అబ్దుల్‌కలాం మాటలను స్ఫూర్తిగా తీసుకోవాలి | we take sportive kalam speech | Sakshi
Sakshi News home page

అబ్దుల్‌కలాం మాటలను స్ఫూర్తిగా తీసుకోవాలి

Published Thu, Jul 28 2016 12:27 AM | Last Updated on Tue, Oct 30 2018 7:45 PM

అబ్దుల్‌కలాం మాటలను స్ఫూర్తిగా తీసుకోవాలి - Sakshi

అబ్దుల్‌కలాం మాటలను స్ఫూర్తిగా తీసుకోవాలి

రామన్నపేట
కలలు కనండి వాటిని సాకారం చేసుకోవాలని మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌కలాం చెప్పిన మాటలను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలని శ్రీహిందూ కళాశాలల చైర్మన్‌ డాక్టర్‌ పనకంటి భాస్కర్‌రావ్‌ తెలిపారు. ఏపీజే అబ్దుల్‌కలాం ప్రథమ వర్ధంతిని బుధవారం మండలకేంద్రంలోని శ్రీహిందూడిగ్రీ జూనియర్‌కళాశాలల్లో, క్రిష్ణవేణిహైస్కూల్లో ఘనంగా నిర్వహించారు.  చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తన మేధాశక్తితో దేశఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన ఘనత కలాంకు దక్కుతుందని చెప్పారు.  కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ టి.చంద్రశేఖర్, వైస్‌ప్రిన్సిపాల్‌ వి.దేవేందర్‌రావ్, సయ్యద్, సుధాకర్, నర్సింహ, శ్రీను, వెంకటేష్, మహేష్, ప్రభాకర్, జా‘నేశ్వరి, ముజాహిద్, మల్లికార్జున్, వెంకటేశ్వర్లు, మమత, శాంతి, క్రిష్ణవేణిహైస్కూలు ప్రధానోపాధ్యాయులు మణి, నరేందర్‌రెడ్డి, రమేష్, రాంబాబు, రశీద్, నరేష్‌లు పాల్గొన్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement