సాక్షి, అమరావతి: యువత కలలు కనాలి.. ఆ కలలను సాకారం చేసుకునేందుకు కష్టపడాలి.. అన్న కలాం మాటలు ఈ దేశానికి స్ఫూర్తి అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మేన్, భారతరత్న, ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా వారికి ఘన నివాళి అంటూ ట్వీట్ చేశారు.
వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ..
వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఏపీజే భారతరత్న అబ్దుల్ కలాం జయంతిని ఘనంగా నిర్వహించారు. కలాం చిత్రపటానికి వైఎస్సార్‌సీపీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఎమ్మెల్సీ, వైఎస్సార్‌పీపీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకుడు లేళ్ల అప్పిరెడ్డి, వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.మనోహరరెడ్డి, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు షేక్ ఆసిఫ్, కొమ్మూరి కనకారావుమాదిగ, అడపాశేషు, వెంకటనారాయణ, వైఎస్సార్‌సీపీ కృష్ణా జిల్లా డాక్టర్స్‌సెల్ అధ్యక్షుడు డాక్టర్ మహబూబ్ పాల్గొన్నారు.
అబ్దుల్ కలాం దేశానికి స్ఫూర్తిదాయకం
Published Sun, Oct 16 2022 3:41 AM | Last Updated on Sun, Oct 16 2022 3:41 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment