అగ్రస్థానానికిఎదగడం కోసం... | red mirchi movie releasing in this month | Sakshi
Sakshi News home page

అగ్రస్థానానికిఎదగడం కోసం...

Published Sat, Jul 12 2014 12:04 AM | Last Updated on Sat, Sep 2 2017 10:09 AM

red mirchi movie releasing in this month

హిందీలో పలు చిత్రాల్లో నటించిన పాకిస్తానీ భామ వీణా మాలిక్ ‘సిల్క్’ చిత్రం ద్వారా కన్నడ రంగానికి పరిచయమైంది. ఈ చిత్రాన్ని ‘రెడ్ మిర్చి’ టైటిల్‌తో కన్నడ దర్శకుడు కనసుగార కరణ్ తెలుగులోకి అనువదించారు. ఈ నెలాఖరున చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా కరణ్ మాట్లాడుతూ -‘‘సినిమా రంగంలో అగ్రస్థానానికి ఎదగడం కోసం ఓ నటి ఏం చేసింది? అనేదే ఈ చిత్రకథ. ఇందులో వీణా మాలిక్ అద్భుతంగా నటించింది. అలాగే, ప్రతినాయకురాలి పాత్రను సన చేసింది. కన్నడంలో ఈ చిత్రం 150 రోజులాడింది. తెలుగులో కూడా ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: జెస్సీ గిఫ్ట్, మాటలు-పాటలు: భారతీబాబు, కెమెరా: జై ఆనంద్, సమర్పణ: పి.వి.ఎల్, దర్శకత్వం: త్రిశూల్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement