ఉద్యానశాఖ ద్వారా ‘ఇథలిన్’ కేంద్రాలు | ithaline centers from harticulture | Sakshi
Sakshi News home page

ఉద్యానశాఖ ద్వారా ‘ఇథలిన్’ కేంద్రాలు

Published Wed, Aug 19 2015 3:54 AM | Last Updated on Sun, Sep 3 2017 7:40 AM

ithaline centers from harticulture

సాక్షి, హైదరాబాద్: ఇథలిన్ ద్వారా పండ్లను మాగబెట్టే కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఉద్యానశాఖ నిర్ణయించింది. బోధన్, ఖమ్మం, హైదరాబాద్‌లలో వీటిని ఏర్పాటు చేస్తామని ఉద్యానశాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి మంగళవారం హైదరాబాద్‌లో చెప్పారు. ప్రైవేటు రంగంలో వీటిని ఏర్పాటు చేసి, 30 శాతం సబ్సిడీ అందజేస్తామని తెలిపారు.

వీటి కోసం 60 శాతం బ్యాంకు రుణం తీసుకోవచ్చ ని, 10 శాతం రైతులు భరించాల్సి ఉంటుందన్నారు.వరంగల్, నిజామాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో మిరప, పసుపు పంటల కోసం కోల్డ్ స్టోరేజీలను ఏర్పాటు చేస్తామన్నా రు. పండ్లు మాగబెట్టే కేంద్రాలు, కోల్డ్ స్టోరేజీల కోసం రూ.10కోట్లు కేటాయించామన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement