పాపిలాన్‌ పట్టేస్తోంది! | Poplin Identification System Got Positive Results In Hyderabad | Sakshi
Sakshi News home page

పాపిలాన్‌ పట్టేస్తోంది!

Published Wed, Oct 23 2019 3:33 AM | Last Updated on Wed, Oct 23 2019 3:33 AM

Poplin Identification System Got Positive Results In Hyderabad - Sakshi

ఓ యువకుడు గతంలోని తన నేర చరితను దాచి పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకున్నాడు. కానీ ‘పాపిలాన్‌’సాంకేతికత అతడి పాపాల చిట్టా గుట్టువిప్పింది.

సికింద్రాబాద్‌ స్టేషన్‌ పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వేలిముద్రలు పరీక్షించగా.. ఓ వ్యక్తిని చంపేందుకు తిరుగుతున్న పాత నేరస్తుడిగా గుర్తించారు.
– సాక్షి, హైదరాబాద్‌

తెలంగాణ నేర దర్యాప్తు సంస్థ (సీఐడీ) లోని ఫింగర్‌ప్రింట్‌ విభాగం (ఎఫ్‌పీబీ) సమకూర్చుకున్న ‘పాపిలాన్‌ ఐడెంటిఫికేషన్‌ సిస్టమ్‌’నేరగాళ్ల గుర్తింపు ప్రక్రియలో అద్భుత ఫలితాలిస్తోంది. 2017లో రష్యా నుంచి దిగుమతి చేసుకున్న పాపిలాన్‌–ఏఎఫ్‌ఐఎస్‌ (ఆటోమేటె డ్‌ ఫింగర్‌ అండ్‌ పామ్‌ ఐడెంటిఫికేషన్‌ సిస్ట మ్‌) ప్రపంచస్థాయి సాంకేతికత రాష్ట్ర పోలీసులకు నేర దర్యాప్తులో కీలకంగా మారింది. అమెరికా జాతీయ దర్యాప్తు సంస్థ, ఇంటర్‌పోల్‌ మాత్రమే వినియోగించే ఈ టెక్నాలజీ మన పోలీసులు వినియోగిస్తుండటంతో నేరదర్యాప్తులో అద్భుత పురోగతి కన్పిస్తోంది.

ఏంటి ఈ సాంకేతికత? 
పాపిలాన్‌ అంటే ఫ్రెంచ్‌ భాషలో సీతాకోకచిలుక అని అర్థం. రష్యాకు చెందిన పాపిలాన్‌ అనే సంస్థ దీనిని అభివృద్ధి చేసింది. బయోమెట్రిక్‌ వ్యవస్థలో పాపిలాన్‌ నెక్ట్స్‌ జెనరేషన్‌ సాం కేతికత అని చెప్పొచ్చు. వేలిముద్రలు, అర చేతి ముద్రల ఎలక్ట్రానిక్‌ డేటాబేస్‌ను రూపొందించడం, నిక్షిప్తం చేయడం, వెతికిపెడుతుం ది పాపిలాన్‌. నేర పరిశోధనకు కచ్చితమైన సమాచారాన్ని క్షణాల్లో∙క్రోడీకరించి ఇస్తుంది. దొంగతనాలు, దోపిడీలు జరిగిన స్థలాల్లో సేకరించిన వేలిముద్రలను విశ్లేషించి అది ఎవరు చేశారో గుర్తించి క్షణాల్లో పోలీసులకు చెప్పేస్తుంది. ఇందులో పేపర్‌ మీద లైవ్‌ స్కానర్స్‌ సాయంతో వేలిముద్రలను సేకరిస్తారు. భారత్‌లో ఇలాంటి సాంకేతికత కలిగిన తొలి రాష్ట్రం తెలంగాణే కావడం గమనార్హం. ‘మొబైల్‌ సెక్యూరిటీ చెక్‌ సిస్టమ్‌’ను కూడా కలిగి ఉంది. అనుమానితుల నేరచరిత్ర మొత్తం 5 నుంచి 10 సెకన్లలో అధికారి ట్యాబ్లెట్‌ పీసీ మీద ప్రత్యక్షమవుతుంది.

సాధించిన విజయాలు.. 
►మొత్తం 1,345 దొంగతనాలు, దోపిడీలు లాంటి కేసుల్లో నేరస్తులను గుర్తించి వారి నుంచి రూ.19.49 కోట్ల ఆస్తిని స్వాధీనం చేసుకోవడంలో కీలకంగా వ్యవహరించింది. వీటిలో 700 పాత కేసులు. 
►72 కేసుల్లో గుర్తు తెలియని మృతదేహాలను గుర్తించడంలో దోహదపడింది. 
►మొబైల్‌ సెక్యూరిటీ సిస్టమ్‌ చెక్‌ ద్వారా అనుమానాస్పద పరిస్థితుల్లో సంచరిస్తున్న 8,850 మంది నేరచరితులను గుర్తించింది. 
►నేరచరిత్రను దాచి కొత్త పాస్‌పోర్టు పొం దాలనుకున్న 60 మందిని గుర్తించింది. 
►పేరు, చిరునామా మార్చుకుని తిరుగు తు న్న 49 మంది నేరగాళ్లను గుర్తించింది. 
►మన రాష్ట్రంలోనే కాదు.. ఇతర రాష్ట్రాల్లో జరిగిన నేరాలను సైతం విశ్లేషించి, 20 మంది నేరస్తులను గుర్తించి ఆయా రాష్ట్రాలకు సమాచారమిచ్చింది. 
►2014 వరకు ఉమ్మడి ఏపీకి సంబంధించి ఫింగర్‌ ప్రింట్‌ బ్యూరో వివరాలన్నీ ఈ టెక్నాలజీకి అనుసంధానించారు. 
►క్రైమ్‌ అండ్‌ క్రిమినల్‌ నెట్‌వర్కింగ్‌ సిస్టమ్‌ తో తన టెక్నాలజీని తొలిసారి అనుసంధానించింది పాపిలాన్‌ కావడం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement