సాక్షి, అమరావతి : మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం 89వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. ‘భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవితం కోట్లాదిమందికి స్ఫూర్తిదాయకం. మిస్సైల్ మ్యాన్‌గా, ప్రజల ప్రెసిడెంట్‌గా గుర్తింపు తెచ్చుకున్న అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తున్నాను అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.
Bharat Ratna Dr. APJ Abdul Kalam's story of persistence, ability, and sheer courage is a guiding light to millions who dare to dream and work towards its fulfillment. My humble tributes to the 'People's President', the legendary Missile Man on his birth anniversary.
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 15, 2020
దేశానికి ఎనలేని సేవ చేశారు : మోదీ
అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. ఒక శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా దేశానికి ఆయన చేసిన ఎనలేని సేవ చేశారని కొనియాడారు. ఆయన జీవితం కోట్లమందికి స్ఫూర్తిదాయకం అన్నారు. ఈమేరకు ఓ అబ్దుల్ కలాంకు సంబంధించిన ఓ వీడియోను షేర్ చేస్తూ ట్వీట్ చేశారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా అబ్దల్ కలాంకు నివాళులర్పించారు. ‘డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఒక విజనరీ లీడర్, దేశ ఖ్యాతిని అంతరిక్షం వరకూ తీసుకువెళ్లారు. ఆయన నిరంతరం ఆత్మనిర్భర్ భారత్ కోసం తపించేవారు. విద్య, శాస్త్ర రంగాల్లో కలాం సేవలు నిరుపమానం. ప్రేరణదాయకం’ అని ట్వీట్ చేశారు.
Tributes to Dr. Kalam on his Jayanti. India can never forget his indelible contribution towards national development, be it as a scientist and as the President of India. His life journey gives strength to millions. pic.twitter.com/5Evv2NVax9
— Narendra Modi (@narendramodi) October 15, 2020
Comments
Please login to add a commentAdd a comment