అబ్దుల్‌ కలాంకు సీఎం జగన్‌ నివాళి | AP CM Jagan Tribute To APJ Abdul Kalam On His Death Anniversary | Sakshi
Sakshi News home page

అబ్దుల్‌ కలాంకు సీఎం జగన్‌ నివాళి

Published Tue, Jul 27 2021 2:31 PM | Last Updated on Tue, Jul 27 2021 6:29 PM

AP CM Jagan Tribute To APJ Abdul Kalam On His Death Anniversary - Sakshi

సాక్షి, అమరావతి: నేడు దివంగత రాష్ట్రపతి, డాక్టర్‌ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ యావత్‌ భారత్‌  ఘన నివాళులు అర్పిస్తోంది. ఏపీజే అబ్దుల్‌ కలాం 6వ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆయనను స్మరించుకున్నారు. ఈ మేరకు ట్విటర్‌లో స్పందించారు.

అబ‍్దుల్‌ కలాం భారత్‌లోని అత్యంత ప్రఖ్యాతిగాంచిన వారిలో ఒకరని కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా ఆయనను ఎంతోమంది ఆరాధించారని గుర్తుచేసుకుంటూ హృదయపూర్వకంగా నివాళులు అర్పించారు. దేశానికి మాజీ రాష్ట్రపతి కలాం చేసిన కృషి వెలకట్టలేనిదని, ఆయన సేవలు చిరస్మరణీయమని  సీఎం జగన్‌ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement