుత్వం అనుసరిస్తుందిడౌన్ డౌన్ సీఎం వుయ్ వాంట్ జస్టిస్ అనే నినాదాలు చేస్తూ మెడికల్ కాలేజ్ వద్ద నిరసననల్గొండ జిల్లామిర్యాలగూడ వద్ద గురజాల మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులుగుంటూరులో మెడికల్ కాలేజీ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యేకర్నూలు జిల్లా...ఆదోని మెడికల్ కాలేజ్ ప్రవేటికరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ విద్యార్థి,యువజన విభాగం ఆధ్వర్యంలో ఛలో మెడికల్ కాలేజ్ అంటూ నిరసన ర్యాలీ నిర్వహించిన వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన సంఘం నాయకులుమెడికల్ కాలేజ్ ప్రవేటికరణకు వ్యతిరేకిస్తూ నినాదాలు చేస్తు విద్యార్థులు,వైఎస్సార్సీపీ నాయకులు చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై మండిపడుతున్న విద్యార్థులు, విద్యార్ది సంఘాలుప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనుక తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్న విద్యార్దులుఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ బుట్టారేణుకా , మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి,రాష్ట్ర నాయకురాలు ఎస్వీ విజయమనోహరి,విద్యార్ది ,యువజన నాయకులు విశాఖ :జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద aisf ధర్నా..మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్..విద్యారంగంలో సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు..మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలి..ఆపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తాం..మంత్రి లోకేష్ విద్యా రంగంలోని సమస్యలను గాలికి వదిలేసారు..యువగళం పాదయాత్రలో లోకేష్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి..లోకేష్‌కి చేతనైతే మెడికల్ కాలేజీలు పూర్తి చేసి ప్రభుత్వ రంగంలో నడపాలి..లేనిపక్షంలో చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చెయ్యాలి.. అనకాపల్లి నర్సీపట్నంనర్సీపట్నం ఛలో మెడికల్ కాలేజీపై పోలీసుల ఆంక్షలునర్సీపట్నం మెడికల్ కాలేజీ సందర్శించకుండా భారీ కేడ్లు ఏర్పాటుమెడికల్ కాలేజీకి వస్తున్న వైఎస్సార్సీపీ శ్రేణులను అడ్డుకుంటున్న వైనంఛలో మెడికల్ కాలేజీకి అనుమతి లేదంటున్న పోలీసులు..పోలీసులు తీరుపై మండిపడుతున్న వైఎస్సార్సీపీ శ్రేణులు..మచిలీపట్నంలో అడుగడుగునా పోలీసుల ఆంక్షలుఛలో మెడికల్ కాలేజీ నిరసనకు వెళ్లకుండా వైఎస్సార్సీపీ నేతలు,శ్రేణులపై ఆంక్షలుమచిలీపట్నం మూడు స్తంభాల సెంటర్లో వైఎస్సార్సీపీ నేతలు దేవినేని అవినాష్ , మొండితోక జగన్మోహన్ రావు , దేవభక్తుని చక్రవర్తి , వైఎస్సార్సీపీ విద్యార్ధి విభాగం నేతలను అడ్డుకున్న పోలీసులుతమ వాహనాలను అడ్డుకోవడంతో వాహనాలను అక్కడే వదిలేసి నడుచుకుంటూ వెళ్తున్న వైఎస్సార్సీపీ నేతలుతూర్పుగోదావరి జిల్లా...ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ రోడ్డుపై బైఠాయించిన మాజీ ఎంపీ భరత్, వైఎస్ఆర్సీపీ శ్రేణులుమార్గాన్ని భరత్‌ను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులుతూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రిలో వైఎస్సార్సీపీ తలపెట్టిన ఛలో మెడికల్ కాలేజ్ కార్యక్రమంమాజీ మంత్రి వేణుగోపాల కృష్ణ,జక్కంపూడి గణేష్ మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు గూడూరు శ్రీనివాసులను అడ్డుకున్న పోలీసులు జక్కంపూడి రాజా ఇంటి వద్ద బైఠాయించిన నేతలు ప్రభుత్వం చేస్తున్న ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నినాదాలు చంద్రబాబు ఎంత దుర్మార్గుడు అంటే మెడికల్ కాలేజీ సీటు కోటి రూపాయల పైన పలుకుతోందిఒక డాక్టర్ బయటకు రావాలంటే కనీసం ఐదు కోట్లు ఖర్చు అవుతోందిఇంత ఖర్చుతో పేద, మధ్య తరగతి విద్యార్థులు చదవగలరా?అందుకే జగన్ 17 మెడికల్ కాలేజీలు తెచ్చారుఅలాంటి కాలేజీలను ప్రైవేటీకరణతో చంద్రబాబు పేదల ఆశలను నీరు గార్చారుమెడికల్ సీట్లు వద్దంటూ లేఖ రాసిన వ్యక్తి చంద్రబాబుమెడికల్ కాలేజీలను తిరిగి ప్రభుత్వ పరంచేసే వరకు ఆందోళనలు చేస్తాం - శివరామిరెడ్డి, ఎమ్మెల్సీపెత్తందార్ల చేతిలో చంద్రబాబు మెడికల్ కాలేజీలను పెడుతున్నారు వైఎస్సార్ కుటుంబం పేదల కోసం పాటు పడిందివైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్య శ్రీ పేరుతో ఉచిత వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చారువైఎస్ జగన్ మెడికల్ కాలేజీలతో సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చారుఅలాంటి వాటిని ప్రైవేటీకరణ సరికాదుపెత్తందార్ల చేతిలో చంద్రబాబు మెడికల్ కాలేజీలను పెడుతున్నారుపేదల ఆరోగ్యాన్ని గాలికి వదిలేయటం సబబు కాదుపీపీపీ విధానాన్ని వెనక్కు తీసుకునే వరకు పోరాటం చేస్తాం -బొమ్ము ఇజ్రాయిల్, ఎమ్మెల్సీచంద్రబాబు పేదల మీద కక్ష కట్టారుఅందుకే మెడికల్ కాలేజీలను ప్రయివేటీకరణ చేస్తున్నారుదీన్ని మేము వ్యతిరేకిస్తున్నాంప్రభుత్వ మెడలు వంచేదాకా పోరాటం చేస్తాం- సిపాయి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్సీ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను యధావిధిగా కొనసాగించాలి.మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తే సహించేది లేదుచంద్రబాబు ఆలోచన స్వార్ధ పూరితమైనది.చంద్రబాబు ప్రభుత్వం వారి బినామీలకు మేలు చేసే ప్రయత్నం చేస్తోంది.తమ సొంత జేబులు నింపుకునే ప్రయత్నం చేయడం సరికాదు.ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం చేస్తాం.వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక మళ్ళీ మెడికల్ కాలేజీలను ప్రభుత్వ అధీనంలోకి తీసుకువస్తాం -విక్రాంత్, ఎమ్మెల్సీ విడుదల రజినిని అడ్డుకున్న పోలీసులుచిలకలూరిపేటలో మాజీ మంత్రి విడుదల రజిని ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపుచలో మెడికల్ కాలేజీ కార్యక్రమంలో భాగంగా పిడుగురాళ్ల మెడికల్ కాలేజీకి బయలుదేరిన మాజీ మంత్రి విడదల రజినిఅడ్డుకున్న పోలీసులుమాజీ మంత్రి అంబటి రాంబాబుకు నోటీసులు ఏపీలో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఛలో మెడికల్ కాలేజీగుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయం లో విద్యార్థి ,యువజన విభాగాల కార్యకర్తలుపిడుగురాళ్ల, బాపట్ల మెడికల్ కాలేజీలకు ర్యాలీగా బయలుదేరిన విద్యార్థి యువజన విభాగాల కార్యకర్తలుఛలో మెడికల్ కాలేజీ కార్యక్రమానికి వెళ్ళకూడదు అంటూ అంబటి రాంబాబుకు నోటీసులుపల్నాడులో మాజీ మంత్రి విడదల రజిని, ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నంబూరు శంకర్రావు ఇళ్ల దగ్గర పోలీసుల మోహరింపుపిడుగురాళ్ల మెడికల్ కాలేజీ కాంపౌండ్‌లోకి వైఎస్సార్సీపీ శ్రేణుల్ని వెళ్లనివ్వకుండా బారికేడ్లు ఏర్పాటుఇంత నీచంగా దుర్మార్గంగా ఏ ప్రభుత్వం ఆలోచించలేదుప్రజారోగ్యానికి వ్యతిరేకమైన ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాందోపిడీ, అవినీతి కోసం ఈ విధానాన్ని తీసుకువస్తున్నారుఇప్పటికే పార్టీ తరఫున పోరాటం చేస్తున్నాంగతంలో ఏ ప్రభుత్వం ఇలా ఆలోచించలేదుప్రజలు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు, వైద్యశాలలు రావాలని కోరుకుంటారుఇంత నీచంగా దుర్మార్గంగా ఏ ప్రభుత్వం ఆలోచించలేదుప్రభుత్వ మెడికల్ కళాశాల, ఆస్పత్రులను దోచుకోవాలని నీచమైన ఆలోచన రావటం దురదృష్టకరంఈ విషయంలో ఎంతవరకైనా పోరాటం చేస్తాంకళ్ళుండి చూడలేకపోతున్న కూటమి ప్రభుత్వంఇప్పటివరకు అమరావతి లో ఏం చేశారు.. ఎంత ఖర్చు పెట్టారు..మేం ఎంత ఖర్చు చేశామో వాళ్ళే చెప్తున్నారుపీపీ అంటే దోపిడీ నా.. పేదలకు ఆరోగ్యం దొరుకుతుందా..ఎవరు చెప్పారు ఇది.. ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారు..చేతకాకపోతే ఏదీ కాదు..ప్రజల కోసం ఏమైనా చేయాలనే తపన ఉండాలి..- శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ చరిత్ర హీనుడిగా చంద్రబాబు..చంద్రబాబు నిర్ణయం ప్రజల ఆరోగ్య భద్రతకు ముప్పుపేదలకు వైద్య విద్య దూరం చేసే కుట్రలుమూడుసార్లు సీఎంగా చేసిన వ్యక్తి ఒక్క మెడికల్ కాలేజీ అయినా తెచ్చారా?జగన్ చరిత్ర సృష్టిస్తే.. బాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోయారు:::ఎమ్మెల్సీ వరుదు కల్యాణి పేదవాడిపై బాబు సర్కార్ కక్ష కట్టిందిపేదవాడికి న్యాయం చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదుఛలో మెడికల్ కాలేజీ కార్యక్రమంపై ఆంక్షలు విధించారుబాబు హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ అయినా తెచ్చాడా?::: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అల్లూరి జిల్లా.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నేడు చలో మెడికల్ కాలేజీ కు వైయస్సార్సీపి పిలుపు.పాడేరు మెడికల్ కాలేజీను కాసేపట్లో సందర్శించనున్న వైయస్సార్సీపీ నేతలు..పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా పాడేరు మెడికల్ కాలేజీకి వైఎస్సార్సీపీ నాయకులు.500 కోట్లతో 35 ఎకరాల్లో వైయస్ జగన్ హయాంలో మెడికల్ కాలేజీ నిర్మాణం ప్రారంభం.ఇప్పటికే ప్రారంభమైన మెడికల్ కాలేజీ తరగతులు..చంద్రబాబు నిర్లక్ష్యం వలన 150 ఎంబీబీఎస్ సీట్లు, 50 సీట్లకు కుదింపువైయస్ జగన్ పాలనలో 70 శాతానికి పైగా పూర్తయిన మెడికల్ కాలేజీ నిర్మాణంకూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నత్త నడకన మెడికల్ కాలేజీ నిర్మాణ పనులుతూర్పుగోదావరి జిల్లా..వైఎస్సార్సీపీ తలపెట్టిన ఛలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కార్యక్రమానికి అడ్డంకులు సృష్టిస్తున్న ప్రభుత్వంవైఎస్సార్సీపీ నేతల ఇళ్ళ వద్ద పోలీస్ కాపలానేతలను హౌస్ చేసిన పోలీసులు.. నోటీసులు అందజేతమాజీ ఎంపీ మార్గాన్ని భరత్, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇళ్ల వద్ద భారీగా పోలీసుల మోహరింపుఅమరావతిమెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వాయిదా తీర్మానంశాసన మండలిలో వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానంమెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై చర్చించాలని తీర్మానంమరోవైపు.. వైఎస్సార్సీపీ ఛలో మెడికల్ కాలేజీ నిర్వహణఅనంతపురం జిల్లా..మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పై నిరసన జ్వాలలునేడు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చలో మెడికల్ కాలేజీశ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మెడికల్ కాలేజీ వద్ద కార్యక్రమంపెద్దసంఖ్యలో తరలివస్తున్న విద్యార్థులు, యువకులుచంద్రబాబు కు వ్యతిరేకంగా నినాదాలుహాజరుకానున్న వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, వైఎస్సార్ సీపీ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు.. మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్, అనంతపురం జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డిప్రకాశం జిల్లా ..మార్కాపురం లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీను ప్రవేటికరణ చేయడం పై నిరసన తెలుపునున్నా వైయస్సార్సీపీ నాయకులుఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అనుమతి లేదని ముందస్తు నోటీసులు జారీ చేసిన మార్కాపురం పోలీసులుచీమకుర్తిలోని బూచేపల్లి నివాసంలో దర్శి ఎమ్మెల్యే, జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షుడు బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డికి నోటీసులు ఇచ్చిన చీమకుర్తి ఎస్ఐ కృష్ణయ్యతూర్పుగోదావరి జిల్లా.ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ వైసీపీ ఛలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ ఆధ్వర్యంలో క్వారీ సెంటర్ నుండి మెడికల్ కాలేజ్ వరకు శాంతియుత ర్యాలీకర్నూలు జిల్లా ..ఛలో మెడికల్ కాలేజ్ కార్యక్రమాన్ని అడుగడుగున అడ్డుకుంటున్న పోలీసులు,మెడికల్ కాలేజ్ ప్రవేటికరణ చేసిన చంద్రబాబు తీరు మార్చుకోవాలని అన్ని మెడికల్ కాలేజ్ ల వద్ద శాంతియుత నిరసనకు వైఎస్ఆర్సీపీ పార్టీ పిలుపు,శాంతియుత నిరసన తెలపడానికి నంద్యాల మెడికల్ కాలేజ్ కి వెళ్తున్న రాష్ట్ర యువజన విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి ని కర్నూలులోని ఆయన నివాసం నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు,ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లను ప్రవేటికరణ కార్యకమాన్ని శాంతి యుతంగా చేస్తాం అంటే మీరు ఎలా అడ్డుకుంటారని పోలీసులను ప్రశించిన బైరెడ్డి సిద్దార్థ రెడ్డి,సిద్ధార్థ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడంతో ఆయన ఇంటి వద్దకి చేరుకుంటున్న వైసీపీ శ్రేణులు,సిద్దార్థ రెడ్డి ఇంటి వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు...డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా...అమలాపురం ప్రభుత్వ మెడికల్ కళాశాల వద్ద వైఎస్సార్సీపీ నిరసన కార్యక్రమంహాజరుకానున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా, నేతలు, కార్యకర్తలుగత వైఎస్సార్సీపీ హయాంలో పేద, మధ్య తరగతి ప్రజల మేలు కోసం 17 మెడికల్ కాలేజీలకు అనుమతి తీసుకొచ్చారు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి. తద్వారా అతి తక్కువ ఖర్చుకే సూపర్ స్పెషాలిటీ వైద్యం అందాలని ఆయన ఆశించారు. ఈ క్రమంలో కొన్ని కాలేజీల్లో తరగతులూ ప్రారంభం అయ్యాయి కూడా. అయితే.. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక నిర్మాణంలో ఉన్న కాలేజీలనూ పట్టించుకోలేదు. పైగా.. ఇప్పుడు పీపీపీ పేరుతో లక్షన్నర కోట్ల రూపాయల విలువ చేసే కాలేజీలను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతున్నారు. ఈ క్రమంలో మంత్రులతో తప్పుడు ప్రచారం సైతం చేయించారు. మెడికల్ కాలేజీలను తన బినామీలకు దోచి పెడుతున్న చంద్రబాబు చర్యలను నిరసిస్తూ వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపు ఇచ్చింది. పార్టీ యువత, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో ధర్నాలు చేపట్టబోతోంది. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత దాకా ఆందోళనలు కొనసాగుతాయని హెచ్చరిస్తోంది కూడా.తాడేపల్లి.ఈనెల 19న వైయస్సార్సీపీ ‘ఛలో మెడికల్ కాలేజీ’పార్టీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో కార్యక్రమంతాడేపల్లి:తమ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన 10 కొత్త మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈనెల 19న ‘ఛలో మెడికల్ కాలేజీ’… pic.twitter.com/kE5cjf0dqE— YSR Congress Party (@YSRCParty) September 18, 2025


