identification
-
నాణ్యమైన పట్టుచీరను ఎలా గుర్తించాలి..?
మార్కెట్లలో ఎక్కువగా ఇష్టపడే బట్టలలో పట్టు ఒకటి. ఈ పట్టు వస్త్రాలు ధరించగానే ఒక్కసారిగా పండుగ వాతావరణం వచ్చినట్లు అనిపిస్తుంది. అలాంటి పట్టు విషయంలో ఒక్కోసారి మోసపోతుంటాం. అసలు ఏది నకిలి? ఏది నిజమైన పట్టు ? అని ఎలా గుర్తించాలి. ప్రామాణికమైన పట్టు గుర్తించడానికి అనేక పరీక్షల ద్వారా గుర్తించొచ్చని డిజైనర్లు చెబుతున్నారు. ఈ పరీక్షలన్నీ అక్కడికక్కడే చేసి గుర్తించొచ్చు. ప్రామాణిక పట్టును గుర్తించడానికి పలు మార్గాలు ఉన్నాయి అవేంటంటే..టచ్ టెస్ట్నిజమైన పట్టుని త్వరితగతిన గుర్తించేందుకు ఉపయోగించే సులభమైన టెస్ట్ ఇది. వేళ్ల మధ్య పట్టుని రుద్దండి. అసలైన సిల్క్ సహజ లక్షణాలతో వేడెక్కుతుంది. సింథటిక్ ఫ్యాబ్రిక్ అలా చేస్తే చల్లగా ఉంటుంది.రింగ్ టెస్ట్ఉంగరంతో చేసే టెస్ట్ ఇది. ఉంగరం సాయంతో పట్టు ముక్కను లాగే ప్రయత్నం చేస్తారు. పట్టు మృదువైనది కాబట్టి ఉంగరం గుండా సులభంగా వెళ్తుంది. అయితే సింథటిక్ వస్త్రాలు అలా వెళ్లవు. ధర..నిజమైన పట్టు అత్యంత ఖరీదైనది. సింథటిక్ ప్రత్యామ్నాయాల కంటే ఎక్కువ ఖరీదు. తక్కువ ఖరీదులో దొరకడం అనేది అసాధ్యం. మెరుపుని బట్టి..నిజమైన పట్టు మెరుపు నాణ్యతకు ప్రసిద్ధి చెందింది. ఇది కాంతి పడినప్పుడూ వేర్వేరు షేడ్ రంగుల్లో కనిప్తిసుంది. అదే సింథటిక్ పట్టులో కాంతి పడినప్పుడూ కూడా ఒకేవిధంగా కనిపిస్తుంది. నేతను పరిశీలించడంచేతితో నేసిన పట్టులో వైవిధ్యం కనిపిస్తుంది. ప్రతి భాగానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. మెషిన్‌తో నేసిన పట్టులో ఏకరీతిలో మృదువుగా కనిపిస్తుంది. ఈ విలక్షణమైన లక్షణాలు సింథటిక్ పట్టులో కనిపించవు.బర్న్ టెస్ట్..నిజమైన సిల్క్ కాలిన వెంట్రుకల వాసన వెదజల్లుతుంది. పెళుసుగా ఉండే బూడిదను ఉత్పత్తి చేస్తుంది. సింథటిక్ సిల్క్ ప్లాస్టిక్ కాల్చినట్లు వాసన వస్తుంది. తరుచుగా మంటను ఉత్పత్తి చేస్తుంది. ప్లాస్టిక్ అవశేషాలను వదిలివేస్తుంది.( చదవండి: హోటల్ వ్యాపారం నుంచి ఏకంగా దేశ ప్రధాని స్థాయికి..!) -
గంజాయిపై శాటిలైట్!
సాక్షి, హైదరాబాద్: ‘నిషా ముక్త్ తెలంగాణ’లక్ష్యంగా పని చేస్తున్న తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీజీ ఏఎన్‌బీ) వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. గంజాయితోపాటు డ్రగ్స్‌కు చెక్ చెప్పడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం అధీనంలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) తరహాలో ఎడ్రిన్ మ్యాప్స్, మ్యాప్ డ్రగ్ యాప్ టెక్నాలజీని వాడుతోంది. వీటికి సంబంధించి టీజీ ఏఎన్‌బీ డైరెక్టర్ సందీప్ శాండిల్య ట్రైనింగ్ ఫర్ ట్రైనర్స్ విధానంలో నలుగురు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. మండలాలు తెలిసినా ప్రాంతాలపై అస్పష్టత తెలంగాణతోపాటు ఉత్తరాదిలోని అనేక ప్రాంతాలకు సరఫరా అవుతున్న గంజాయిలో అత్యధిక శాతం ఆంధ్ర–ఒడిశా సరిహద్దులతో (ఏఓబీ) పాటు విశాఖ ఏజెన్సీ నుంచే వస్తోంది. అక్కడి వ్యాపారులు వ్యవస్థీకృతంగా ఈ దందా చేస్తూ రైతులను ప్రలోభాలకు గురి చేసి గంజాయి పంట పండించేలా ప్రోత్సహిస్తున్నారు. ఏజెన్సీలోని ఏఏ మండలాల్లో గంజాయి సాగు జరుగుతోందో పోలీసులకు తెలుసు.. కానీ ఏ ప్రాంతంలో ఉందో కచి్చతంగా తెలుసుకోవడం సాధ్యం కావట్లేదు. ఏజెన్సీతోపాటు ఏఓబీలో సైతం మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండటంతో గంజాయి పంటను గుర్తించేందుకు కూంబింగ్ తరహా ఆపరేషన్స్ చేపట్టడానికి పోలీసులు సాహసం చేయలేకపోతున్నారు. ఇదే అదనుగా ఈ పంట పండించే వాళ్లు నానాటికీ విస్తరిస్తున్నారు.ఉపగ్రహ ఛాయా చిత్రాలతో స్పష్టతకొన్నేళ్లుగా గంజాయిపై రాష్ట్ర పోలీసు విభాగాలతోపాటు ఎన్సీబీ సైతం దృష్టి పెట్టింది. తక్కువ ధరకు తేలిగ్గా లభిస్తూ వేగంగా విస్తరిస్తున్న ఈ మాదకద్రవ్యం పండించడం, విక్రయించడం, రవాణా, వినియోగం తదితరాలు లేకుండా చేయడానికి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. అందులో గంజాయి పంటను గుర్తించేందుకు శాటిలైట్ సాంకేతికత వాడకం ప్రధానమైంది. దీనికోసం ఎన్సీబీ అధికారులు కొన్నాళ్లుగా హైదరాబాద్‌లోని బాలానగర్ ప్రాంతంలో ఉన్న అడ్వాన్స్ డేటా ప్రాసెసింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎడ్రిన్) సహాయం తీసుకుంటున్నారు.ఎడ్రిన్తో చేసుకున్న ఒప్పందం ప్రకారం... గంజాయి పండించే ప్రాంతాలకు సంబంధించిన ఉపగ్రహ ఛాయా చిత్రాలను ఎన్సీబీకి ఇస్తుంది. వీటిని విశ్లేషించే అధికారులు ఆయా ప్రాంతాలకు చెందిన పోలీసు, పరిపాలన విభాగాలతో కలిసి కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. టీజీ ఏఎన్‌బీ కూడా ఇదే మాదిరిగా చేయడంతోపాటు ఆ ప్రాంతాలకు సంబంధించిన రూట్లలో ప్రత్యేక సీసీ కెమెరాలు, చెక్ పోస్టులు ఏర్పాటు చేయనుంది.మ్యాప్ డ్రగ్‌తో మరింత సమన్వయం మాదకద్రవ్యాలను ఓ ప్రాంతంలో తయారు చేయడం, పంపడం జరిగితే... అవి ఒక ప్రాంతం మీదుగా ఇంకోచోటుకు చేరి అక్కడ వినియోగం అవుతుంటాయి. ఏజెన్సీలో గంజాయి, హష్ ఆయిల్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ల్లో నల్లమందు, మరికొన్ని చోట్ల ఎఫిడ్రిన్... ఇలా తయారై దేశవ్యాప్తంగా సరఫరా అవుతున్నాయి. కొకైన్, ఎండీఎంఏ, ఎల్ఎస్డీ వంటి సింథటిక్ డ్రగ్స్ విదేశాల నుంచి అక్రమ రవాణా అయి, గోవా, బెంగళూరు, ముంబై నుంచి ఇతర ప్రాంతాలకు చేరుతున్నాయి.ఈ నేపథ్యంలోనే గంజాయితోపాటు ఇతర డ్రగ్స్ కట్టడికి సమన్వయం చాలా కీలకం. ఏఏ ప్రాంతాల్లో ఏ డ్రగ్స్ ఉంటున్నాయి? ఎవరు కీలకంగా వ్యవహరిస్తున్నారు? ఏ మార్గాల్లో రవాణా అవుతున్నాయి? అనే విషయాలను తెలుసుకుంటేనే సమన్వయం సాధ్యం. దీనికోసం మ్యాప్ డ్రగ్ పేరుతో ఎన్సీబీ ప్రత్యేక యాప్ రూపొందించింది. ఈ యాప్‌ను అధికారికంగా వినియోగించుకోవడానికి టీజీ ఏఎన్‌బీకి అనుమతి ఇచ్చింది. దీని వినియోగంపై అధికారులకు శిక్షణ సైతం పూర్తయింది. -
వ్యక్తులను గుర్తించే ‘దివ్యదృష్టి’!
పుర్రె భాగాన్ని స్కాన్‌చేసి వ్యక్తులను గుర్తించే ఏఐ సాంకేతికత ‘దివ్యదృష్టి’ను తయారు చేసినట్లు రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) తెలిపింది. డీఆర్డీఓ ఏర్పాటు చేసిన ‘డేర్ టు డ్రీమ్ ఇన్నోవేషన్ కంటెస్ట్ 2.0’లో ఈ టెక్నాలజీను ఆవిష్కరించిన ఇంజీనియస్ రిసెర్చ్ సొల్యూషన్స్ అనే స్టార్టప్ కంపెనీ విజేతగా నిలిచిందని చెప్పింది.డీఆర్డీఓ తెలిపిన వివరాల ప్రకారం..‘దేశవ్యాప్తంగా కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు డేర్ టు డ్రీమ్ ఇన్నోవేషన్ కంటెస్ట్ 2.0ను ఏర్పాటు చేశాం. అందులో భాగంగా కొత్త ఏఐ టూల్‌ను పరిచయం చేసిన ఇంజీనియస్ రిసెర్చ్ సొల్యూషన్స్ అనే స్టార్టప్ కంపెనీ గెలుపొందింది. శివాని వర్మ అనే మహిళా వ్యాపారవేత్త ఈ కంపెనీను స్థాపించారు. సంస్థ తయారు చేసిన ‘దివ్యదృష్టి’ అనే ఏఐ టూల్ ద్వారా విభిన్న వ్యక్తులను కచ్చితత్వంతో గుర్తించవచ్చు. ఇందులో భాగంగా మానవుల పుర్రె భాగాన్ని వివిధ శారీరక పరామితులను ఉపయోగించి స్కాన్ చేస్తారు. పుర్రె పరిమాణం, అందులోని ఇతర పరామితులు వ్యక్తులనుబట్టి మారుతాయి. దాంతో విభిన్న వ్యక్తుల ముఖాలను కచ్చితత్వంతో గుర్తించవచ్చు. అడ్వాన్స్డ్ బయోమెట్రిక్ సాంకేతికతను కూడా ఈ ‘దివ్యదృష్టి’లో ఉపయోగించారు.కొత్తగా కనుగొన్న ఏఐ టూల్‌ను రక్షణ, లా ఎన్ఫోర్స్మెంట్, కార్పొరేట్, పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో సహా విభిన్న రంగాల్లో వినియోగించవచ్చని డీఆర్డీఓ తెలిపింది. బెంగళూరులోని సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్(సీఏఐఆర్) మార్గదర్శకత్వంతో ఈ టూల్‌ను కనుగొన్నట్లు ఇంజీనియస్ రిసెర్చ్ సొల్యూషన్స్ తెలిపింది.ఇదీ చదవండి: మార్కెట్ ట్రెండ్ గమనిస్తున్నారా? ఇప్పుడేం చేయాలంటే..డిఫెన్స్ ఆర్ అండ్ డీ సెక్రటరీ డాక్టర్ సమీర్ వి కామత్ మాట్లాడుతూ..కేంద్రం ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా డిఫెన్స్, ఏరోస్పేస్ రంగంలో స్టార్టప్‌లను ప్రోత్సహించేలా డీఆర్డీఓ అనుసరిస్తున్న మార్గాలు అభినందనీయమన్నారు. ‘దివ్యదృష్టి’ అభివృద్ధికి టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ (టీడీఎఫ్) సహాయం చేయడంపట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.ఇప్పటివరకు మార్కెట్లో ఉన్న ఫేస్ రికాగ్నిషన్ టెక్నాలజీలో కేవలం ముఖ కవలికలు, ముక్కు, కళ్లు, కనుబొమ్మలు.. వంటి భాగాలను స్కాన్ చేసి వ్యక్తులను గుర్తిస్తున్నారు. అయితే దాదాపు ఒకేలా ఉన్న వ్యక్తులను ఈ టెక్నాలజీతో కనిపెట్టడం కొంత కష్టంగా మారుతుంది. కొత్తగా వచ్చిన ‘దివ్యదృష్టి’ ఏకంగా పుర్రె భాగాలను స్కాన్ చేస్తుంది కాబట్టి మరింత కచ్చితత్వంతో కనిపెట్టవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
ప్రకాశం బ్యారేజ్‌కు అరుదైన గుర్తింపు
సాక్షి, అమరావతి: కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేస్తున్న ప్రకాశం బ్యారేజ్‌కు మరో అరుదైన గుర్తింపు లభించింది. ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడంగా ప్రకాశం బ్యారేజ్‌ను ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ (ఐసీఐడీ) ఎంపిక చేసింది. నవంబర్ 2 నుంచి 8 వరకు విశాఖలో జరిగే ఐసీఐడీ 25వ కాంగ్రెస్‌లో ప్రకాశం బ్యారేజ్‌కి ఇచ్చే అవార్డును రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు అందుకోనున్నారు. ఈ మేరకు రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌కు ఐసీఐడీ డైరెక్టర్ అవంతివర్మ తాజాగా లేఖ రాశారు. ప్రకాశం బ్యారేజ్‌తో కలిపి రాష్ట్రంలో ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడాలుగా ఐసీఐడీ గుర్తించిన ప్రాజెక్టుల సంఖ్య ఐదుకు చేరుకుంది. ఇప్పటికే కేసీ (కర్నూలు–కడప) కెనాల్, కంభం చెరువు, పోరుమామిళ్ల చెరువులను 2020లో.. సర్ ఆర్ధర్ కాటన్ బ్యారేజ్‌ను 2022లో ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడాలుగా ఐసీఐడీ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా జలవనరుల సంరక్షణ.. తక్కువ నీటితో అధిక ఆయకట్టుకు నీళ్లందించే విధానాలపై అధ్యయనం చేసి, వాటి ఫలాలను దేశాలకు అందించడమే లక్ష్యంగా 1950, జూన్ 24న ఐసీఐడీ ఏర్పాటైంది. పురాతన కాలంలో నిరి్మంచి.. ఇప్పటికీ ఆయకట్టుకు నీళ్లందిస్తున్న సాగునీటి కట్టడాలను ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడాలుగా ఎంపిక చేసి అవార్డులను ప్రదానం చేస్తోంది. -
కలెక్టర్ల నేతృత్వంలో వీఆర్ఏల విలీనం.. మార్గదర్శకాలు జారీ
సాక్షి, హైదరాబాద్: గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ)ను వివిధ ప్రభుత్వ శాఖల్లో విలీనం చేసుకునే ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదలయ్యాయి. భూపరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిత్తల్ మంగళవారం ఈ మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు ఇచ్చారు. వీఆర్ఏల విలీన ప్రక్రియను జిల్లా కలెక్టర్లు నిర్వహించాల్సి ఉంటుంది. ఖాళీల గుర్తింపు ప్రకటన నుంచి కేటాయింపు వరకు కలెక్టర్లే బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది. 61 ఏళ్లు నిండితే కారుణ్య ఉద్యోగం 61 ఏళ్లు దాటిన వీఆర్ఏల కుమారుడు లేదా కుమార్తెకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చేందుకు అవసరమైన మార్గదర్శకాలను కూడా ఉత్తర్వుల్లో పొందుపరిచారు. కారుణ్య ఉద్యోగం కోసం ఈ ఏడాది జూలై 31 నాటికి వీఆర్ఏ వయస్సును పరిగణనలోకి తీసుకుంటారు. ఈ నియామకాల కోసం దరఖాస్తు ఫార్మాట్‌ను రూపొందించారు. దీని ప్రకారం దరఖాస్తు చేసుకోవడంతో పాటు సదరు వీఆర్ఏ కూడా అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇతర కుటుంబసభ్యుల నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) సమరి్పంచాల్సి ఉంటుంది. పుట్టిన తేదీ, విద్యార్హత, కుల, నివాస ధ్రువపత్రాలు, ఆధార్ వివరాలను జత పరచాల్సి ఉంటుంది. ఈ కారుణ్య నియామకాల ప్రక్రియను జిల్లా కలెక్టర్లు ఈనెల ఐదో తేదీలోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. వీఆర్ఏల విలీనం మార్గదర్శకాలివే.. తెలంగాణ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్విస్ రూల్స్‌లోని రూల్ 10(ఏ) ప్రకారం వీఆర్ఏలను ఇతర ప్రభుత్వ శాఖల్లో విలీనం చేసుకుంటారు. ఇదే నియమం ప్రకారం కారుణ్య నియామకాలు కూడా చేపడతారు. విద్యార్హతల ఆధారంగా ప్రభుత్వ శాఖల్లోని చివరి స్థాయి సర్విసు/రికార్డు అసిస్టెంట్/జూనియర్ అసిస్టెంట్ తత్సమాన హోదాల్లో వీఆర్ఏలను రెగ్యులర్ స్కేల్ ఉద్యోగులుగా తీసుకుంటారు. జిల్లాల వారీగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఆయా హోదాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు, ఆ జిల్లాలో విలీనం చేసుకోవాల్సిన వీఆర్ఏల సంఖ్యను కలెక్టర్లు ప్రకటించాలి.వాటి ఆధారంగా వీఆర్ఏల విలీనం, కారుణ్య నియామకాల కోసం అవసరమైతే రెగ్యులర్ లేదా సూపర్ న్యూమరీ పోస్టులను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆ జిల్లాలో ఉన్న ఖాళీలకు మించి వీఆర్ఏలను విలీనం చేసుకోవాల్సి వస్తే వారిని ఇతర జిల్లాలకు కూడా పంపవచ్చు. అలా పంపాల్సి వస్తే సదరు వీఆర్ఏల వివరాలను ప్రస్తుత జిల్లా కలెక్టర్ ప్రకటిస్తారు. అలా ప్రకటించిన తర్వాత సదరు వీఆర్ఏలు తమకు కేటాయించిన జిల్లా కలెక్టర్‌కు రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ఆ జిల్లా కలెక్టర్ వీఆర్ఏను ఏదైనా శాఖలో విలీనం చేసుకుంటూ ఉత్తర్వులు జారీ చేస్తారు. అదే జిల్లాలో సర్దుబాటు చేసినా, ఇతర జిల్లాలకు పంపినా కలెక్టర్ కేటాయింపు ఉత్తర్వులు వెలువడిన వెంటనే తహసీల్దార్లు వీఆర్ఏలను రిలీవ్ చేయాల్సి ఉంటుంది. ఏ శాఖలకు పంపితే ఆయా శాఖల సర్వీసు రూల్స్ వీఆర్ఏలకు వర్తిస్తాయి. ఒక్కసారి కేటాయించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ మార్పు ఉండదు. తమను మార్చాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకునే అవకాశం కూడా ఉండదు. కేటాయింపు ఉత్తర్వులు వెలువడిన వెంటనే వీఆర్ఏలు సంబంధిత అధికారికి రిపోర్టు చేయాలి. ఆ అధికారి బేషరతుగా వారిని విధుల్లోకి తీసుకుని పోస్టింగు ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది. తహసీల్దార్లను వెంటనే రిలీవ్ చేయండి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మల్టిజోన్లలోని ఇతర జిల్లాలకు బదిలీ అయిన తహసీల్దార్లను వెంటనే రిలీవ్ చేయాలని సీసీఎల్ఏ నవీన్ మిత్తల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇతర జిల్లాల నుంచి వచ్చే తహసీల్దార్లను విధుల్లోకి తీసుకోవాలని, ఈసీఐ నిబంధనలకు అనుగుణంగా డిక్లరేషన్లు కూడా పొందుపర్చాలని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 410 మందికి పైగా తహసీల్దార్లు గత నెల 31న బదిలీ అయిన విషయం తెలిసిందే. ఇలావుండగా తహసీల్దార్ నుంచి డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు పొందిన మరో 9 మందికి మంగళవారం పోస్టింగులిస్తూ రెవెన్యూ ముఖ్య కార్యదర్శి హోదాలో నవీన్ మిత్తల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
నేరస్తుల చుట్టూ ముద్రావలయం
సాక్షి, అమరావతి: సమర్థంగా, సమగ్రంగా, త్వరగా కేసుల దర్యాప్తు దిశగా దేశం కీలక ముందడుగు వేయబోతోంది. అందుకోసం నేరస్తులు, ఖైదీల సమగ్ర బయోమెట్రిక్ డేటాను సేకరించే వ్యవస్థను రూపొందించాలని నిర్ణయించింది. కంటిపాప (రెటీనా) నుంచి కాలివేళ్ల దాకా మొత్తం బయోమెట్రిక్ డేటాను సేకరించనుంది. ఈమేరకు కేంద్ర, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులకు అధికారాలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం క్రిమినల్ ఐడింటిఫికేషన్ చట్టాన్ని తీసుకొచ్చింది. దీనికి ఒక సమగ్ర విధానాన్ని రూపొందించమని జాతీయ నేరగణాంకాల సంస్థ (ఎన్సీఆర్బీ)ని ఆదేశించింది. ఇప్పటివరకు ఖైదీల చేతి వేలిముద్రల సేకరణకే అధికారం నేరస్తులు, అనుమానితుల సమగ్ర డేటాను భద్రపరచడం నేర పరిశోధనకు అత్యంత అవసరం. ఆ కీలక డేటా అందుబాటులో ఉంటే కేసుల దర్యాప్తు, అనుమానితులను అదుపులోకి తీసుకోవడం, సాక్ష్యాధారాల సేకరణ, నేరాన్ని నిరూపించడం సులభసాధ్యమవుతుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ నేరస్తులు కొత్తకొత్త రీతుల్లో నేరాలకు పాల్పడుతున్నారు. మరోవైపు ఉగ్రవాదం, తీవ్రవాద బెడద పొంచి ఉండనే ఉంది. ఈ నేపథ్యంలో 1920లో రూపొందించిన ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రిజనర్స్ చట్టాన్ని ఇంకా అనుసరిస్తుండటం సరికాదని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు భావించాయి. ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం ఖైదీల చేతి వేలిముద్రలను మాత్రమే సేకరించే అధికారం పోలీసులకు ఉంది. కానీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో కాలానుగుణంగా మారుతున్న నేరాల నిరూపణకు వేలిముద్రలు సరిపోవడంలేదని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఈ అంశంపై కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలతో చర్చించి కొత్త చట్టాన్ని రూపొందించింది. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రిజనర్స్ యాక్ట్–1920 స్థానంలో క్రిమినల్ ప్రొసీజర్ (ఐడెంటిఫికేషన్) చట్టం–2022ను పార్లమెంటు ఈ ఏడాది ఆగస్టులో ఆమోదించింది. ఈ చట్టం నేరస్తులు, ఖైదీల సమగ్ర బయోమెట్రిక్ డేటాను సేకరించేందుకు కేంద్ర, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులకు అధికారాలను కట్టబెట్టింది. ప్రాథమిక విధానం ఖరారు నేరస్తులు, ఖైదీల సమగ్ర బయోమెట్రిక్ డేటాను సేకరించేందుకు ఎన్సీఆర్బీ విధివిధానాలను రూపొందిస్తోంది. అందుకోసం ఇటీవల అన్ని రాష్ట్రాల నేరగణాంక సంస్థ (ఎస్సీఆర్బీ)లతో సమావేశం నిర్వహించింది. బయోమెట్రిక్ ఆధారాల కింద వేటిని సేకరించాలి, ఎలా భద్రపరచాలి, అమలులో ఎదురయ్యే ఇబ్బందులపై చర్చించి ప్రాథమికంగా ఓ విధానాన్ని ఖరారు చేశారు. న్యాయస్థానాల నుంచి మినహాయింపు ఉన్న కేసుల్లో మినహా అన్ని కేసులకు సంబంధించిన నేరస్తులు, ఖైదీల పూర్తి బయోమెట్రిక్ డేటాను సేకరించాలని నిర్ణయించారు. సీఆర్పీసీ సెక్షన్లలోని చాప్టర్ 9ఏ, చాప్టర్ 10 కింద అరెస్టయి రిమాండులో ఉన్న ఖైదీల బయోమెట్రిక్ డేటాను కనీసం ఎస్పీ ర్యాంకుకు తక్కువకాని పోలీసు అధికారి లిఖితపూర్వక అనుమతితో సేకరిస్తారు. నేరస్తులు, ఖైదీల కంటిపాప, రెండుచేతుల వేలిముద్రలు, రెండు అరచేతులు, రెండు అరిపాదాలు, రెండుకాళ్ల వేలిముద్రలు, ఫొటోలు, సంతకం, చేతిరాత.. ఇలా అన్నీ సేకరిస్తారు. వాటి స్కాన్ కాపీలు, ఫొటోలు, వీడియోలను డిజిటల్ రూపంలో భద్రపరుస్తారు. కేవలం నిషేధ ఆజ్ఞల ఉల్లంఘన, ముందస్తు అరెస్టుల కింద అదుపులోకి తీసుకున్నవారి బయోమెట్రిక్ ఆధారాలు సేకరించరు. వాటితోపాటు ఇతర నేరాలు ఏమైనా ఉంటే మాత్రం బయోమెట్రిక్ ఆధారాలు సేకరిస్తారు. ఎవరైనా నేరస్తులు, ఖైదీలు తమ బయోమెట్రిక్ ఆధారాలు ఇచ్చేందుకు సమ్మతించకపోతే అది మరో నేరంగా పరిగణిస్తారు. నేర ఆధారాలను ధ్వంసానికి పాల్పడిన నేరంగా కేసు నమోదు చేసేందుకు పోలీసులకు అధికారం ఉంది. ఆమేరకు న్యాయస్థానం అనుమతితో బలవంతంగా అయినా సరే బయోమెట్రిక్ ఆధారాలు సేకరించే అధికారం పోలీసులకు ఉంది. డిజిటల్ రూపంలో భద్రం నేరస్తులు, ఖైదీల బయోమెట్రిక్ ఆధారాలను భద్రపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఓ కేంద్రీకృత వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. కేంద్ర భద్రతా బలగాలతోపాటు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులు సేకరించిన డేటాను డిజిటల్ రూపంలో అందులో భద్రపరుస్తారు. వాటిని అన్ని రాష్ట్రాల ఫోరెన్సిక్ విభాగాలకు అనుసంధానిస్తారు. దీంతో కేంద్ర, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులు చేపట్టే కేసుల దర్యాప్తు కోసం ఆ డేటా అందుబాటులో ఉంటుంది. ఒక్కో నేరస్తుడు, ఖైదీ నుంచి సేకరించే డేటాను కనీసం 75 ఏళ్లు భద్రపరచాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అనంతరం ఇక అవసరంలేదని ఉన్నతస్థాయి కమిటీ నిర్ణయిస్తే న్యాయస్థానం అనుమతితో ఆ డేటాను ధ్వంసం చేస్తారు. అందుకోసం కూడా ఓ విధానాన్ని రూపొందించనున్నారు. త్వరలోనే సమగ్ర బయోమెట్రిక్ డేటా సేకరణ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. -
ఆ వ్యక్తిని సాక్షి గుర్తు పట్టడం.. అత్యంత బలహీనమైన సాక్ష్యమే: సుప్రీం
న్యూఢిల్లీ: ఒక నేరం జరిగిన సమయంలోనే నిందితుడిని మొదటిసారి చూసి, ఆ తర్వాత కోర్టులో ఆ వ్యక్తిని సాక్షి గుర్తు పట్టడం అనేది అత్యంత బలహీనమైన సాక్ష్యాధారమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అందులోనూ నేరం జరిగిన తేదీకి, కోర్టులో విచారణ జరిగే సమయానికి మధ్య కాల వ్యవధి ఎక్కువగా ఉన్నప్పుడు ఆ సాక్ష్యం మరింత బలహీనంగా మారుతుందంది. మద్యం అక్రమ రవాణా కేసులో కేరళ అబ్కారీ చట్టం కింద దోషులుగా నిర్ధారించిన నలుగురు వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ అభయ్‌ల ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. చదవండి: (‘పరారీలో ఉంటే ముందస్తు బెయిలు వీలుకాదు’) నలుగురు వ్యక్తులు 6,090 లీటర్ల మద్యాన్ని 174 ప్లాస్టిక్ క్యాన్లలో ఉంచి తప్పుడు రిజిస్ట్రేషన్ ఉన్న వాహనంలో తరలిస్తున్నారని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. 11 ఏళ్ల నాటి ఘటనలో మొదటిసారి ఆ వ్యక్తుల్ని చూసినందున వారిని గుర్తు పట్టలేకపోతున్నానని సాక్షి పేర్కొన్నారు. అయితే వారిలో ఇద్దరిని మాత్రం ఐడెంటిఫికేషన్ పెరేడ్లో గుర్తు పట్టగలిగారు. దీంతో సుప్రీంకోర్టు ఆ సాక్ష్యం చెల్లదని ప్రకటించింది. నలుగురు నిందితులకు కేసు నుంచి విముక్తి కల్పిస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. -
‘దళితబంధు’ సర్వే చకచకా..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో దళితబంధు పథకం లబ్ధిదారుల గుర్తింపు కోసం చేపట్టిన సర్వే చురుకుగా సాగుతోంది. శుక్రవారం ప్రారంభమైన ఇంటింటి సర్వే శనివారానికి ఊపందుకుంది. సర్వేలో దాదాపు 400 మంది జిల్లా అధికారులు పాలుపంచుకుంటున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని వీణవంక, జమ్మికుంట, హుజూరాబాద్, కమలాపూర్, ఇల్లందకుంట మండలాలు, జమ్మికుంట, హుజూరాబాద్ మున్సిపాలిటీలను మొత్తం ఏడు యూనిట్లుగా విభజించారు. ప్రతి యూనిట్‌ను ఐదు క్లస్టర్లుగా విభజించారు. క్లస్టర్ల బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులు ‘దళితబంధు’యాప్ ద్వారా లబ్ధిదారుల వివరాలు నమోదు చేస్తున్నారు. అందులో లబ్ధిదారుల పేరు, వయసు, ఫోన్, రేషన్‌కార్డు, ఆధార్ నంబర్లు, సమగ్ర కుటుంబసర్వే నంబరు, చిరునామా, కుటుంబసభ్యులు ఎందరు? వారి వయసు, ఆధార్, ఫోన్ తదితర వివరాలు సేకరిస్తున్నారు. అనంతరం ప్రతివ్యక్తి ఫొటోను ట్యాబ్‌లో పొందుపర్చి అప్లోడ్ చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం ఈ సాఫ్ట్వేర్, యాప్‌లను ప్రత్యేకంగా రూపొందించింది. ఈ సాఫ్ట్వేర్ తెలుగు, ఇంగ్లిష్ రెండుభాషల్లోనూ అందుబాటులో ఉంది. సర్వే సమయంలోనే ఏ యూనిట్ అంటే ఆసక్తి ఉంది? అన్న వివరాలు కూడా తీసుకుంటున్నారు. 2014లో సమగ్ర కుటుంబసర్వేనే దళితబంధు సర్వేకు ప్రామాణికంగా తీసుకున్నారు. సమగ్ర కుటుంబసర్వే గణాంకాల ప్రకారం... రాష్ట్రంలో 20,900 దళిత కుటుంబాలున్నాయి. సమగ్ర కుటుంబసర్వే తర్వాత మరో రెండు, మూడు వేల వరకు కొత్త కుటుంబాలు పెరిగాయి. ఆ కొత్త కుటుంబాల కోసం ఖాళీ దరఖాస్తులు (లబ్ధిదారుల సమాచార పత్రం) ఇచ్చి వివరాలు నమోదు చేస్తున్నారు. అందరి వివరాలు ఏ రోజుకారోజు కరీంనగర్ కలెక్టరేట్లో పొందుపరుస్తున్నారు. సీఎంసభకు ముందురోజు అంటే ఈ నెల 26వ తేదీ నుంచి కలెక్టరేట్, ఇతర ప్రభుత్వవిభాగాల సిబ్బంది ఉరుకులు, పరుగులు పెడుతూ ఇంటింటి సర్వే పనులు చేస్తుండటం గమనార్హం. -
కూకట్పల్లి ఏటీఎం: కాల్పులకు తెగబడ్డది ఆ ముఠానే!
సాక్షి, హైదరాబాద్: బిహార్ నుంచి వలస కూలీలుగా వచ్చారు.. ఇక్కడ దోపిడీ దొంగల అవతారం ఎత్తారు. తేలిగ్గా డబ్బు సంపాదించాలని నేరబాట పట్టారు. ఏటీఎం వద్ద కాల్పులకు తెగబడి దోపిడీకి పాల్పడింది బిహార్ ముఠానేనని పోలీసులు గుర్తించారు. కూకట్పల్లి విజయ్‌నగర్ కాలనీలోని ఏటీ ఎం కేంద్రం వద్ద దుండగులు గురువారం ఓ సెక్యూరిటీ గార్డ్‌ను చంపి రూ.5 లక్షలు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. ఇద్దరు నిందితుల్లో ఒకరిని సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు గురువారం అర్ధరాత్రి పట్టుకున్నారు. మరో నిందితుడు ఆయుధం, డబ్బు తో రైలులో పారిపోయినట్లు గుర్తించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న నిందితుడిని రహస్య ప్రాంతానికి తరలించి విచారిస్తున్నారు. బిహార్‌కు చెందిన ఇద్దరు యువకులు జీడిమెట్ల–చందానగర్ మధ్య ప్రాంతంలో నివసిస్తూ కొద్దిరోజులు దినసరి కూలీలుగా పనిచేశారు. తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చోరీలకు పూనుకున్నారు. గతంలోనూ నాటు తుపాకీతో బెదిరించి.. నిందితులు కొన్నాళ్ల క్రితం తమ స్వస్థలంలో ఓ నాటు పిస్టల్ ఖరీదు చేసుకుని వచ్చారు. జీడిమెట్ల అయోధ్యనగర్ చౌరస్తాలో ఉన్న లక్ష్మీ మనీ ట్రాన్స్ఫర్ సంస్థను టార్గెట్ చేశారు. గత నెల 16న రాత్రి 9.30 గంటల ప్రాంతంలో తన దుకాణం మూసేందుకు సిద్ధమైన యజమాని రవికుమార్ రూ.1.95 లక్షలను తన బ్యాగ్‌లో పెట్టుకున్నారు. అదే సమయంలో హెల్మెట్, మాస్క్ ధరించిన ఇద్దరు దుండ గులు ఆ దుకాణంలోకి ప్రవేశించి రవికుమార్‌కు తుపాకీ గురిపెట్టి, అరిస్తే చంపేస్తామంటూ బెదిరించారు. ఆయన వద్ద నగదు ఉన్న బ్యాగ్‌తోపాటు సెల్‌ఫోన్ తీసుకుని ఉడాయించారు. ఈ నేరం చేసిన తర్వాత నిందితులు కొన్ని రోజులు మిన్నకుండిపోయారు. ఏటీఎం కేంద్రాలు ధ్వంసం చేయలేమనే.. ఆపై కూకట్పల్లి ప్రాంతంలోని ఏటీఎం కేంద్రాలపై గురిపెట్టారు. వాటిని ధ్వంసం చేసి డబ్బు దోచుకోవడం సాధ్యం కాదని భావించి, డబ్బు నింపడానికి వచ్చే వాహనాన్ని టార్గెట్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ వాహనాలు వచ్చే సమయాలు, రూట్లతోపాటు నేరం చేసిన తర్వాత పారిపోయేందుకు వీలున్న ప్రాంతాలను రెక్కీ ద్వారా విజయ్‌నగర్ కాలనీ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. జీడిమెట్లలో నేరం చేయడానికి తమకు పరిచయస్తుడైన వ్యక్తి నుంచి యాక్టివా వాహనం తీసుకున్నారు. కానీ, విజయ్‌నగర్‌కాలనీలో నేరం కోసం మాత్రం బైక్ ఉండాలని భావించారు. బాలానగర్ జోన్ పరిధి నుంచి ఓ పల్సర్ వాహనాన్ని చోరీ చేసి దాని నంబర్ ప్లేట్ తీసేసి వినియోగించారు. విజయ్‌నగర్ కాలనీలో చోరీ చేసి కేపీహెచ్‌బీ వైపు పారిపోయారు. ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు. గ్లాస్డోర్పై వేలిముద్రల సహాయంతో... ఇద్దరిలో ఓ నిందితుడు వాహనాన్ని తీసుకుని లిం గంపల్లి వరకు వెళ్లాడు. అక్కడే ద్విచక్ర వాహనాన్ని వదిలేసి డబ్బు, తుపాకీతో రైలులో మహారాష్ట్రకు పారిపోయాడు. ఏటీఎం కేంద్రంలోని గ్లాస్ డోర్‌పై నిందితుల వేలిముద్రలు దొరికాయి. ఇవి దుండిగల్‌లో సేకరించిన వేలిముద్రలతో సరిపోలాయి. అలా అనుమానితులను గుర్తించి సాంకేతిక ఆధారాలను బట్టి ముందుకు వెళ్లిన పోలీసులు బాలానగర్‌లోని ఒక నిందితుడిని గురువారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఇతడిని వివిధ కోణాల్లో విచారిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ ముఠాలో మరికొందరు ఉండి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో దుండిగల్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగిన నేరంలో వీరి పాత్రపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు పాల్గొన్నారని, ముఠాలో ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన కస్టోడియన్ శ్రీనివాస్‌ను చికిత్స అనంతరం వైద్యులు శుక్రవారం డిశ్చార్జ్ చేశారు. ఈ కేసు దర్యాప్తును నేరుగా కమిషనర్ వీసీ సజ్జనార్ పర్యవేక్షిస్తున్నారు. చదవండి: ఈటల కథ క్లైమాక్స్‌కు.. ఏం జరగబోతోంది..? హైదరాబాద్: ఆడపిల్ల పుట్టిందని ఆటోలో వదిలేశారా? -
ఆ వలలో చిక్కిన వారికి.. తప్పవు చిక్కులు
కాకినాడ రూరల్: అద్దె ఇళ్లల్లో.. చాలీచాలని ఇరుకు కొంపల్లో ఇబ్బందులు పడుతూ జీవిస్తున్నవారు.. అప్పోసప్పో చేసి సొంతిల్లు కట్టుకోవాలని కలలు కంటారు. దీనిని సొమ్ము చేసుకొనే లక్ష్యంతో పట్టణాలు, నగరాలను ఆనుకొని ఉన్న పల్లెల్లో పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు తగిన అనుమతులు లేకుండానే ఇష్టానుసారం లే అవుట్లు వేసేస్తున్నారు. తక్కువ ధరల పేరుతో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలపై వల విసురుతున్నారు. ఆ వలలో చిక్కుకున్న వారికి చిక్కులు తప్పవని హెచ్చరిస్తున్నారు గుడా అధికారులు. నిబంధనలు పాటించకుండా వేసిన లే అవుట్లలోని స్థలాల్లో ఇళ్లు కట్టుకునేందుకు అనుమతులు రావని స్పష్టం చేస్తున్నారు. అటువంటి అనధికార లే అవుట్లలోని ప్లాట్లను వెంటనే క్రమబద్ధీకరించుకోవాలని సూచిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతల ఒత్తిళ్లతో జిల్లాలోని పలు వ్యవసాయ భూములు వ్యవసాయేతరంగా మారిపోయాయి. ఆ పార్టీ నేతల కనుసన్నల్లో రియల్ ఎస్టేట్ నిబంధనలను తుంగలో తొక్కి.. అనేకమంది యథేచ్ఛగా అనధికార లే అవుట్లు (నాన్ లే అవుట్లు) వేసేశారు. సామాజిక అవసరాలకు స్థలాలను మినహాయించకుండానే ప్లాట్లు వేసి అమ్ముకుని సొమ్ములు చేసుకున్నారు. తగిన అనుమతులు లేని ఇటువంటి లే అవుట్లలో భవిష్యత్తులో భవన నిర్మాణాలకు అవకాశం ఉండదు. అంతేకాదు.. వీటిని అమ్ముకునే వీలు కూడా ఉండదని గోదావరి పట్టణాభివృద్ధి సంస్థ (గుడా) అధికారులు స్పష్టం చేస్తున్నారు. 23 మండలాల పరిధిలో.. జిల్లాలోని కాకినాడ, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలతో పాటు తుని, పిఠాపురం, సామర్లకోట, పెద్దాపురం, రామచంద్రపురం, అమలాపురం, మండపేట మున్సిపాలిటీలు, గొల్లప్రోలు, ముమ్మిడివరం, ఏలేశ్వరం నగర పంచాయతీలు, 43 మండలాల్లోని 598 రెవెన్యూ గ్రామాలు గుడా పరిధిలో ఉన్నాయి. మొత్తం 4396.84 చదరపు కిలోమీటర్ల మేర గుడా పరిధి విస్తరించి ఉంది. మొత్తం 23 మండలాల్లో విస్తరించి ఉన్న గుడా పరిధిలో 1,338 అనధికార లే అవుట్లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. రాజమహేంద్రవరం రూరల్ మండలంలో అత్యధికంగా 370 ఉండగా, కడియం మండలంలో అత్యల్పంగా 6 ఉన్నాయి. వీటిని ఆయా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోని నిషేధిత భూముల రిజిస్టర్లో నమోదు చేయించారు. తద్వారా వాటి కొనుగోళ్లు, అమ్మకాలను నిషేధించారు. ఇటువంటి లే అవుట్లలో ప్లాట్లు కొన్నవారు ముందే మేల్కోవాలని, ఏప్రిల్ ఆరో తేదీలోగా వాటిని క్రమబదీ్ధకరించుకోవాలని సూచిస్తున్నారు. ఎల్ఆర్ఎస్తో ప్రయోజనాలు లే అవుట్ రెగ్యులరైజేషన్ పథకం (ఎల్ఆర్ఎస్) ద్వారా అనధికార లే అవుట్లను క్రమబదీ్ధకరించుకోవచ్చు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం జనవరి 8న జీఓఎంఎస్ 10 ద్వారా అనుమతి ఇచ్చింది. దీని ద్వారా గత ఏడాది ఆగస్టు 31కి ముందు వేసిన అనధికార లే అవుట్లలోని ప్లాట్లను క్రమబదీ్ధకరించుకొనేందుకు అవకాశం ఇచ్చింది. జిల్లాలోని సంబంధిత యజమానులు తమ ప్లాట్లను ఏప్రిల్ ఆరో తేదీలోగా క్రమబద్దీకరించుకుంటే 14 శాతం ఓపెన్ స్పేస్ ఖరీదులో 50 శాతం మినహాయింపు లభిస్తుంది. పూర్తి వివరాలకు కాకినాడ ఎన్ఎఫ్సీఎల్ రోడ్డులో ఉన్న తమ కార్యాలయాన్ని సంప్రదించాలని గుడా అధికారులు సూచిస్తున్నారు. ఎల్ఆర్ఎస్ను వినియోగించుకోండి.. రాష్ట్ర ప్రభుత్వం అనధికార లే అవుట్ల క్రమబదీ్ధకరణకు ఎల్ఆర్ఎస్–2020కి జనవరిలో అనుమతి ఇచ్చింది. ఈ పథకాన్ని గుడా పరిధిలోని నాన్ లే అవుట్ల ప్లాట్ల యజమానులు వినియోగించుకోవచ్చు. ఇప్పటికే 1,338 నాన్ లే అవుట్లను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నిషేధిత భూముల రిజిస్టర్లలో నమోదు చేశాం. దీనివల్ల భవిష్యత్తులో అమ్మకాలు, కొనుగోళ్లకు అవకాశం ఉండదు. అందువల్ల ఎల్ఆర్ఎస్ మంచి అవకాశం. – ఆర్.అమరేంద్రకుమార్, వైస్ చైర్మన్, గోదావరి పట్టణాభివృద్ధి సంస్థ -
పాపిలాన్ పట్టేస్తోంది!
ఓ యువకుడు గతంలోని తన నేర చరితను దాచి పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకున్నాడు. కానీ ‘పాపిలాన్’సాంకేతికత అతడి పాపాల చిట్టా గుట్టువిప్పింది. సికింద్రాబాద్ స్టేషన్ పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వేలిముద్రలు పరీక్షించగా.. ఓ వ్యక్తిని చంపేందుకు తిరుగుతున్న పాత నేరస్తుడిగా గుర్తించారు. – సాక్షి, హైదరాబాద్ తెలంగాణ నేర దర్యాప్తు సంస్థ (సీఐడీ) లోని ఫింగర్‌ప్రింట్ విభాగం (ఎఫ్‌పీబీ) సమకూర్చుకున్న ‘పాపిలాన్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్’నేరగాళ్ల గుర్తింపు ప్రక్రియలో అద్భుత ఫలితాలిస్తోంది. 2017లో రష్యా నుంచి దిగుమతి చేసుకున్న పాపిలాన్–ఏఎఫ్ఐఎస్ (ఆటోమేటె డ్ ఫింగర్ అండ్ పామ్ ఐడెంటిఫికేషన్ సిస్ట మ్) ప్రపంచస్థాయి సాంకేతికత రాష్ట్ర పోలీసులకు నేర దర్యాప్తులో కీలకంగా మారింది. అమెరికా జాతీయ దర్యాప్తు సంస్థ, ఇంటర్‌పోల్ మాత్రమే వినియోగించే ఈ టెక్నాలజీ మన పోలీసులు వినియోగిస్తుండటంతో నేరదర్యాప్తులో అద్భుత పురోగతి కన్పిస్తోంది. ఏంటి ఈ సాంకేతికత? పాపిలాన్ అంటే ఫ్రెంచ్ భాషలో సీతాకోకచిలుక అని అర్థం. రష్యాకు చెందిన పాపిలాన్ అనే సంస్థ దీనిని అభివృద్ధి చేసింది. బయోమెట్రిక్ వ్యవస్థలో పాపిలాన్ నెక్ట్స్ జెనరేషన్ సాం కేతికత అని చెప్పొచ్చు. వేలిముద్రలు, అర చేతి ముద్రల ఎలక్ట్రానిక్ డేటాబేస్‌ను రూపొందించడం, నిక్షిప్తం చేయడం, వెతికిపెడుతుం ది పాపిలాన్. నేర పరిశోధనకు కచ్చితమైన సమాచారాన్ని క్షణాల్లో∙క్రోడీకరించి ఇస్తుంది. దొంగతనాలు, దోపిడీలు జరిగిన స్థలాల్లో సేకరించిన వేలిముద్రలను విశ్లేషించి అది ఎవరు చేశారో గుర్తించి క్షణాల్లో పోలీసులకు చెప్పేస్తుంది. ఇందులో పేపర్ మీద లైవ్ స్కానర్స్ సాయంతో వేలిముద్రలను సేకరిస్తారు. భారత్‌లో ఇలాంటి సాంకేతికత కలిగిన తొలి రాష్ట్రం తెలంగాణే కావడం గమనార్హం. ‘మొబైల్ సెక్యూరిటీ చెక్ సిస్టమ్’ను కూడా కలిగి ఉంది. అనుమానితుల నేరచరిత్ర మొత్తం 5 నుంచి 10 సెకన్లలో అధికారి ట్యాబ్లెట్ పీసీ మీద ప్రత్యక్షమవుతుంది. సాధించిన విజయాలు.. ►మొత్తం 1,345 దొంగతనాలు, దోపిడీలు లాంటి కేసుల్లో నేరస్తులను గుర్తించి వారి నుంచి రూ.19.49 కోట్ల ఆస్తిని స్వాధీనం చేసుకోవడంలో కీలకంగా వ్యవహరించింది. వీటిలో 700 పాత కేసులు. ►72 కేసుల్లో గుర్తు తెలియని మృతదేహాలను గుర్తించడంలో దోహదపడింది. ►మొబైల్ సెక్యూరిటీ సిస్టమ్ చెక్ ద్వారా అనుమానాస్పద పరిస్థితుల్లో సంచరిస్తున్న 8,850 మంది నేరచరితులను గుర్తించింది. ►నేరచరిత్రను దాచి కొత్త పాస్‌పోర్టు పొం దాలనుకున్న 60 మందిని గుర్తించింది. ►పేరు, చిరునామా మార్చుకుని తిరుగు తు న్న 49 మంది నేరగాళ్లను గుర్తించింది. ►మన రాష్ట్రంలోనే కాదు.. ఇతర రాష్ట్రాల్లో జరిగిన నేరాలను సైతం విశ్లేషించి, 20 మంది నేరస్తులను గుర్తించి ఆయా రాష్ట్రాలకు సమాచారమిచ్చింది. ►2014 వరకు ఉమ్మడి ఏపీకి సంబంధించి ఫింగర్ ప్రింట్ బ్యూరో వివరాలన్నీ ఈ టెక్నాలజీకి అనుసంధానించారు. ►క్రైమ్ అండ్ క్రిమినల్ నెట్వర్కింగ్ సిస్టమ్ తో తన టెక్నాలజీని తొలిసారి అనుసంధానించింది పాపిలాన్ కావడం విశేషం. -
అన్నదాతకు వెన్నుదన్ను
సాక్షి, శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): కష్టకాలంలో ఉన్న రైతులకు అండగా ఉంటామనే భరోసా కల్పిం చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి సాయం అందించడం లక్ష్యంగా ‘వైఎస్సార్ రైతు భరోసా’ అమలుకి రంగం సిద్ధమవుతోంది. లబ్ధిదారుల గుర్తింపు కోసం బుధవారం నుంచి సర్వే ప్రారంభించారు. కేవలం భూమి ఉన్న రైతులు మాత్రమే వర్తిస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం (పీఎంకేఎస్‌ఎన్‌ఎస్) లోని రైతుల వివరాలను పరిశీలించిడంతో పాటు పెద్ద కౌలు రైతులు గుర్తింపునకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 25న అర్హులు జాబితాను ప్రకటించనున్నారు. కిసాన్ పథకం కింద సన్న, చిన్నకారు రైతులకు కేంద్రం మూడు విడతలుగా మొత్తం రూ.6వేలు సాయం ఇస్తుండగా అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.6500 సాయం అందించనుంది. పెద్ద కౌలు రైతులకు రూ.12500 పూర్తి సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించనుంది. అక్టోబర్ 15వ తేదీ నుంచి ఒకే విడతగా పెట్టుబడి సా యం రైతులందరికీ అందించనుంది. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పీఎం కిసాన్ పథకం సాయం కేవలం భూమి కలిగిన సన్న, చిన్నకారు రైతులకు మాత్రమే అందుతోంది. ఏటా మూడు విడతల్లో రూ.6వేలు మొత్తాన్ని కేంద్రం జమ చేస్తోంది. కాగా ప్రతి రైతు కుటుంబానికి రూ.12500 చొప్పున ముందుగానే పెట్టుబడి సాయం అందిస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం అమలుకి చర్యలకు చేపట్టారు. అక్టోబర్ 15 నుంచి అమలుకానున్న అమలుకా నున్న ‘వైఎస్సార్ రైతుభరోసా’ పథకం కోసం లబ్ధిదారుల ఎంపికకు మార్గదర్శకాలను విడుదల చేశారు. పీఎం కిసాన్ పథకం కింద చిన్న, సన్నకారు రైతులకు అందించనున్న రూ. 6వేలుకి రాష్ట్ర ప్రభుత్వం రూ.6500 జమచేసి మొత్తం రూ.12500 చెల్లించనుంది. కౌలు, పెద్ద రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా రూ. 12500 చొప్పున ఒకే విడతలో అందజేయనుంది. రైతు భరోసాకు కౌలు రైతులు అర్హులే గ్రామ వలంటీర్ల ద్వారా కౌలు రైతుల గుర్తింపునకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రాథమిక సర్వేలో భాగంగా సొంత వ్యవసాయ భూమిలేని సాగుదారులను వలం టీర్ల గుర్తిస్తారు. కౌలుదారులకు చెందిన ఆధార్, రేషన్‌కార్డు, బ్యాంక్‌ఖాతా వివరాలు సేకరించి నిర్దేశిత ప్రొఫార్మాలో నమోదు చేసి వ్యవసాయ రెవెన్యూ అధికారులకు అందజేస్తారు. పరిశీలన అనంతరం లబ్ధిదారుల జాబితాలను అధికారులు, గ్రామ సభల్లో ప్రకటించి ఏమైనా మార్పులు, చేర్పులుంటే చేస్తారు. ఈ జాబితాలో మండల స్థాయిలో తహసీల్దార్, మండల వ్యవసాయ అధికారులు, డివిజన్ స్థాయిలో ఆర్డీఓ, ఏడీఏలు, పరిశీలిస్తారు. అనంతరం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగే సమావేశంలో తుది జాబితాను ఖరారు చేసి ఈ నెల 25న ప్రకటించనున్నారు. జిల్లాలో సాగు విస్తీర్ణం 2.55 లక్షల హెక్టార్లు కాగా అందులో సుమారు 5లక్షల మందికి పైగా రైతులున్నారు. వీరితో పాటు కౌలు రైతులు లక్ష మంది వరకు ఉంటారు. ఈ ఏడాది వరి సాగు 2.13లక్షల హెక్టార్లు లక్ష్యంగా నిర్ణయించారు. అంతేకాకుండా 36వేల హెక్టార్ల అపరాలు, మొక్కజొన్న, పత్తి, చెరుకు సాగు చేస్తున్నారు. మిగిలిన భూమిలో 6వేల హెక్టార్లలో కూరగాయల పంట సాగు చేస్తున్నారు. దీనిలో 3,11,590 లక్షల మంది రైతులు పీఎం కిసాన్ పథకం కింద లబ్ధిదారులను గుర్తించారు. పక్కాగా అనర్హులు ఏరివేతకు బుధవారం ఈ నెల 25వ తేదీ వరకు సర్వే నిర్వహించనున్నారు. పీఎం కిసాన్ జాబితాలో అధిక సం ఖ్యలో అనర్హులున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ జాబితా క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం రైతుల అందరికీ తెలిసే విధంగా పంచాయతీ కార్యాలయాల్లో వద్ద ప్రదర్శించనున్నారు. 2019 ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్ వరకు వెబ్‌ల్యాండ్‌లో జరిగిన మార్పులు, చేర్పులు, మ్యుటేషన్లలో గుర్తించిన రైతులు జాబితా ఆధారంగా గ్రామస్థాయిలో, వ్యవసాయ, రెవెన్యూ అధికారులు జాబితాలో స్పష్టమైన కారాణాలు పేర్కొంటూ జాబితా నుంచి తొలగిస్తారు. వెబ్‌ల్యాండ్‌లో ఇటీవల జరిగిన మార్పులు చేర్పులు వలన గుర్తించిన అనర్హత కలిగిన రైతులు ఇప్పటివరకు ఏ జాబితాలో నమోదు కానిరూతులు ఉంటే జాబితాలో చేరుస్తారు. రైతు భరోసాకు ఉండాల్సిన అర్హతలివే.. -ప్రధాన మంత్రి సమ్మాన్ నిధి కింద లబ్ధి పొందిన రైతులు కూడా వైఎస్సార్ రైతు భరోసాకు అర్హులే. -సొంతంగా భూమి ఉంటే 10సెంట్లు నుంచి 5ఎకరాలు ఉన్న ప్రతి రైతుకి ఈ పథకం వర్తిస్తుంది. -భూ యజమాని మరణిస్తే వారి వారసులు, భార్య ఉంటే వారి పేరున ఉన్న భూములు వివరాలను వెబ్‌ల్యాండ్‌లో మార్చుకోవాలి. ఒకే రేషన్‌కార్డులో గల కుటుంబ సభ్యుల్లో ఒకరికి మాత్రమే పథకం వర్తిస్తుంది. వ్యవసాయ ఉద్యానవన, పట్టు పరిశ్రమ నడిపే రైతులు, భూమిలేక కౌలుదారుగా సాగుచేస్తున్న రైతులు అర్హులే. -తల్లిదండ్రులు చనిపోతే వాళ్లకి ఉన్న వారసులులో మాత్రమే కౌలుకి చేసినట్లు అవుతుంది. -కౌలురైతుకి 50 సెంట్లు లేదా అంతకంటే ఎక్కువ సాగు చేస్తూ అతని పేరున భూమి లేకుంటే ఈ పథకం వర్తిస్తుంది. -భూ యజమాని అంగీకారంతో కౌలు రైతులకి ఈ పథకం వర్తిస్తుంది. -భూయజమాని తన భూమిని ముగ్గురు లేదా నలుగురికి కౌలుకిస్తే భూ యజమానితో పాటు ఆ కౌలు రైతుల్లో ఒక్కరికి మాత్రమే వర్తిస్తుంది. -డీ పట్టా భూముల్లో సాగు చేస్తున్న రైతులకి ఈ పథకం వర్తిస్తుంది. -ఆన్లైన్లో భూమి నమోదు కాని రైతుకి కూడా ఈ పథకం వర్తిస్తుంది. -ఉద్యానవన పంటలు పట్టుపరిశ్రమ చేస్తున్న రైతులకి వర్తిస్తుంది. -స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో గుమస్తాలు, క్లాస్–4 సిబ్బంది, గ్రూప్ డి ఉన్న రైతులకి ఈ పథకం వర్తిస్తుంది. -ఆధార్ నంబర్లు రిజిస్టర్ కాకుంటే వెంటనే నమోదు చేసుకోవాలి. అర్హులకు పథకం అందజేస్తాం.. వైఎస్సార్ రైతు భరోసాలో జిల్లాలో రైతులంతా వినియోగించుకునేందుకు ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పిస్తున్నాం. బుధవారం నుంచి గ్రామగ్రామాన రైతులకి పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. మూడు రకాల జాబితాల్లో ఉండే వివరాలు పరిశీలిస్తారు. అర్హులందరికి పధకం వర్తించేందుకు కృషి చేస్తున్నాం. రైతులతో సమావేశాలు ఏర్పాటుచేస్తున్నాం. దీన్ని వినియోగించుకుంటే రైతులకు ఎంతో లాభం చేకూరుతుంది. ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సాయంతో ఎంతోమంది రైతులకు ఊరటనిస్తుంది. ఈ నెల 25వరకు సర్వే చేయనున్నాం. రైతులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. – బి.జి.వి ప్రసాద్, వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్, శ్రీకాకుళం -
‘రియల్’ దగా
విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఎ) పరిధిలోని రణస్థలం మండలం కోస్టలో టీడీపీ నేత వేసిన అక్రమ లేఅవుట్ ఇది. 18 ఎకరాల విస్తీర్ణంలో వేసిన లేఅవుట్‌కు అనుమతుల్లేవు. కేవలం నాలా చెల్లించి చేతులు దులుపుకున్నారు. ఎటువంటి నిబంధనలు పాటించకుండా, అనుమతులు తీసుకోకుండా వేసిన లేఅవుట్లో ప్లాట్ల విక్రయాలు చేసేస్తున్నారు. వీఎంఆర్డీఎ పరిధిలోని ఎచ్చెర్ల మండలం తోటపాలెం పంచాయతీ శివారు దుప్పలవలసలో వేసిన లేఅవుట్ ఇది. మొక్కలు, తుప్పలు మొలిచేసి ఎంత అధ్వాన్నంగా ఉందో ఈ చిత్రం చూస్తే అర్థమవుతుంది. కానీ ఈ లేఅవుట్లో ప్లాట్ల విక్రయాలే కాక.. మారు అమ్మకాలు కూడా జరిగాయి. విశేషమేమిటంటే ఈ లేఅవుట్ స్థలం కనీసం కన్వర్షన్ కూడా జరగలేదు. కన్వర్షన్ ఫీజు చెల్లిం చి, నిబంధనల మేర ప్రభుత్వానికి వదిలేసి రెవెన్యూ అధికారుల అనుమతి మేరకు వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకోవాలి. కానీ అటువంటిదేమీ చేయకుండా అడ్డగోలుగా లేఅవుట్ వేసేసి విక్రయాలు జరిపేశారు. తాజాగా ఎచ్చెర్ల మండలంలో 12 అనధికార లేఅవుట్లను విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ల్యాండ్ కన్వర్షన్ చేయకుండా లేఅవుట్ వేయడంతో సుమారు రూ.26 కో ట్ల మేర అపరాధ రుసుము విధించారు. తాజాగా కంచిలి, పూండి, గరుడుభద్రలో అనధికారికంగా వేసిన లేఅవుట్ల వ్యవహారం కలెక్టర్ జె.నివాస్ దృష్టికి వచ్చింది. వీరి ఆదేశాల మేరకు డిస్ట్రిక్ట్ టౌన్ కంట్రీ ప్లానింగ్ ఆఫీసర్ (డీటీసీపీఓ) తన బృందంతో కలిసి వాటిని పరిశీలించి చర్యలకు ఆదేశించారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. గత ఐదేళ్ల కాలంలో ఇలాంటి అక్రమ లేఅవుట్లు లెక్కలేనన్ని వెలిశాయి. కానీ అధికారుల దృష్టికొచ్చినవి కేవలం 290 మాత్రమే. నోటీసులు జారీ చేసి, గట్టిగా ఒత్తిడి చేయడంతో వీటిలో 14 లేఅవుట్లకు సంబంధించి అనుమతులు తీసుకున్నారు. మిగతా వారు మొండికేశారు. అందమైన బ్రోచర్లతో ఆకట్టుకున్నారు. అభివృద్ధి చెందిన ప్రాంతమని మభ్యపెట్టారు. వీఎంఆర్డీఎ పరిధిలో ప్లాట్ అంటే ఆషామాషీ కాదని ఊహాల్లో ఊరేగించారు. లేఅవుట్లో స్థలం తీసుకుని ఇల్లు కట్టుకుంటే ఉన్న పళంగా విలువ పెరిగిపోతుంది.. ప్లాట్ తీసుకుంటే సంవత్సరంలోనే రెట్టింపు అయిపోతుందని అరచేతిలో వైకుంఠం చూపించారు. ఇంకేముంది సొంతిల్లు కట్టుకుందామని... తమ పిల్లల కోసం స్థలం కొని పెట్టుకుందామని కలలు కన్న ఎంతోమంది రియల్టర్ల చేతిలో మోసపోయారు. అమ్మేసిన తర్వాత కొంతమంది రియల్టర్లు పత్తా లేకుండా పోయారు. క్రయవిక్రయాలు జరిగేంతవరకు చోద్యం చూసిన అధికారులు ఆలస్యంగా మేల్కొని నోటీసులు జారీ చేసే కార్యక్రమం చేపట్టారు. పొజిషన్లో ఉన్న కొనుగోలుదారులు బుక్ అయిపోయారు. లేఅవుట్ వేసినవాళ్లు ఎక్కడో ఉన్నారు. అమ్మకాలు జరిపేసి చేతులు దులుపుకున్నారు. కొందరైతే పలాయనం చిత్తగించారు. ప్రస్తుతానికైతే కొనుగోలు చేసినవాళ్లు స్థలాల్లో ఉన్నారు. అధికారులు నోటీసులిస్తే గాని తెలియలేదు అది అక్రమ లేఅవుట్ అని. నోటీసులందుకున్నాక ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అక్కడా ఇక్కడా అని కాకుండా జిల్లావ్యాప్తంగా అక్రమార్కుల చేతిలో నష్టపోయిన వారు ఉన్నారు. లేఅవుట్ వేసినోళ్లు స్థానికంగా లేకపోవడం... ఆ ప్లాట్లలో కొనుగోలుదారులుండటంతో అధికారికంగా పొజిషన్లో ఉన్న వారిపైనే చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ప్రలోభాలో, ముడుపులో తెలియదు గాని అనుమతి లేకుండా లేఔట్లు వేసినప్పుడు అధికారులు చూసీచూడనట్టు వదిలేశారు. కొనుగోళ్లు అయిపోయేంతవరకు చోద్యం చూశారు. ఇప్పుడేమో చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు కొనుగోలుదారులపై పడుతున్నారు. ఇదీ విధానం.. లేఅవుట్ వేయాలంటే ముందుగా డిస్ట్రిక్ టౌన్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) లేదా విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఎ) అనుమతులు తీసుకోవాలి. అంతకుముందే లేఔట్ వేసే భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకోవాలి. దీనికి రెవెన్యూ అధికారులను సంప్రదించాలి. నిర్దేశిత రుసుం చెల్లించి ల్యాండ్ కన్వర్షన్ చేయించుకోవాలి. వ్యవసాయేతర భూమిగా మార్పు పొందాక డీటీసీపీ, వీఎంఆర్డీఎ నుంచి అనుమతి తీసుకోవాలి. లేఅవుట్ అనుమతి తీసుకునేముందు విస్తీర్ణంలో 10 శాతం కామన్‌సైట్ (సామాజిక స్థలం) కేటాయించాలి. విస్తీర్ణంలో 25 శాతం మేర రోడ్లు వేయాలి. వేసిన రోడ్లకు ఆనుకుని మొక్కలు నాటాలి. కాలువలు, విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయాలి. ఇవన్నీ సక్రమంగా ఉంటేనే డీటీసీపీ లేదా వీఎంఆర్డీఎ అధికారులు లేఅవుట్ అనుమతిస్తారు. ఇవన్నీ చేస్తే గిట్టుబాటు కాదని, ఏదో ఒక కొర్రీ పెట్టి ఇబ్బంది పడతామనే ఉద్దేశంతో అక్రమ రియల్టర్లు అనుమతులు తీసుకోకుండానే చాలా చోట్ల లేఅవుట్లు వేసేశారు. అధికారికంగా 276 అక్రమ లేఅవుట్లు.. జిల్లాలో 290 అక్రమ లేఅవుట్లు ఉన్నట్టు అటు డీటీసీపీ, వీఎంఆర్డీఎ అధికారులు, ఇటు పంచాయతీ, విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో వెలుగు చూశాయి. లేఅవుట్ అనుమతి ఫీజుతోపాటు ఓపెన్ సైట్ కేటాయించకపోవడం వలన ప్రభుత్వ ఆదాయానికి రూ.100 కోట్ల మేర నష్టం వాటిల్లింది. అనధికార లేఅవుట్లపై చర్యలు తీసుకోవాలని వీఎంఆర్డీఎ, డీటీసీపీ, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆదేశాలు జారీ చేస్తుండగా, క్షేత్రస్థాయిలో ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు కొరవడ్డాయి. కేవలం 14 లేఅవుట్ యజమానులు మాత్రమే తర్వాత అనుమతులు తీసుకున్నారు. మిగతా 276 లేఅవుట్లకు సంబంధించి నేటికీ అనుమతుల్లేవు. ఇవి కేవలం అధికారికంగా గుర్తించినవి. ఇక అధికారుల దృష్టికి రానివెన్నో ఉన్నాయి. వాస్తవానికైతే, అనధికార లేఅవుట్లలో చాలా వరకు ప్లాట్లు అమ్ముడైపోయాయి. వాటిలో దాదాపు నిర్మాణాలు జరిగిపోయాయి. లేఅవుట్లు వేసినోళ్లు అందుబాటులో ఉండటం లేదు. వారెక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకుంది. ప్రస్తుతం కొనుగోలుదారులే అక్కడుంటున్నారు. ఇవి అనధికార లేఅవుట్లని, ప్రభుత్వానికి ఫీజు కట్టాలని పంచాయతీ సిబ్బంది అడుగుతుంటే.. తామెక్కడ కట్టగలమని, లేఅవుట్ వేసినోళ్లను అడగండని చెబుతున్నారు. దాంతో తమకు సంబంధం లేదని, కొనుగోలు చేసినప్పుడు సక్రమమా, అక్రమమా? అన్నది చూసుకోవాలని, ఎవరైతే అనుభవంలో ఉన్నారో వారే చెల్లించాలని సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక నివాసితులు అందోళన చెందుతున్నారు. కొందరైతే అనుమతుల్లేవని ప్లాన్ అప్రూవల్ లభించక, లక్షలాది రూపాయలు చెల్లించి కొనుగోలు చేసిన ప్లాట్లలో నిర్మాణాలు చేపట్టలేక ఆవేదన చెందుతున్నారు. మరోవైపు ఎటువంటి అనుమతులు లేని అక్రమ లేఅవుట్లు కావడంతో డ్రైనేజీ, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర సౌకర్యాల కల్పన విషయాన్ని అధికారులు సైతం పట్టించుకోవడం లేదు. దీంతో నివాసితులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అక్రమ లేఅవుట్లు.. శ్రీకాకుళం డివిజన్ 223 టెక్కలి డివిజన్ 20 పాలకొండ డివిజన్ 33 అక్రమ లేఅవుట్లపై డ్రైవ్ పెడతాం.. జిల్లాలో ఉన్న అక్రమ లేఅవుట్లపై సంబంధిత శాఖలతో కలిసి డ్రైవ్ పెడతాం. ఇప్పటికే కొన్ని చోట్ల గుర్తించి చర్యలకు సూచించాను. ఎన్ఫోర్స్మెంట్ ఉన్న శాఖలతో లేఅవుట్లపై చర్యలు తీసుకుంటాం. – పి.నాయుడు, డిస్ట్రిక్ట్ టౌన్ కంట్రీ ప్లానింగ్ అధికారి -
పేద్ద నోట్లు వచ్చాయ్
ముందు వైపు.. రూ. 500 1. లైటు వెలుతురులో 500 అంకెను గమనించవచ్చు 2. 45 డిగ్రీల కోణంలో చూస్తే 500 అంకెను గమనించొచ్చు 3. దేవనాగరి లిపిలో 500 సంఖ్య. 4. మధ్య భాగంలో మహాత్మా గాంధీ బొమ్మ 5. నోటును కొంచెం వంచితే విండోడ్ సెక్యూరిటీ త్రెడ్ ఆకుపచ్చనుంచి నీలంకు మారుతుంది. మధ్యలో భారత్, ఆర్బీఐ, 500 అంకె ఉంటుంది. 6. గవర్నర్ సంతకం, ఆర్బీఐ చిహ్నం కుడివైపునకు మార్చారు. 7. మహాత్మాగాంధీ బొమ్మ, ఎలక్ట్రోటైప్(500) వాటర్‌మార్క్ 8. పై భాగంలో ఎడమ వైపున, కింది భాగంలో కుడివైపున సంఖ్యలతో కూడిన నంబర్ సైజ్ ఎడమ నుంచి కుడికి పెరుగుతుంది. 9. కుడివైపున కిందిభాగంలో రంగు మారే ఇంక్(ఆకుపచ్చ నుంచి నీలం)లో రూపాయి చిహ్నంతోపాటు సంఖ్యల్లో డినామినేషన్ ఉంటుంది. 10. కుడివైపున అశోక స్తూపం చిహ్నం అంధుల కోసం: మహాత్మా గాంధీ బొమ్మ, అశోక స్థూపం చిహ్నం, నల్ల గీతలు, గుర్తింపు చిహ్నం చెక్కినట్లుగా లేదా ఉబ్బెత్తుగా ఉంటారుు. 11. కుడివైపున ఉబ్బెత్తుగా ముద్రించిన రూ.500 ఉన్న వృత్తం 12. కుడి, ఎడమ వైపున ఉబ్బెత్తుగా ముద్రించిన ఐదు నల్ల గీతలు వెనుకవైపు.. 13. నోటు ముద్రణ సంవత్సరం ఎడమవైపున ఉంటుంది. 14. స్వచ్ఛభారత్ లోగో 15. అధికార భాషలు 16. భారత వారసత్వ ప్రదేశం ఎర్రకోటపై జాతీయ జెండా 17. కుడివైపున దేవనాగరి లిపిలో రూ.500 సంఖ్య ముందువైపు.. రూ. 2000 1. లైటు వెలుతురులో 2000 అంకెను గమనించవచ్చు 2. 45 డిగ్రీల కోణంలో చూస్తే 2000 అంకెను గమనించొచ్చు 3. దేవనాగరి లిపిలో రూ.2000 సంఖ్య 4. మధ్య భాగంలో మహాత్మా గాంధీ బొమ్మ 5. చిన్న అక్షరాల్లో ఆర్బీఐ, 2000 6. నోటును కొంచెం వంచితే విండోడ్ సెక్యూరిటీ త్రెడ్ ఆకుపచ్చనుంచి నీలానికి మారుతుంది.మధ్యలో భారత్, ఆర్బీఐ, 2000 అంకె ఉంటుంది. 7. గవర్నర్ సంతకం, ఆర్బీఐ చిహ్నం కుడివైపునకు మార్పు 8. మహాత్మాగాంధీ బొమ్మ, ఎలక్ట్రోటైప్(2000) వాటర్‌మార్క్ 9. పై భాగంలో ఎడమ వైపున, కింది భాగంలో కుడివైపున సంఖ్యలతో కూడిన నంబర్ సైజ్ ఎడమ నుంచి కుడికి పెరుగుతుంది. 10. కుడివైపున కింది భాగంలో రంగు మారే ఇంక్ (ఆకుపచ్చ నుంచి నీలం)లో రూపారుు సింబల్తోపాటు 2000 సంఖ్య. 11. కుడివైపున అశోక స్తూపం చిహ్నం అంధుల కోసం: మహాత్మా గాంధీ బొమ్మ, అశోక స్థూపం చిహ్నం, నల్ల గీతలు, గుర్తింపు చిహ్నం చెక్కినట్లుగా లేదా ఉబ్బెత్తుగా ఉంటారుు 12. కుడివైపున ఉబ్బెత్తుగా ముద్రించిన 2000 ఉన్న దీర్ఘచతురస్రాకారం 13. కుడి, ఎడమ వైపున ఉబ్బెత్తుగా ముద్రించిన ఏడు నల్ల గీతలు వెనుకవైపు 14. నోటు ముద్రణ సంవత్సరం ఎడమవైపున ఉంటుంది. 15. నినాదంతో సహా స్వచ్ఛభారత్ లోగో 16. అధికార భాషలు 17.‘మంగళయాన్’ చిత్రం -
ప్రాచీన మానవ జాతి శిలాజం గుర్తింపు
భూమిపై అంతరించిన అనేక మానవ జాతుల్లో ఇంకా చాలా వరకు గుర్తించాల్సి ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇథియోపియాలో పరిశోధకులు ఇటీవల ప్రాచీన మానవ జాతి శిలాజాన్ని గుర్తించారు. 3.3-3.5 మిలియన్ల సంవత్సరాల కాలం నాటి మానవ శిలాజం ఇథియోపియాలోని అఫర్ ప్రాంతంలో లభించింది. నలుగురు వ్యక్తులకు చెందిన దవడ ఎముకల్ని, దంతాల్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవి కోతి, మానవ ఆనవాళ్లు రెండింటినీ కలిగి ఉంది. దవడ చాలా బలంగా ఉండగా, దంతాలు చాలా చిన్నగా ఉన్నాయి. ఈ శిలాజం కూడా హుమానియన్ మానవ జాతులు నివసించినప్పటి కాలం నాటివేనని శాస్త్రవేత్తలు అంటున్నారు. మానవ జాతుల గురించి కనుక్కోవడం ఇప్పటివరకు అనుకున్న దాని కంటే ఇంకా క్లిష్టమైనదని పరిశోధకులు అంటున్నారు. ఇది కూడా హుమానియన్ కాలానికి చెందిన మానవ జాతే అని, ఒక జాతి తర్వాత మరో జాతి జీవించి ఉండవచ్చని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. ఇతర జాతులతో పోలిస్తే హుమానియన్ జాతి మానవులు అత్యంత శక్తిమంతమైన వారు. ఈ కొత్త జాతికి వీరు ఆస్ట్రాలోపిథెకస్ డెయిరెమెడా అనే పేరు పెట్టారు. అఫర్ ప్రాంతంలోని స్థానిక భాష మాట్లాడేవారికి దగ్గరివారని దీనర్థం. -
బినామీల గుండెల్లో... ‘ఆధార్’ రైళ్లు!
వెలుగుచూసిన 615 నకిలీ పాస్ పుస్తకాలు రాయితీలకు ఇక మంగళం! అనకాపల్లి : ఆధార్ అనుసంధానం బినామీల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. ఇన్నాళ్లు అక్రమంగా లబ్ధిపొందుతున్న వారికి కొమ్ముకాసే మధ్యవర్తులకు సైతం ఏం చేయాలో అర్థం కావడం లేదు. అన్ని అర్హతలు ఉండీ ప్రభుత్వ పథకాలు పొందలేని వారు కొందరుంటే, అడ్డదారిలో ఒక్కో పథకాన్ని రెండు ప్రాంతాల్లో రెండు సార్లు పొందిన ఘనులూ ఉన్నారు. ఇప్పుడు వీరి కథ బట్టబయలవుతోంది. పాసు పుస్తకాలు, రేషన్ కార్డు, అంగన్ వాడీ కేంద్రాలు, వసతి గృహ విద్యార్థులు, మధ్యాహ్న భోజన పథకం విద్యార్థులు, డ్వాక్రా గ్రూపులు, విద్యుత్ వినియోగదారులు ఇలా అన్ని వ్యవస్థల్లోని లబ్ధిదారుల వివరాలు ఆధార్‌తో అనుసంధానం కావడంతో అసలు రంగు బయటపడుతోంది. కార్డుల రద్దు అనకాపల్లిలో 10 రోజుల వ్యవధిలో రేషన్ కార్డుల ఆధార్ గణాంకాల అప్డేషన్లో 6,924 కార్డులను రద్దు చేశారు. రేషన్ కార్డుల ఆధార్ అనుసంధానంలో భాగంగా ఎన్రోల్మెంట్ ఐడెంటిఫికేషన్ నంబర్లు అధికంగా ఉండటంతో ఉన్నతాధికారులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఇక రెండేసి పాసు పుస్తకాలు పొందిన ఘనులు అనకాపల్లి పట్టణం, మండలంలోనూ ఉన్నారు. ఈ రెండు చోట్ల 23వేల 483 రేషన్ కార్డులుండగా, 13 వేల 311 పాసు పుస్తకాల ఆధార్‌ను అనుసంధానం చేశారు. వీటిలో 615 పాసు పుస్తకాలు నకిలీవని అధికారులు తేల్చారు. మిగిలిన ప్రభుత్వ పథకాల అర్హత విషయంలో మాన్యువల్ ద్వారా అక్రమాలు జరిపేందుకు అవకాశం ఉన్నప్పటికీ ఆన్లైన్ ద్వారా ఆధార్ నంబర్ అనుసంధానం చేయడం వల్ల పూర్తి పారదర్శకత లభిస్తుంది. అయితే ఇన్నాళ్లు ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు అందించే విషయంలో నైపుణ్యం ప్రదర్శించి లబ్ధిదారుల నుంచి నొక్కేసిన మధ్యవర్తులకు ఇప్పుడు గడ్డుకాలం వచ్చి పడింది. విద్యార్థులు పేర్లను అటూ, ఇటూ మార్చి మధ్యాహ్న భోజనం, వసతి గృహాల భోజనం మెనూను అధికంగా చూపించిన అధికారులు ఆధార్ ద్వారా వారి వివరాలను సైతం నమోదు చేయడం, విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల వ్యవహారాన్ని నిశిత దృష్టితో చూడటంతో ఇక మోసాలకు తావులేకుండా ఉండేందుకు అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. తాజాగా సామాజిక, ఆర్థిక, కుల గణన ఆధార్‌తో ప్రభుత్వ పథకాల లబ్ధి విషయంలో ఇబ్బందులు పడుతున్న అక్రమార్కులకు తాజాగా సామాజిక, ఆర్థిక, కుల గణన నమోదు కొత్త చిక్కులను తెచ్చిపెడుతోంది. ఈ నెల10 నుంచి 19వ తేదీన వరకూ సంబంధింత గణనలో వివరాలను మార్పులు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. 2011లో చేసిన సర్వే మేరకు ఆర్థిక, సామాజిక, కుల గణన వివరాలు ఇప్పటికే పంచాయితీలకు చేరాయి. ఈ కారణంగా కుటుంబ సభ్యుల పేర్లు, వృత్తి, విద్యార్హతలు, ఇంటి స్థితిగతులు, కుల, సామాజిక నేపథ్యం రికార్డు పరంగా ఆన్లైన్లో నమోదయితే ఇక మోసాలకు తావుంటే అవకాశం ఉండదు. తద్వారా బలహీన వర్గాలకు చెందిన వారు పొందాల్సిన పథకాలు ఇక అక్రమార్కుల దరి చేరవు. ఈ గణనలో ప్రతి ఒక్కరి వివరాలు యథాతథంగా నమోదైతే రాయితీలు హుళక్కే. -
గుర్తింపు ఫీట్లు!
ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్: ఏదైనా ఒక కోర్సుకు సంబంధిత అధీకృత సంస్థ గుర్తింపు పొందాలంటే.. అందుకు తగిన వనరులు సిద్ధం చేయాలి. సౌకర్యాలు కల్పించాలి. ఆ తర్వాత ఇంకా ఏమైనా చిన్నచిన్న లోటుపాట్లు ఉంటే అప్పటికప్పుడు సర్దుబాటు చేసుకోవడంలో తప్పులేదు గానీ.. కనీస సౌకర్యాలే కల్పించకుండా నిర్లక్ష్యం వహించి.. తీరా పరిశీలక బృందం వచ్చే ముందు హడావుడి పడి.. లేనివి ఉన్నట్లు చూపించడానికి ప్రయత్నించడం.. అది కూడా గౌరవప్రదమైన విశ్వవిద్యాలయం స్థాయిలో జరగడం విడ్డూరమే. ఇంత చేసినా పరిశీలక బృందాన్ని పూర్తిగా సంతృప్తిపరచగలిగారా అంటే అదీ లేదు. బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న ఎంఈడీ కోర్సుకు గుర్తింపు సాధించేందుకు అక్కడి అధికారులు పడిన తంటాలు అన్నీ ఇన్నీ కావు. ఈ కోర్సుకు అవసరమైన వసతులు వర్సిటీలో ఉన్నాయా లేవా అన్నది పరిశీలించేందుకు బెంగళూరు నుంచి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్(ఎన్సీటీఈ)కు చెందిన ప్రొఫెసర్ శ్రీకాంత ప్ప, ఎడ్వర్డ్ విలియం బెంజ్‌మన్ , తదితరులతో కూడిన బృందం బుధవారం వచ్చినప్పుడు ఈ సంఘటనలు చోటుచేసుకున్నాయి. గుర్తింపు తప్పనిసరి ఎంఈడీ కొనసాగాలంటే ఎన్సీటీఈ గుర్తింపు తప్పనిసరి. ఆ గుర్తింపు పొందాలంటే కొన్ని నిబంధనలు పాటించాలి. పూర్తిస్థాయిలో సౌకర్యాలు సమకూర్చుకోవాలి. ఇంతవరకు ఆంధ్రా యూనివర్సిటీ అనుబంధ సంస్థగా కొనసాగడంతో అభ్యంతరాలు లేకుండా కోర్సు కొనసాగుతోంది. ఇకముందు మాత్రం ఎన్సీటీఈ గుర్తింపుపైనే కోర్సు మనుగడ ఆధారపడి ఉంటుంది. వర్సిటీలో ప్రస్తుతం 40 మంది ఎంఈడీ కోర్సు చేస్తున్నారు. ఆంధ్రా యూనివర్సిటీ సెట్ (ఆసెట్) ద్వారా అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు. ఈ కోర్సుకు డిమాండు ఉండటంతో సీట్లన్నీ నిండిపోతున్నాయి. అయితే తరగతుల నిర్వహణకు వనరులు, సౌకర్యాలే అంతంతమాత్రంగా ఉన్నాయి. సోషల్ వర్కు బ్లాకులో ఒక తరగతి గది, మరో చిన్న గదిలో సైకాలజీ ల్యాబ్ నిర్వహిస్తున్నారు. కామన్ లైబ్రరీలో ఈ కోర్సుకు చెందిన కొన్ని పుస్తకాలు మాత్రమే ఉన్నాయి. ఈ విభాగానికి ప్రత్యేక లైబ్రరీ అంటూ లేదు. ఎన్సీటీఈ బృందం పరిశీలన సమయంలో మాత్రం వర్సిటీ అధికారులు మసి పూసి మారేడుకాయ చేసేందుకు ప్రయత్నించారు. లేనిది ఉన్నట్లు.. లైబ్రరీ బ్లాక్ మొత్తం ఎంఈడీ కోర్సుకు ఉపయోగిస్తున్నట్లు చూపారు. ఇందులో ప్రస్తుతం నిర్వహిస్తున్న ఎల్ఎల్బీ మూడేళ్లు, ఎల్ఎల్ఎం మొదటి ఏడాది, రూరల్ డెవలప్మెంట్ రెండో ఏడాది, తెలుగు మొదటి, ద్వితీయ ఏడాది తరగతులను వేరే చోటకు మార్చేశారు. కామన్ సిల్వర్ జూబ్లీ లైబ్రరీని పూర్తిస్థాయి ఎంఈడీ గ్రంథాలయంగా చూపేందుకు ప్రయత్నించారు. డిపార్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథాలయంగా గ్లోసైన్ ఏర్పాటు చేశారు. తరగతి గదులతో పాటు, సైకాలజీ ల్యాబ్, కంప్యూటర్ ఎడ్యుకేషన్ ల్యాబ్ ,ఐసీటీ ల్యాబ్, స్టాఫ్ రూమ్, మల్టీపర్పస్ హాల్, కామన్ రూమ్స్ ఉమెన్, మెన్, ఎస్‌యూపీడబ్ల్యూ రూం, సెమినార్ హాల్.. ఇలా అన్ని గదుల ముందు స్టిక్కర్లు అతికించారు. ఇన్ని చేసినా పలు లోపాలు బయటపడ్డాయి. ఎన్సీటీఈ నిబంధనల మేరకు తరగతి గదులు తగిన విస్తీర్ణంలో లేవు, లైబ్రరీలో పూర్తిస్థాయిలో పుస్తకాలు లేవు. రెగ్యులర్ బోధకులు కూడా లేరు. ఉన్న టీచింగ్ అసోసియేట్లకు నిబంధనల మేరకు జీతాలు చెల్లించడం లేదు. డిపార్ట్మెంట్ హెడ్ సైతం లేరు. ప్రస్తుతం డాక్టర్ హెచ్.సుబ్రమణ్యం (కోర్సు కోఆర్డినేటర్) ,డాక్టర్ సంధ్యారాణి, డాక్టర్ స్వామినాయుడు, డాక్టర్ శ్రీనివాస్ ఉన్నారు. ఈ ప్యాకల్టీతో సంబంధం లేని బీఎడ్ మెంటల్లీ రిటర్డ్ టీచింగ్ అసోసియేట్ డాక్టర్ యడ్ల రవికుమార్‌ను అతిధి బోధకునిగా చూపించారు. బృందం పరిశీలన అనంతరం రెక్టార్ చంద్రయ్య విలేకరులతో మాట్లాడుతూ కోర్సు కొనసాగించాలంటే ఈ మాత్రం పాట్లు పడటంలో తప్పులేదని చెప్పటం కొనమెరుపు. -
నాక్ గుర్తింపు తప్పనిసరి
ఏఎన్‌యూ, న్యూస్‌లైన్ :యూజీసీ నిధులు పొందుతున్న కళాశాలలకు నాక్ గుర్తింపు తప్పకుండా ఉండాలని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య కె.వియ్యన్నారావు స్పష్టం చేశారు. యూనివర్సిటీ కమిటీ హాలులో సోమవారం వీసీ అధ్యక్షతన వర్సిటీ పరిధిలోని 2ఎఫ్, 12బీ గుర్తింపు ఉన్న కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో సమావేశం జరిగింది. వీసీ మాట్లాడుతూ నాక్ గుర్తింపు(అక్రిడిటేషన్) లేకపోతే నిధులు నిలిపివేస్తామని యూజీసీ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిందని ఆ సమాచారాన్ని అన్ని కళాశాలలకు పంపామన్నారు. ఆ జాబితాలో ఉన్న కళాశాలలు వెంటనే నాక్ అక్రిడిటేషన్ చేయించుకోవాలని సూచించారు. దీని కోసం యూనివర్సిటీ నుంచి పూర్తి సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కళాశాలలు కోరితే యూనివర్సిటీ నుంచి రిసోర్స్ పర్సన్స్‌ను కూడా నియమిస్తామని చెప్పారు. ఈఏడాది జూన్ ఒకటో తేదీలోగా నాక్ అక్రిడిటేషన్ చేయించుకోకపోతే వచ్చే ఏడాది ఏప్రియల్ ఒకటి నుంచి నిధులు నిలిచిపోతాయన్నారు. రెక్టార్ ఆచార్య వై.పి.రామసుబ్బయ్య, రిజిస్ట్రార్ ఆచార్య పి. రాజశేఖర్‌లు వివిధ అంశాలపై కళాశాలల ప్రిన్సిపాల్స్‌కు సూచనలిచ్చారు. కళాశాలల వారు వ్యక్తం చేసిన పలు సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో సీడీసీ డీన్ ఆచార్య జి.వి.చలం, అనుబంధ కళాశాలల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు. -
కొత్త ఓటర్లకు 25న గుర్తింపు కార్డులివ్వండి
ఏలూరు, న్యూస్‌లైన్ :జిల్లాలో కొత్తగా నమోదైన ఓటర్లకు జనవరి 25న ఉచితంగా ఫొటో ఓటరు గుర్తిం పు కార్డులు అందించాలని కలెక్టర్ సిద్ధార్థజైన్ తహసిల్దార్లకు ఆదేశాలిచ్చారు. ఇందుకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని మండల అధికారులతో శుక్రవారం ఆయన మాట్లాడారు. ఎన్నికల సందర్భంలో ఓటర్లందరికీ ఫొటో ఓటరు స్లిప్‌లను ప్రభుత్వపరంగానే అందించేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. జనవరి 16న ఓటర్ల తుదిజాబితా ప్రకటించి, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు అందించాలన్నారు. తరచూ గుర్తింపు పొందిన రాజకీయ పక్షాల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించడం ద్వారా ఓటర్ల జాబితాల విషయంలో ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా చూడాలని కలెక్టర్ సూచించారు. ఇటీవల ప్రత్యేక డ్రైవ్ ద్వారా వచ్చిన 1.55 లక్షల ఓటర్ల దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించి, ఓటర్ల జాబి తాలను సిద్ధం చేయాలన్నారు. సుమోటాగా చేపట్టే తొలగింపులను ఏకపక్షంగా చేయడానికి వీల్లేదని, సరైన రీతిలో విచారణ చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు ఓటర్ల నమోదు డేటా ఎంట్రీని పూర్తి చేసుకోవాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు, జిల్లా రెవెన్యూ అధికారి కె.ప్రభాకరరావు, డీపీవో అల్లూరి నాగరాజువర్మ, ఏలూరు ఆర్డీవో బి.శ్రీనివాసరావు, ఇందిరాసాగర్ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ నాగలక్ష్మి పాల్గొన్నారు.