'డాకు మహారాజ్‌' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ రద్దు | Nandamuri Balakrishna Daku Maharaj Movie Pre Release Event Cancelled Due To This Reason, Know Details Inside | Sakshi
Sakshi News home page

'డాకు మహారాజ్‌' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ రద్దు

Published Thu, Jan 9 2025 9:48 AM | Last Updated on Thu, Jan 9 2025 12:28 PM

Daku Maharaj Pre Release Event Cancelled

నటుడు నందమూరి బాలకృష్ణ(Balakrishna) నటించిన ‘డాకు మహారాజ్‌’ (Daku Maharaj) చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (Pre Release) కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ మూవీ విడుదల కానుంది. ఈ క్రమంలో నేడు అనంతపురంలో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు ఏర్పాట్లు కూడా చేశారు. 

అయితే, శ్రీవారి దర్శనం కోసం వెళ్లిన భక్తులు తిరుపతిలో టోకెన్ల కేంద్రాల వద్ద తొక్కిసలాట జరగడంతో ఆరుగురు భక్తులు మరణించారు. ఇలాంటి విషాధ ఘటన సమయంలో సినిమా ఈవెంట్‌ను నిర్వహించడం సరైన నిర్ణయం కాదని చిత్ర యూనిట్‌ రద్దు చేసింది.

ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి
అనంత వేదికగా జనవరి 9న డాకు మహారాజ్‌ ప్రీరిలీజ్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ముందుగానే చిత్ర యూనిట్‌ ప్రకటించింది. ఈ మేరకు శ్రీనగర్‌కాలనీ అయ్యప్పస్వామి ఆలయ సమీపంలో ఖాళీ ప్రాంతంలో  ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్పటికే అక్కడ  ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఎస్పీ జగదీశ్‌ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమానికి ఐటీశాఖ మంత్రి లోకేశ్‌ ముఖ్య అతిథిగా హజరుకానున్నారని అధికారికంగా కూడ ప్రకటించారు. అయితే, తిరుపతిలో జరిగిన ఘటనతో ఈవెంట్‌ను రద్దు చేస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు.

మమ్మిల్ని తీవ్రంగా బాధించింది: డాకు మహారాజ్‌  మేకర్స్‌
తిరుపతిలో  జరిగిన విషా సంఘటన మమ్మిల్ని తీవ్రంగా బాధించింది.  మన కుటుంబాల సంప్రదాయాల్లో వెంకటేశ్వర స్వామి ఒక భాగం. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే భక్తులు దర్శనం కోసం వెళ్తారు. అక్కడ ఇలాంటి సంఘటన జరగడం హృదయ విదారకంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల దృష్ట్యా డాకు మహారాజ్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని అనుకున్న విధంగా కొనసాగించడం సరికాదని మేము భావిస్తున్నాము. బరువెక్కిన హృదయంతో దేవునిపై  ప్రజల్లో ఉన్న భక్తి, మనోభావాల పట్ల అత్యంత గౌరవంతో, మేము నేటి కార్యక్రమాన్ని విరమించుకోవాలని నిర్ణయించుకున్నాము.' అని వారు పేర్కొన్నారు.

(ఇదీ చదవండి: నా కుటుంబంపై తప్పుగా ప్రచారం చేస్తున్నారు: చాహల్‌ సతీమణి)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement