మాజీ రాష్ట్రపతి, భారత ఆటమిక్ ఎనర్జీ సాధికారతకు విశేష కృషి చేసిన శాస్త్రవేత్త డా. ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహాన్ని కర్నూలు మెడికల్ కాలేజీలో ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డా. ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహాన్ని అవిష్కరించడం.. ఎంతో సంతోషంగా ఉందని బిశ్వభూషన్ హరిచందన్ అన్నారు.