న్యూఢిల్లీ: రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఉరిశిక్షను జీవితఖైదుగా మార్చాలంటూ కలాం ముందుకు 21 క్షమాభిక్ష పిటిషన్లు రాగా ఆయన ఒకదానిపైనే నిర్ణయం వెలువరించారు. దీనిపై విమర్శలొచ్చినా లెక్కచేయలేదు. ఆయన ఉరిశిక్షకు వ్యతిరేకం. ఉరిపై లా కమిషన్ తన అభిప్రాయం కోరగా ఆయన మరణదండనను ఎత్తేయాలన్నారు. రాష్ట్రపతిగా క్షమాభిక్ష పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడం క్షోభకు గురిచేసిందన్నారు.
పెండింగ్‌లోని న్ని కేసులూ సామాజిక, ఆర్థిక పక్షపాతంతో కూడుకున్నవే తప్పితే, దోషులకు ప్రతీకారేచ్ఛ ఉన్నట్లు కనపడలేదన్నారు. ఉద్దేశపూర్వకంగా నేరం చేయని వారిని ఎక్కిస్తున్నామనే భావన కలిగిందన్నారు. 1990లో ఓ యువతిని బెంగాల్‌లో అపార్ట్‌మెంట్‌లోని లిఫ్ట్‌బాయ్ ధనుంజయ్ ఛటర్జీ రేప్ చేసి హత్య చేశాడు. ఈ కేసులో మాత్రం ఆయన ఛటర్జీ క్షమాభిక్ష పిటిషన్‌ను తోసిపుచ్చారు.
ఉరిశిక్షకు వ్యతిరేకం
Published Wed, Jul 29 2015 1:29 AM | Last Updated on Tue, Oct 30 2018 7:45 PM
Advertisement
Advertisement