సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఈ ఏడాది నుంచి కొత్తగా ప్రారంభమవుతున్న ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలతోపాటు స్విమ్స్, ప్రైవేట్ వైద్య, దంత కళాశాలల్లో 2023–24 విద్యా సంవత్సరానికి బీ, సీ కేటగిరీ ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు నీట్ యూజీ–2023లో అర్హత సాధించిన విద్యార్థులు శుక్రవారం ఉదయం పది గంటల నుంచి ఈ నెల 10వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలి.
https://ugmq.ysruhs.com వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ అప్లికేషన్ అందుబాటులో ఉంటుంది. నియమాలు, నిబంధనలపై స్పష్టత కోసం 8978780501, 7997710168, 9391805238, సాంకేతిక సమస్యలపై 7416563063, 7416253073, పేమెంట్ గేట్‌వేలో స్పష్టత కోసం 8333883934 నంబర్‌లను విద్యార్థులు సంప్రదించవచ్చు.
నీట్ యూజీలో వచ్చిన ర్యాంక్‌ల ఆధారంగా నిబంధనలకు లోబడి సీట్ల కేటాయింపు ఉంటుందని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి తెలిపారు. సీటు వచ్చేలా చేస్తామని కొందరు వ్యక్తులు చెప్పే మాయమాటలు నమ్మి విద్యార్థులు, తల్లిదండ్రులు మోసపోవద్దని ఆమె స్పష్టంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment