‘ఉద్యాన’ ప్రవేశాలకు రెండో దశ వెబ్‌ ఆప్షన్స్‌  | B.Sc Hearty Seats Recruitment Process | Sakshi
Sakshi News home page

‘ఉద్యాన’ ప్రవేశాలకు రెండో దశ వెబ్‌ ఆప్షన్స్‌ 

Published Thu, Oct 12 2023 5:48 AM | Last Updated on Thu, Oct 12 2023 6:06 AM

B.Sc Hearty Seats Recruitment Process - Sakshi

తాడేపల్లిగూడెం:  పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెంలోని డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని అనుబంధ, గుర్తింపు పొందిన కళాశాలల్లో బీఎస్సీ (హానర్సు) హార్టీకల్చర్‌ కోర్సుకు సంబంధించి మిగిలిన సీట్ల భర్తీకి ఈనెల 12, 13, 14 తేదీల్లో రెండోదశ వెబ్‌ ఆప్షన్స్‌ నమోదు చేసుకోవచ్చని వర్సిటీ రిజి­స్ట్రార్‌ బి.శ్రీనివాసులు బుధవారం తెలిపారు.

మొదటి కౌన్సెలింగ్‌ ద్వారా కాలేజీల్లో చేరిన విద్యార్థులు, ఈ కోర్సు కోసం దరఖాస్తు ద్వారా రిజి్రస్టేషన్‌ చేసుకున్న మిగిలిన విద్యార్థులు అందరూ వెబ్‌ ఆప్షన్స్‌కు అర్హులు అని పేర్కొన్నారు. హార్టీసెట్‌–2023 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ నెల 21న డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయంలో జరిగే కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని కోరారు. 

ప్రభుత్వ కళాశాలల్లో ఫీజుల వివరాలు
సెమిస్టర్‌ ఫీజు జనరల్‌ సీటు రూ.51,083 
పేమెంట్‌ సీటు రూ.1,38,488  
ఫీజులు, ఇతర వివరాల కోసం... 
ప్రభుత్వ ఉద్యాన కళాశాల 
వెంకట్రామన్న­­గూడెం, 7382633648
అనంతరాజుపేట –7382633651
పార్వతీపురం–7382633660 
చినలాటరపి–7382633443 నంబర్లలో 
సంప్రదించవచ్చు. 

వర్సిటీ గుర్తింపు కళాశాలల్లో ఫీజులు 
ఎన్‌ కాలేజ్‌ ఆఫ్‌ హార్టీ సైన్సెస్, మార్కాపురం రూ.44,000
శ్రీకృష్ణదేవరాయ కాలేజ్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌ సైన్సెస్, అనంతపురం రూ.77,000
జేసీ  దివాకరరెడ్డి హార్టికల్చర్‌ కాలేజ్, తాడిపత్రి రూ.65,000
కేబీఆర్‌ కాలేజ్‌ ఆఫ్‌  హార్టికల్చర్‌ సీఎస్‌.పురం రూ.38,700   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement